‘బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్‌కు సైడ్ ఎఫెక్ట్స్ ఇవే... ఆ 45 రోజుల్లో నా జీవితాన్ని కోల్పోయా’

ఇండియాలో టాప్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్‌బాస్. హిందీలో ప్రారంభమైన ఈ మెగా షో.. ఆ తర్వాత దేశంలోని ప్రాంతీయ భాషలకు విస్తరించింది. బిగ్‌బాస్‌లో పాల్గొన్న సెలబ్రిటీలకు వస్తున్న క్రేజ్, ఫేమ్‌తో చాలామంది ఇందులో పాల్గొనాలని ఉవ్విళ్లూరుతున్నారు. కొందరు సామాన్యులు కూడా బిగ్‌బాస్ విజేతలుగా నిలిచి.. ఈ షోకు క్రేజ్ తీసుకొచ్చారు. అయితే బిగ్‌బాస్‌లో మూడు నెలల పాటు ఉండటం, హౌస్‌ నుంచి బయటికొచ్చాక కొత్తగా ఉండటం, ఒత్తిడి వంటి వాటిని కంటెస్టెంట్స్ అనుభవించారు. తాజాగా బిగ్‌బాస్ తెలుగు కంటెస్టెంట్ కిర్రాక్ సీత.. తన బిగ్‌బాస్ అనుభవాలను వెల్లడించారు. ఈ వివరాల్లోకి వెళితే...

బేబీ సినిమా తర్వాత నాకు చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేదు. నాకు అవకాశాల్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలియదు, పీఆర్ అంటే తెలియదు. బేబీ హిట్ కావడంతో చాలామంది పర్సనల్‌గా తీసుకున్నారు. బేబీకి ముందు నాకు 5 వేల మంది ఫాలోవర్స్ ఉంటే.. ఒక్క నైట్‌కే అది 60 వేలకు చేరుకుంది. అంతలా బేబీ ఇంపాక్ట్ ఇచ్చింది. బిగ్‌బాస్‌ను ఎలా డీల్ చేయాలో కూడా తెలియదు. టెలివిజన్‌కు కొత్త.. కంటెంట్ అంటే నాకు తెలియదు. రియాలిటీ షోలలో ఏం చేయాలో ఐడియా లేదు. ఎమోషన్స్ నన్ను ఓవర్‌టేక్ చేశాయని కిర్రాక్ సీత పేర్కొన్నారు.

Bigg Boss fame Kirrak Seetha Reveals Shocking Experiences After Bigg Boss Show

స్వతహాగా ఎమోషనల్ కావడంతో అవే నన్ను నడిపిస్తున్నాయి. బిగ్‌బాస్ ముందు జాబ్ కూడా మానేశాను. అప్పటి వరకు జాబ్, యాక్టింగ్ రెండూ మేనేజ్ చేశాను, బిజినెస్ హ్యాండిల్ చేశాను. పీఆర్ చేసుకుంటే ఎక్కువ అవకాశాలు వచ్చేవని నాకు తెలియదు, బిగ్‌బాస్ అప్పుడు కూడా తెలియదు. ఈ విషయంలో ఎవరినీ నిందించడానికి లేదు. నా యాక్టింగ్ చూశారు కాబట్టి.. అవే వస్తాయని అనుకున్నాను. పెద్ద సినిమా అని తక్కువ రెమ్యునరేషన్‌కి పనిచేయడం, చిన్న సినిమా అని ఎక్కువ డబ్బులకు పనిచేసిన రోజులు కూడా ఉన్నాయి. ఈ రోల్ మనకు తిండి పెడుతుందని తీసుకున్న పరిస్ధితులు కూడా ఉన్నాయని సీత తెలిపారు.

కొందరైతే నెగిటివ్ పీఆర్ కూడా చేయించుకుంటున్నారు. మంచో, చెడో సోషల్ మీడియాలో నీ గురించి డిస్కషన్ జరుగుతున్నదా లేదా అన్నదే ముఖ్యం. బిగ్‌బాస్‌లో కూడా పీఆర్ ఉంటుంది. నిన్ను లేపాలి కానీ పక్కనోడిని ఎందుకు డౌన్ చేస్తారో అర్ధం కాదు. ఈ రివ్యూ అన్న కాన్సెప్ట్ ఏంటో తెలియదు.. నా మెంటాలిటీ గురించి రివ్యూ ఇవ్వడానికి వేరేవాళ్లు ఎవరు. నీ క్యాండిడేట్‌లో మంచి ఉంటే వెతుకు. మా గురించి నీకెందుకు. నెగిటివ్ కామెంట్స్ పెట్టించడం, ఫేక్ న్యూస్, ఫేక్ రివ్యూస్ ఇలా చాలా ఉంటాయి. బిగ్‌బాస్‌కి వెళ్లేముందు పీఆర్‌ని పెట్టుకున్నా.. వర్కవుట్ కాకపోవడంతో కట్ చేశాను. హౌస్‌లో ఉన్న వారమైనా నన్ను యాక్సెప్ట్ చేసేవాళ్లు చాలు అనుకున్నానని సీత వెల్లడించారు

బిగ్‌బాస్ నుంచి బయటికి వచ్చాక బయట కొత్తగా అనిపిస్తుంది... ఏం అర్ధం కాదు. యాక్టింగ్ చేస్తాము, సోషల్ మీడియాలో వీడియోలు పెడతాము. ఉదయం లేచినప్పటి నుంచి ఒకరి తప్పులు ఎలా వెతకాలి అనుకుంటాము. హౌస్‌లో ఉన్నవాళ్లని మనవాళ్లని ఎందుకు అనుకుంటాం. బిగ్‌బాస్‌కి అందరూ వెళ్లలేరు, అందరూ ఉండలేరు. ఈ ఫేమ్ కొద్దిసేపు మాత్రమే.. ఏడాది తర్వాత బిగ్‌బాస్ కొత్త సీజన్ స్టార్ట్ అవ్వగానే వాళ్లు హైలైట్ అవుతారు. బిగ్‌బాస్ ఫేమ్ కొంతమందికే ఉపయోగపడుతుంది. బయటకు రాగానే బిగ్‌బాస్‌లో ఉన్నవాళ్లే కావాలని అనిపించేది... మీరంతా ఎవరు? నాతో ఎందుకు మాట్లాడుతున్నారని అడిగేదానిని.

చివరికి కారు ఎలా నడపాలో కూడా మరిచిపోయా, నా ఫోన్ పాస్‌వర్డ్ మరిచిపోయా. మా అమ్మ ముఖం మాత్రమే గుర్తుంది.. మా నాన్న ఫేస్ గుర్తులేదు. 45 రోజుల్లోనే నా ప్రపంచాన్ని నేను కోల్పోయా. ఏదైనా ఐలాండ్‌లో చిక్కుకున్న వాడికి ఇక్కడి నుంచి ఎలా బయటపడాలి అని మాత్రమే ఉంటుంది. అదే బిగ్‌బాస్‌లోనూ నేను గెలవాలి? ఎలిమినేట్ కాకూడదని ఉండేది. బయటి ఫ్రెండ్స్‌ని పూర్తిగా మరిచిపోతాం.. బిగ్‌బాస్ సెలబ్రిటీలు బయటికొచ్చాక కొన్నాళ్లు జీవితం చాలా కష్టంగా ఉంటుందని కిర్రాక్ సీత తెలిపారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read more about: bigg boss kirrak seetha
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X