స్విమ్మింగ్ పూల్‌లో బిగ్ బాస్ భామ రచ్చ: తడిచిన బట్టల్లో అందాల ప్రదర్శన

గతంలో కంటే ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంతో మంది అమ్మాయిలు విపరీతంగా పాపులారిటీని సొంతం చేసుకుంటోన్నారు. ఫలితంగా అటు బుల్లితెరపైనో.. ఇటు వెండితెర మీదనో ఆఫర్లను దక్కించుకుంటోన్నారు. తద్వారా కెరీర్‌లను సక్సెస్‌ఫుల్‌గా నడుపుకుంటోన్నారు. అలాంటి వారిలో బిగ్ బాస్ ఫేం లహరి షారి ఒకరు.

చాలా కాలం క్రితమే సినిమాల్లోకి ఎంటరైన ఈ భామ.. బిగ్ బాస్ ఎంట్రీ తర్వాత మరింత ఫేమస్ అయింది. అప్పటి నుంచి రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ లహరి షారి ఓ రేంజ్‌లో సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తాజాగా స్విమ్మింగ్ పూల్‌లో తీసుకున్న ఓ వీడియోను వదిలింది. దానిపై మీరూ లుక్కేయండి మరి!

అలా పరిచయం.. గుర్తింపు రాలేదు

అలా పరిచయం.. గుర్తింపు రాలేదు

సినిమాల్లోకి రాడానికి ముందే మోడలింగ్ రంగంలో లహరి షారి సందడి చేసింది. అప్పుడే ఎన్నో బ్రాండ్లకు ప్రచారకర్తగానూ వ్యవహరించింది. ఆ సమయంలోనే సినిమా వాళ్ల దృష్టిలో పడింది. ఇలా 2014లో 'సారీ నాకు పెళ్లైంది' అనే సినిమాతో పరిచయమైంది. ఆ తర్వాత బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చి పలు షోలు చేసింది. అలాగే న్యూస్ ఛానెల్‌లోనూ పని చేసినా గుర్తింపు రాలేదు.

చాలా చిత్రాలు... బ్రేక్ దక్కలేదుగా

చాలా చిత్రాలు... బ్రేక్ దక్కలేదుగా

న్యూస్ ఛానెల్‌లో పని చేస్తోన్నప్పుడే లహరి షారి 'అర్జున్ రెడ్డి' చిత్రంతో మరోసారి వెండితెరపై మెరిసింది. దీని తర్వాత ఈ తెలుగమ్మాయి వరుసగా 'మళ్లీ రావా', 'పటేల్ సార్', 'అజ్ఞాతవాసి', 'పేపర్ బాయ్', 'శ్రీనివాస కల్యాణం', 'తిప్పరా మీసం', 'జాంబీ రెడ్డి' వంటి చిత్రాల్లో నటించింది. ఇలా ఎన్నో చేసినా ఈ అమ్మడికి బ్రేక్ మాత్రం దక్కలేదు.

బిగ్ బాస్ చాన్సుతో ఫుల్‌ పాపులర్

బిగ్ బాస్ చాన్సుతో ఫుల్‌ పాపులర్

వరుసగా సినిమాలు చేస్తూ సందడి చేస్తోన్న సమయంలోనే లహరి షారికి బిగ్ బాస్ ఐదో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొనే అవకాశం దక్కింది. ఇందులోకి సాదాసీదాగానే ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు అందంతో పాటు ఆటతీరుతో అలరించింది. అంతేకాదు, నిజాయితీగా ఉంటూ, నిర్భయంగా మాట్లాడుతూ పాపులర్ అయింది. కానీ, మధ్యలోనే ఎలిమినేట్ అయిపోవాల్సి వచ్చింది.

 షో తర్వాత బిజీగా మారిన లహరి

షో తర్వాత బిజీగా మారిన లహరి

గతంలో ఎన్నో చిత్రాల్లో నటించినా.. బిగ్ బాస్ షో వల్లే లహరి షారికి సరైన గుర్తింపు దక్కింది. దీంతో ఆమె కెరీర్ మరోసారి ఊపందుకుంది. ఫలితంగా ఈ అమ్మడు టాలీవుడ్‌లో వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. అదే సమయంలో సినిమా ఫంక్షన్లు, ఈవెంట్లు, ఇంటర్వ్యూలు, ఓపెనింగ్స్ చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది. దీంతో ఆమె తెగ హైలైట్ అవుతోంది.

సోషల్ మీడియాలో సందడి చేస్తూ

సోషల్ మీడియాలో సందడి చేస్తూ

సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే లహరి షారి సోషల్ మీడియాలో బాగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక, హీరోయిన్‌గా సత్తా చాటుతోండడంతో ఈ అమ్మడు ఇందులో మరింతగా సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. తద్వారా ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది.

గ్లామర్ ట్రీట్‌తో ఓ రేంజ్‌లో రచ్చ

ఈ మధ్య కాలంలో వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతోన్న లహరి షారి.. సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బిగ్ బాస్ తర్వాత మరింత స్పీడు పెంచేసిన ఈ బ్యూటీ.. అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోంది. మరీ ముఖ్యంగా హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ తెగ ట్రెండింగ్ అయిపోతోంది.

స్విమ్మింగ్ పూల్‌ వీడియో వైరల్

స్విమ్మింగ్ పూల్‌ వీడియో వైరల్

బిగ్ బాస్ భామ లహరి షారి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు స్విమ్మింగ్ పూల్‌లో జలకాలాడుతూ దర్శనమిచ్చింది. ఆ తర్వాత పైకి వస్తూ తడిచిన బట్టల్లో తన ఒంపుసొంపులను చూపించింది. దీంతో ఆమె అందాలు బాగా కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా ఈ వీడియోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X