బాత్‌రూంలో నగ్నంగా.. హాట్ ఫొటోతో హీటెక్కిస్తోన్న బిగ్ బాస్ బ్యూటీ!
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత తమ అందాలను ఆరబోసేందుకు చాలా మంది నటీమణులు ఉత్సాహం చూపిస్తున్నారు. సినిమా అవకాశాల కోసమో... ఫాలోవర్లను పెంచుకోవడం కోసమో... నెటిజన్ల దృష్టిని ఆకర్షించడం కోసమో... లేక ఫేమస్ అవడం కోసమో తరచూ తమ ఖాతాల్లో హాట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వివాదాల్లోనూ చిక్కుకుంటున్నారు. అయినప్పటికీ కొందరు మాత్రం అస్సలు తగ్గడం లేదు. ఈ కోవలోకే వచ్చే ఓ నటి తాజాగా బాత్‌రూంలో తన న్యూడ్ ఫొటోను షేర్ చేసి షాకిచ్చింది. ఆ వివరాలు మీకోసం.!

మోడలింగ్ రంగం నుంచి పరిశ్రమలోకి
పైన చెప్పుకున్న నటీమణి ఎవరో కాదు.... మోడలింగ్ రంగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకుని భారతదేశంలోకి అడుగు పెట్టిన ఇరానీ మోడల్ మందనా కరిమి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చాలా మోడలింగ్ ఏజెన్సీల్లో పని చేసిన ఈ అమ్మడు... ‘రాయ్', ‘భాగ్ జానీ', ‘క్యా కూల్ హై హమ్ 3' వంటి బాలీవుడ్ సినిమాల్లో నటించి గుర్తింపును సంపాదించుకుంది.

బిగ్ బాస్ షోతో పాపులారిటీ సొంతం
మోడల్‌గా, నటిగా మంచి గుర్తింపు దక్కించుకోవడంతో మందనా కరిమికి బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ - 9లో పాల్గొనే అవకాశం దక్కింది. హిందీలో ప్రసారం అయిన ఈ సీజన్ ఎంతో రసవత్తరంగా సాగింది. ఇందులో అందంతో పాటు మంచి వ్యవహారశైలితో ఆకట్టుకుని ఆమె రన్నరప్‌గా నిలిచింది. అప్పటి నుంచి భారీ స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకుంది.

వ్యాపారవేత్తతో వివాహం.. భర్తపై కేసు
మందనా కరిమి కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్న సమయంలోనే వ్యాపారవేత్త గౌరవ్ గుప్తాతో ప్రేమాయణం సాగించింది. కొన్నేళ్ల పాటు రహస్యంగా చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ జంట... 2017లో వివాహ బంధం ద్వారా ఒక్కటైంది. కానీ, పెళ్లైన నెల రోజులకే భర్త, అత్తమామలపై గృహ హింస కేసు పెట్టిందామె. అనంతరం ఆ కేసును ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే.

మందనా తీరుపై ఇస్లాం పెద్దల ఆగ్రహం
వివాహం తర్వాత కూడా మందనా కరిమి స్వతంత్ర జీవితాన్ని గడుపుతున్నట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే సోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తోంది. దీంతో ఆమెకు ఫాలోవర్లు గణనీయంగా పెరిగిపోతున్నారు. అదే సమయంలో ఇస్లాం ఆచారాలను మంటగలుపుతున్నావంటూ ఆ మతానికి చెందిన కొందరు నెటిజన్లు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Recommended Video

కరోనా సోకిందన్నారు.. క్లారిటీ ఇచ్చింది
మందనా కరిమికి కొద్ది రోజుల క్రితం కరోనా వ్యాధి సోకిందని జోరుగా ప్రచారం జరిగింది. దీనికితోడు ఆ సమయంలో ఆమె పోస్ట్ చేసిన ఓ ఫొటోలో కళ్లు ఎర్రబడి ఉండడంతో ఇది నిజమే అని అనుకున్నారంతా. ఈ విషయం ఆమె వరకు వెళ్లడంతో దీనిపై సోషల్ మీడియాలో ‘నేను బాగానే ఉన్నాను. ఎవరూ ఆందోళన చెందవద్దు. కంటికి ఇన్‌ఫెక్షన్ సోకిందంతే' అంటూ క్లారిటీ ఇచ్చింది.

బాత్‌రూంలో బట్టలు లేకుండా సెల్ఫీ
హాట్ హాట్ ఫొటోలతో రెచ్చిపోతోన్న మందనా కరిమి... తాజాగా చేసిన పోస్టుతో మరోసారి వార్తల్లోకి ఎక్కింది. బాత్‌రూంలో బట్టలు లేకుండా ఉన్న సమయంలో తీసిన ఓ సెల్ఫీని ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసుకుంది. ఈ ఫొటో కొంత బ్లర్‌గా ఉన్నప్పటికీ... ఆమె నగ్న దేహం కనిపిస్తోంది. దీంతో ఈ ఫొటో అప్పటి నుంచి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

అద్దం ఎంత అదృష్టం చేసుకుందో...
మందనా కరిమికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. దీంతో ఆమె పోస్ట్ చేసిన బాత్‌రూం న్యూడ్ సెల్ఫీకి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. ఈ ఫొటోకు వేల సంఖ్యలో లైకులు కూడా వచ్చాయి. అదే సమయంలో కొందరు నెటిజన్లు.. ‘నీ అందాన్ని నేరుగా చూసిన అద్దం ఎంత అదృష్టం చేసుకుందో' అన్నట్లుగా కామెంట్లు పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











