క్రేజీ న్యూస్.. తెలుగు బుల్లితెరపై షారుక్ ఖాన్.. మానస్, హమీదా సీరియల్ కోసం రంగంలోకి పఠాన్!

షారుక్ ఖాన్ తనదైన శైలీలో సినిమాలు చేస్తూ బాలీవుడ్ కు బాద్ షా అయ్యాడు. సుధీర్ఘమైన ఆయన సినీ ప్రయాణంలో అశేష అభిమానగనాన్ని సంపాదించుకున్నాడు కింగ్ ఖాన్ షారుక్ ఖాన్. దాదాపుగా 80కి పైగా చిత్రాల్లో నటించిన షారుక్ ఖాన్ 14 ఫిలీం ఫేర్ అవార్డులను పొందాడు. అంతేకాకుండా ఎంతో మంది హీరోయిన్లను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ కు ఉంది. అలా పరిచయం చేసినవాళ్లలో దీపికా పదుకొణె ఒకరు. ఇప్పుడు వాళ్లిద్దరు మరోసారి జంటగా కలిసి నటిస్తున్న చిత్రం పఠాన్. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక తెలుగు సీరియల్ కోసం రంగంలోకి దిగాడు షారుక్ ఖాన్.

ప్రపంచవ్యాప్తంగా..

ప్రపంచవ్యాప్తంగా..

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్, బ్యూటిఫుల్ దీపిక పదుకొణె మరోసారి జంటగా నటించిన చిత్రం పఠాన్. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 25, 2023న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ప్రముఖ హిందీ నిర్మాణ సంస్థ యష్ ఫిలిమ్స్ బ్యానర్ లో వస్తున్న ఈ చిత్రంలో హీరో జాన్ అబ్రహం కీలక పాత్ర పోషిస్తున్నాడు. అలాగే ఈ మూవీలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా అతిధి పాత్రలో మెరవనున్నాడని టాక్ వినిపిస్తోంది.

భారీగా ఆశలు..

భారీగా ఆశలు..

చాల కాలం గ్యాప్ తర్వాత షారుక్ ఖాన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అభిమానులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. అందుకు తగినట్లుగానే పఠాన్ షూటింగ్ తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇక పఠాన్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్రంలోని ఫస్ట్ సింగిల్ బేషరమ్ రంగ్ పాటను డిసెంబర్ 12వ విడుదల చేసిన విషయం తెలిసిందే. షారుక్, దీపికల హాట్ నెస్ తో బేషరమ్ రంగ్ సాంగ్ ఎంత క్రేజ్ తెచ్చుకుందో అంతే విమర్శల పాలయింది.

200 నగరాల్లో విడుదల..

200 నగరాల్లో విడుదల..

ఇందులో దీపికా పదుకొణె కాషాయ రంగు బికినీ ధరించడంపై మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రి నరోత్తమ్ మిశ్రాతోపాటు పలు సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అలాగే సినిమాను విడుదల చేయడం ఆపాలని డిమాండ్ కూడా చేశారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలోని బేషరమ్ సాంగ్ లో అభ్యంతరకర సన్నివేశాలు తొలగిస్తూ సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా 200 నగరాల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

రామ్ చరణ్ తో ట్రైలర్..

రామ్ చరణ్ తో ట్రైలర్..

దాదాపుగా మూడేళ్ల తర్వాత షారుక్ ఖాన్ సినిమా విడుదల కావడం, అంతకుముందు సినిమాలు ఫ్లాప్ కావడంతో ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు బాద్ షా అభిమానులు. ఇక ఈ సినిమా కోసం ప్రమోషన్స్ అయితే గట్టిగానే చేస్తున్నారనిపిస్తోంది. ఇటీవలే ఈ మూవీ తెలుగు ట్రైలర్ ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేశారు. అలాగే RRR కు ఆస్కార్ అవార్డ్ వస్తే దాన్ని తాకనీయమంటూ ఫన్నీ ట్వీట్ కూడా చేశాడు షారుక్.

కొత్త సీరియల్ కోసం షారుక్..

ఇదిలా ఉంటే పఠాన్ సినిమా ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తున్నాడు షారుక్ ఖాన్. అందుకోసం తెలుగు బుల్లితెరపై ప్రత్యక్షం అవ్వనున్నాడా అనే అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే స్టార్ మాలో త్వరలో ప్రసారం అయ్యే కొత్త సీరియల్ "బ్రహ్మముడి: ఒకరికి ఒకరై"ని ప్రమోట్ చేస్తూ కనిపించారు బాద్ షా షారుక్. తాజాగా స్టార్ మా షేర్ చేసిన "బ్రహ్మముడి: ఒకరికి ఒకరై" గ్రాండ్ లాంచ్ గురించి చెప్పుకొచ్చాడు షారుక్ ఖాన్.

కార్తీక దీపం స్థానంలో..

స్టార్ మా చేసిన ఈ ట్వీట్ లో బ్రహ్మముడి సీరియల్ ను గ్రాండ్ గా షారుక్ ఖాన్ లాంచ్ చేయనున్నట్లు తెలిపింది. స్వర్గంలో నిర్ణయించిన పెళ్లిగా ఈ సీరియల్ కథను అభివర్ణించారు. జనవరి 24 నుంచి స్టార్ మాలో ప్రతిరోజు రాత్రి 7:30 నిమిషాలకు ప్రసారం కానుంది. ఈ సీరియల్ లో బిగ్ బాస్ ఫేమ్ మానస్, హమిదాతోపాటు దీపిక గంగరాజు ప్రధాన పాత్రలు పోషించనున్నారు. ఈ సీరియల్ కార్తీక దీపం స్థానంలో ప్రసారం కానుందని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X