ఫాంహౌస్‌కి వస్తే 25 లక్షలు ఇస్తా... బిగ్‌బాస్ బ్యూటీకి ప్రొడ్యూసర్‌ లైంగిక వేధింపులు

సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ గురించి రోజుకొక విషయం వెలుగుచూస్తోంది. జూనియర్ ఆర్టిస్టుల నుంచి స్టార్ హీరోయిన్ల వరకు ఈ క్యాస్టింగ్ కౌచ్ బారినపడిన వారే. కొందరు ఈ వేధింపులను గుండెల్లో పెట్టుకుని బాధపడుతుంటే.. మరికొందరు మాత్రం తమలా మరో అమ్మాయికి కాకూడదని నిజాలు బయటపెడుతుంటారు. తాజాగా బిగ్‌బాస్ కంటెస్టెంట్ కిర్రాక్ సీత.. తన జీవితంలో ఓ ప్రొడ్యూసర్ నుంచి ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ ఇన్సిడెంట్ గురించి బయటపెట్టారు. ఈ వివరాల్లోకి వెళితే..

బేబీ సినిమాతో పాపులర్ అయ్యారు కిర్రాక్ సీత అలియాస్ సుప్రజ. ఈ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్‌గా నెగిటివ్ రోల్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. హీరోయిన్‌ని చెడగొట్టే క్యారెక్టర్‌లో నటించిన కిర్రాక్ సీతపై కొందరు ప్రేక్షకులు కక్షగట్టి ఆమెను ఫాలో అయ్యారు. ఏకంగా రేప్ చేస్తామని, చంపేస్తామని బెదిరింపులు వచ్చాయంటే సీత నటనను అర్ధం చేసుకోవచ్చు. నిజానికి చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి పైకొచ్చారు.. కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లోనే తల్లిదండ్రులపై ఆధారపడకూడదని ప్రైవేట్స్ చెప్పింది. కూచిపూడి, భరత నాట్యంలో మంచి ప్రావీణ్యం సంపాదించింది.

Bigg Boss Fame Kirrak Seetha Reveals Shocking Casting Couch Experience in Film Industry

ఈ దశలో 7 ఆర్ట్స్ సరయూతో పరిచయం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. సరయూతో కలిసి చాలా వీడియోలు చేయడంతో పాటు బోల్డ్ కంటెంట్, డబుల్ మీనింగ్ డైలాగ్స్ కారణంగా ఈ వీడియోలు బాగా పాపులర్ అయ్యాయి. 7 ఆర్ట్స్ ద్వారా వచ్చిన పాపులారిటీతో సినిమాలలో అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత బిగ్‌బాస్‌లో ఛాన్స్ కొట్టేసింది. బిగ్‌బాస్‌లో 40 రోజుల పాటు హౌస్‌లో ఉన్న కిర్రాక్ సీత.. స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించుకుంది. అప్పట్లో ఆమె ఎలిమినేషన్‌ను చాలామంది అభిమానులు వ్యతిరేకించారు కూడా.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సీత మాట్లాడుతూ.. 7 ఆర్ట్స్‌లో షూట్ చేస్తున్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి నాకు కాల్ చేశాడు. కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడితే.. సినిమాలో ఆఫర్ ఉందన్నాడు. ఎవరికైనా సినిమాలో ఆఫర్ వచ్చిందంటే హ్యాపీగానే ఫీల్ అవుతాం కదా. అప్పుడు నేను చిన్నపిల్లని 21 ఏళ్లు ఉంటాయి. సినిమా చేస్తానని నేను ఓకే చెప్పగా.. ఫాంహౌస్‌కి రావాలని చెప్పారు. ఫాంహౌస్‌కి ఎందుకండి.. ఆఫీస్‌ ఉంటుంది కదా అని అడిగితే.. మొత్తం టీమ్‌ని పిలుస్తున్నారని చెప్పడంతో సరేనని అన్నాను. కానీ ఫాంహౌస్‌కి వెళ్లలేదు.. సాయంత్రం వచ్చిన కాల్స్ లిఫ్ట్ చేయలేదు, వాళ్లు కూడా నన్ను ప్రెజర్ చేయలేదు. అయితే రెండు మూడు రోజుల తర్వాత వాళ్లు కాల్ చేసి ఎందుకు రాలేదని అడిగారు. నాకు కరెక్ట్ కాదని అనిపించిందని చెప్పడంతో మీకు 25 లక్షలు ఇస్తారట అని చెప్పడంతో నేను నో చెప్పేశానని కిర్రాక్ సీత తెలిపారు.

తరచుగా ఇలాంటి కాల్స్ వస్తూనే ఉంటాయి.. నార్మల్‌గా మెసేజ్‌లు కూడా పెడుతుంటారు. మీ నెంబర్ ఎవరికైనా దొరికితే.. మేము ఒక సిరీస్ తీస్తున్నామని చెబుతారు. నేను ఓకేనంటే మీకు ఇండస్ట్రీలో పరిస్ధితులు తెలుసు కదా అని అంటారు. ఎలా ఉంటదని అడిగితే .. వాళ్లు ఏదో ఒకటి చెబుతారు. నేను నీకు సిగ్గుందా అని అంటాను. కొంతమంది సరదాగా చేస్తారు.. వాళ్లు ఇండస్ట్రీకి చెందిన వాళ్లు కాదు. వాళ్లకు నేనెవరో తెలియదు.. కానీ ఆమె అలాంటిది, ఇలాంటి ఒకసారి టెస్ట్ చేద్దామని కాల్స్ చేస్తుంటారని కిర్రాక్ సీత చెప్పింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read more about: bigg boss kirrak seetha
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X