బాత్రూంలో టవల్‌తో బిగ్ బాస్ లహరి: వెనుక నుంచే అది హైలైట్ అయ్యేలా ఫోజు
గతంలో కంటే ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో రెండు రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలు ఎక్కువగా సందడి చేస్తున్నారు. హీరోయిన్లుగానో, సపోర్టింగ్ రోల్స్ చేస్తూనే ప్రేక్షకులను అలరిస్తున్నారు. అలాంటి వారిలో బోల్డు బ్యూటీ లహరి షారి ఒకరు. చాలా కాలం క్రితమే సినిమాల్లోకి ఎంటరైన ఈ లేడీ.. అనుకున్న రేంజ్‌లో సక్సెస్ కాలేదు. కానీ, బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా వచ్చిన తర్వాత మాత్రం ఫుల్ పాపులర్ అయింది. అప్పటి నుంచి జెట్ స్పీడుతో దూసుకెళ్తోంది. ఇక, తాజాగా లహరి షారి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ బోల్డ్ ఫొటో వదిలింది. అది మీరే చూసేయండి మరి!
సారీ నాకు పెళ్లైంది అంటూ : హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వాలన్న కోరికతో మోడల్‌గా కెరీర్‌ను మొదలు పెట్టిన లహరి షారి ఎన్నో ఫ్యాషన్ ఈవెంట్లలో పాల్గొంది. అలా ఫిల్మ్ మేకర్ల దృష్టిని ఆకర్షించింది. దీంతో 2014లో వచ్చిన 'సారీ నాకు పెళ్లైంది' అనే మూవీతో ఆమె నటిగా వచ్చింది. ఆ తర్వాత బుల్లితెరపైకి వచ్చి కొన్ని షోలు చేసింది. వీటి తర్వాత న్యూస్ ఛానెల్‌లోనూ లహరి ప్రజెంటర్‌గానూ పని చేసింది.

ఎన్నో సినిమాలతు చేసినా : సినిమాలకు కాస్త గ్యాప్ తీసుకున్న లహరి షారి 'అర్జున్ రెడ్డి' సినిమాతో మళ్లీ ఎంట్రీ ఇచ్చింది. దీని తర్వాత ఈ తెలుగమ్మాయి వరుసగా 'మళ్లీ రావా', 'పటేల్ సార్', 'అజ్ఞాతవాసి', 'పేపర్ బాయ్', 'శ్రీనివాస కల్యాణం', 'తిప్పరా మీసం', 'జాంబీ రెడ్డి' వంటి సినిమాల్లో కీలక పాత్రలను చేసింది. అయినప్పటికీ ఆమెకు కావాల్సిన గుర్తింపు మాత్రం లభించలేదు.
బిగ్ బాస్ షోతో ఫుల్లు క్రేజ్ : సినిమా నటిగా ఎదిగేందుకు కష్టపడుతున్న సమయంలోనే లహరి షారి.. బిగ్ బాస్ ఐదో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొనే అవకాశాన్ని అందుకుంది. ఇందులోకి సాదాసీదాగానే ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు అందంతో పాటు ఆటతీరుతో ఆకట్టుకుంది. అంతేకాదు, నిజాయితీగా ఉంటూ, నిర్భయంగా మాట్లాడుతూ మంచి పేరును తెచ్చుకోవడంతో పాటు క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంది.

అలాంటివి చేస్తూ బిజీగానే : బిగ్ బాస్ షోలో గెలవకున్నా విశేషమైన పేరును సొంతం చేసుకున్న లహరి షారికి ఒక్కసారిగా సినిమా అవకాశాలు వెల్లువెత్తాయి. దీంతో ఆమె ఇప్పటికే పలు చిత్రాల్లో కూడా నటించింది. అంతేకాదు, సినిమా ఫంక్షన్లు, ఈవెంట్లు, ఇంటర్వ్యూలు, ప్రారంభోత్సవాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది. ఇప్పుడు ఎన్నో చిన్న బడ్జెట్ చిత్రాల్లో సైతం హీరోయిన్‌గా ఎంపిక అయింది.
అక్కడ మాత్రం యాక్టివ్‌గా : నటిగా పరిచయం అయిన కొత్తలోనే లహరి షారి సోషల్ మీడియాలో బాగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక, హీరోయిన్‌గా సత్తా చాటుతోండడం.. బిగ్ బాస్ షోలో పాల్గొనడంతో ఈ అమ్మడు ఇందులో మరింతగా సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది.

గ్లామర్ ట్రీట్‌తో కవ్విస్తూనే: సోషల్ మీడియాలో ఎన్నో ఏళ్లుగా హడావిడి చేస్తోన్న లహరి షారి.. అందాలను కూడా ఆరబోస్తూ అరాచకం సృష్టిస్తోంది. మరీ ముఖ్యంగా బిగ్ బాస్ తర్వాత మరింత స్పీడు పెంచేసిన ఈ భామ.. అప్పుడప్పుడూ విపరీతంగా హాట్ షో చేస్తోంది. ఇందులో భాగంగానే నిత్యం హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను ఇంటర్నెట్‌లో షేర్ చేస్తోంది. ఫలితంగా తన అందంతో మాయ చేసేస్తోంది.
లహరి లేటెస్ట్ పిక్ వైరల్ : లోకల్ బోల్డు లేడీ లహరి షారి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఘాటు ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు బాత్రూంలో స్నానం చేసిన తర్వాత టవల్ కట్టుకుని కనిపించింది. వెనుక నుంచి తీసుకున్న ఈ పిక్‌లో ఆమె టాటూ యమ హైలైట్ అవుతోంది. దీంతో ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి రెస్పాన్స్ దక్కుతోంది. ఫలితంగా లహరి పిక్ యమ వైరల్‌గా మారిపోయింది.


Click it and Unblock the Notifications











