నా ప్రాణం నీదే.. నా లవ్ బగ్ నువ్వే.. నటి ప్రియ ఎమోషనల్ పోస్ట్
టెలివిజన్ రంగం మనదేశంలో నానాటికీ విస్తరిస్తుండగా బుల్లితెర నటీనటులకు అంతే పాపులారిటీ దక్కుతోంది. హీరోయిన్లను మించిన అందంతో మెరిసిపోతున్నారు సీరియల్ భామలు. ఈ కోవలోకే వస్తారు శైలజా ప్రియ. వెండితెర నుంచి బుల్లితెరపై అడుగుపెట్టిన ఈ నటి.. 47 ఏళ్ల వయసులోనూ చెక్కు చెదరని గ్లామర్‌తో మెరిసిపోతున్నారు. సోషల్ మీడియాలో హల్‌చల్ చేసే శైలజా ప్రియ తాజాగా పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..
30 ఏళ్ల కెరీర్
గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన శైలజా ప్రియ తొలుత సినిమాల్లో చిన్నాచితకా పాత్రలు పోషించారు. మాస్టర్, రాజకుమారుడు, గోకులంలో సీత, కత్తి కాంతారావు, మిర్చి, సన్నాఫ్ సత్యమూర్తి, రారండోయ్ వేడుక చూద్దాం సహా దాదాపు 200కు పైగా సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు శైలజా ప్రియ. అయితే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు 30 ఏళ్లు కావొస్తున్నా తన ప్రతిభకు తగ్గ స్థాయిలో అవకాశం దక్కలేదని ఆమె పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నేళ్ల కెరీర్‌లో ఒక్క వివాదం కూడా లేకుండా కొనసాగుతున్నారు ప్రియ. కెరీర్‌లో పీక్స్‌లో ఉండగానే ఎంవీవీఎస్ కిషోర్‌ను శైలజా ప్రియ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఓ కుమారుడు.

సీరియల్స్‌లోనూ బిజీ
సినిమాలు చేస్తూనే బుల్లితెర పైనా శైలజా ప్రియ బిజీ అయ్యారు. లేడీ డిటెక్టివ్, సంఘర్షణ, జ్వాల, కొత్త బంగారం, మానస, చిన్న కోడలు, కృష్ణ ముకుందా మురారి, శశిరేఖా పరిణయం, నెం 1 కోడలు, నంది వర్సెస్ నందిని తదితర సీరియల్స్‌తో ఇక్కడా సత్తా చాటారు. ఈ క్రమంలో అనూహ్యంగా తెలుగు నాట టాప్ రియాలిటీ షోగా ఉన్న బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా అవకాశం దక్కించుకున్నా శైలజా ప్రియ. తొలుత గేమ్‌ను అర్ధం చేసుకోవడంలో ఇబ్బంది పడినప్పటికీ ఆ తర్వాత దుమ్మురేపారు. కుర్రాళ్లకు ఏమాత్రం తగ్గకుండా అన్నింటిలోనూ దూకుడుగా ఆడారు. కొన్నాళ్లు హౌస్‌లో ఉంటారని ప్రేక్షకులు భావించినప్పటికీ.. అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యారు ప్రియ.
బిగ్‌బాస్‌తో పాపులారిటీ
ఏడు వారాల పాటు బిగ్‌బాస్‌లో గడిపిన శైలజా ప్రియ భారీగానే లాభపడినట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. 7 వారాల పాటు హౌస్‌లో ఉన్న శైలజా ప్రియకు.. వారానికి 1.5 లక్షల రూపాయల చొప్పున 7 వారాలకు గాను 10 లక్షలకు పైగా పారితోషికం కింద అందుకున్నట్లు వార్తలు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. బిగ్‌బాస్ షో తర్వాత ఆమె జనంలో మరింత పాపులర్ అయ్యారు. ప్రియ సోషల్ మీడియా ఖాతాలకు కూడా ఫాలోవర్స్ పెరిగారు.
ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్ట్
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే శైలజా ప్రియ .. ఎప్పటికప్పుడు తన సినిమాలు, షోలు, ఇతర ఈవెంట్ల వివరాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తన ఇంట్లో ఏవైనా ప్రత్యేక కార్యక్రమాలతో పాటు కొడుకుతో చేసే అల్లరికి సంబంధించిన వీడియోలు పోస్ట్ చేస్తుంటారు ప్రియ. తాజాగా ఓ ఛానెల్‌లో ప్రసారమవుతున్న కుక్ విత్ జాతి రత్నాలు అనే వంట కార్యక్రమంలో కంటెస్టెంట్‌గా హాజరైన ప్రియ అందంగా ముస్తాబయ్యారు. మెడలో హారం, పాతకాలం మాదిరిగా జడలో గులాబీ పువ్వుతో వెటరన్ లుక్‌లో మెరిసిపోయారు. దీనికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసిన ఆమె.. నా ప్రాణం నీది కాదే.. మై లవ్ బగ్ అజాగూ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











