Loboకు వరుస గుడ్ న్యూస్ లు.. మొన్న చిరు సినిమాలో ఆఫర్.. ఇప్పుడు మరో శుభవార్త.. ఏంటంటే?

బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో ఎంటర్ అయి ప్రేక్షకుల వద్ద మంచి పేరు తెచ్చుకున్న ఆ తర్వాతి కాలంలో ఎలిమినేటర్ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. వచ్చిన తర్వాత చిరంజీవి సినిమాలో నటించే అవకాశం దక్కించుకున్న లోబో ఇంట్లో ఇప్పుడు సంతోషం వెళ్లి విరుస్తోంది. దానికి కారణం లో భార్య ఇద్దరు కవల పిల్లలకు జన్మనివ్వడం. ఆ వివరాల్లోకి వెళితే

మహమ్మద్ ఖయ్యుమ్

మహమ్మద్ ఖయ్యుమ్

లోబో హైదరాబాద్ కుషాయి గూడలో మొదట టాటూ ఆర్టిస్ట్ గా కెరీర్ ను స్టార్ట్ చేశాడు. గోవాలో పని నేర్చుకుంటున్న సమయంలో ఫస్ట్ టాటూ ఒక రష్యన్ అమ్మాయికి వేయడంతో ఆమె లోబోకు ఆ పేరు పెట్టింది. నా అసలు పేరు మహమ్మద్ ఖయ్యుమ్. 9వ తరగతి చదివిన ఆయన అప్పట్లోనే ఫ్యాన్ దొంగతనం చేయడంతో అప్పుడే టీ సి ఇచ్చేసి పంపేశారు.

 కెరీర్ కు చాలా హెల్ప్

కెరీర్ కు చాలా హెల్ప్

ఇక బిగ్ బాస్ అనేది కెరీర్ కు చాలా హెల్ప్ అవుతుందని లోబో ఆశాభావం వ్యక్తం చేసాడు. ప్రస్తుతం మనం 5వ స్టేజ్ లో ఉన్నాము అంటే డైరెక్ట్ గా 25వ స్టేజ్ లోకి వెళ్లినట్లేనాని ఆయన మొదట్లోనే చెప్పుకొచ్చాడు. ఏడు రంగులు ఉంటే రెయిన్ బో అంటారు. నెత్తి మీద మరొక రంగు ఉంటే లోబో అంటారు అని నాగార్జున కూడా లోబో స్టైల్ పై పాజిటివ్ గా స్పందించారు అంటే లోబో క్రేజ్ అర్ధం చేసుకోవచ్చు.

 మధ్యలో ఎలిమినేట్ అయి

మధ్యలో ఎలిమినేట్ అయి

ఒక‌ప్పుడు టీవీ షోలు, ఈవెంట్లు హోస్ట్ చేస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన లోబో బిగ్‌బాస్‌ ఆఫ‌ర్ రావడంతో ఈ సీజన్ లో బిగ్ బాస్ కి వచ్చాడు. త‌న కామెడీతో హౌస్ లో ఎంట‌ర్‌టైన్ చేశాడు కానీ కాలం కలిసి రాక కొన్ని రోజులు సీక్రెట్ రూంలో కూడా ఉన్నాడు. అయినా సరే బయటకు వచ్చాక ఏమాత్రం మారక పోవడంతో మధ్యలో ఎలిమినేట్ అయి వచ్చేశాడు. ఇక అందరి కంటెస్టెంట్స్ లాగే లోబోకు కూడా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆఫర్స్ బాగానే వస్తున్నాయి.

మెగాస్టార్ సినిమాలో ఛాన్స్

మెగాస్టార్ సినిమాలో ఛాన్స్

లోబో ఏకంగా మెగాస్టార్ సినిమాలో ఛాన్స్ కొట్టేశాడు. లోబో తన ఇన్‌స్టాగ్రామ్‌లో చిరంజీవితో ఉన్న ఫోటోని షేర్‌ చేస్తూ ''నా కల నిజమైంది. చిరంజీవి సార్‌ సినిమాలో ఆఫర్‌ వచ్చింది'' అంటూ పోస్ట్ చేశాడు. ఇటీవల ఓ టీవీ షోలో కూడా తనకి చిరంజీవి సినిమా ఆఫర్‌ వచ్చిందని ఎమోషనల్ అయ్యాడు లోబో. ఎక్కువ నిడివి ఉన్న పాత్ర వచ్చిందని, ఈ ఆఫర్ 'భోళా శంకర్' సినిమాలో వచ్చిందని కూడా చెప్పారు.

ఇంట్లో సంతోష వాతావరణం

ఇంట్లో సంతోష వాతావరణం

ఇక తాజా విషయం ఏమిటంటే లోబో ఇంట్లో సంతోష వాతావరణం నెలకొంది. దానికి కారణం ఆయన భార్య కవల పిల్లలకు జన్మనివ్వడమే. ఆమెకు ప్రసవంలో ఒక బాబు, ఒక పాప జన్మించారు. లోబోకు ఇప్పటికే కుమార్తె ఉండగా ఆమె వీడియో బైట్ కూడా హౌస్ లో ప్రదర్శించారు. ఆ సమయంలో లోబో కన్నీటి పర్యంతమయ్యారు. హౌస్ లో ప్రదర్శించిన ఈ వీడియోలో లోబో కుమార్తె ముద్దు ముద్దుగా మాట్లాడింది. నాన్న నువ్వు విజయం సాధిస్తే నేను కూడా హ్యాపీగా ఉంటాను అని చెప్పింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X