ఒక్క రాత్రికి నా రేటు అంత ఫిక్స్ చేశారు.. బిగ్ బాస్ బ్యూటీ ఆవేదన..

తెలుగు బుల్లితెర, రియాలిటీ షోల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ ఫేమ్ నైనికా అనసూరు (Nainika Anasuru). నైనిక ప్రస్థానం డ్యాన్స్ రియాలిటీ షో 'ఢీ'తో ప్రారంభమైంది. తన డ్యాన్స్ స్కిల్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుని, "పొట్టి పిల్ల"గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. అనంతరం 'పిల్ల పడేసావే' వంటి టీవీ సీరియల్స్‌లో నటించి నటిగా కూడా పేరు తెచ్చుకుంది. ఈ క్రేజ్‌తోనే ఆమె బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా పాల్గొని, తన ఎనర్జీతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే.. ఇటీవల ఈ అమ్మడు చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో మరోసారి కలకలం రేపుతున్నాయి. ఆమె వ్యక్తిగతంగా ఎదుర్కొన్న అనుభవాలను బహిరంగంగా వెల్లడించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే?

నైనికా అనసూరు ఇటీవల జబర్దస్త్ వర్ష హోస్ట్‌గా టాక్ షో 'కిస్సిక్ టాక్స్'లో పాల్గొని తన జీవితంలోని చేదు అనుభవాలను వెల్లడించింది. ఈ సందర్భంగా నైనిక మాట్లాడుతూ, తన కెరీర్‌లో కాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొన్నానని షాకింగ్ అనుభవాలను బయటపెట్టింది. ఇండస్ట్రీలో తాను కూడా కాస్టింగ్ కౌచ్ బారినపడ్డానని ఆవేదన వ్యక్తంచేసింది. 'కొంతమంది అమ్మాయిల వల్లే ఈ పరిస్థితి వస్తుంది. కమిట్మెంట్ ఇస్తేనే ఆఫర్స్ వస్తాయని క్రియేట్ చేశారు'అని చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలో ఉన్న అమ్మాయిలలోనే ఈ అభిప్రాయం ఉంది. కమిట్మెంట్ కి రెడీ అయితే ఆఫర్స్ వస్తాయనే కొంతమంది అలాగే చేస్తున్నారు. ఒక వేళ నేను నటిని అయితే.. నా కూతుర్ని ఇండస్ట్రీకి రానివ్వన అంటూ నైనికా షాకింగ్ కామెంట్స్ చేసింది.

Bigg Boss fame Nainika Anasuru Throwback Casting Couch Love Failure amp amp Shocking Revelations

ఈ సందర్భంగా నైనిక మరో కలవరపరిచే అంశాన్ని కూడా బయటపెట్టింది. 'ఒకసారి నాకు పరిచయమైన వ్యక్తి ఫోన్ చేసి, నా ఫొటోలు అసభ్యకరంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని, వాటికి రేట్లు కూడా ఫిక్స్ చేస్తున్నారని చెప్పాడు. అది విన్న వెంటనే నేను షాక్ అయ్యాను. నా ప్రమేయం లేకుండా ఇలాంటి ఘటనలు ఎలా జరుగుతాయో అర్థం కాక ఆశ్చర్యపోయాను. ఆ మాటలు విన్నాక నాకు తీవ్రంగా కోపం, అసహ్యం కలిగింది 'అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

'ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండస్ట్రీ చాలా వల్గర్‌గా మారింది. కమిట్మెంట్స్‌ని నేరుగా అడుగుతున్నారు. ఒకసారి బ్రాండ్ ప్రమోషన్ పేరుతో ఒక వ్యక్తి నన్ను సంప్రదించాడు. మొదట అతను చెప్పిన 'పర్సనల్ రిక్వైర్మెంట్' అంటే ఏమిటో అర్థం కాలేదు. కానీ పదేపదే అదే విషయాన్ని చెప్పడంతో అసలు విషయం అర్థమైందని అన్నారు.

ఇక లవ్ ఫెల్యూర్ గురించి కూడా నైనిక ఓపెన్‌గా మాట్లాడింది. తన జీవితంలో ఒకరిని ఎంతో గాఢంగా ప్రేమించానని, కానీ ఆ వ్యక్తి మోసం చేయడంతో తీవ్రంగా మానసికంగా దెబ్బతిన్నానని ఎమోషనల్ అయింది. 'నా కెరీర్‌ను కూడా పక్కన పెట్టి ఒక వ్యక్తి కోసం ఆరాటపడ్డాను. ఆ సమయంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు నాకు బాధను మిగిల్చాయి' అని కన్నీరుపెట్టుకుంది. బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న సమయంలో కూడా తాను హార్ట్ బ్రేక్‌తో బాధపడినట్లు కనిపించింది.

అంతేకాదు, జీవితంలో ఎదురైన సమస్యల వల్ల ఒకనొక దశలో తాను ఆత్మహత్యకు కూడా ప్రయత్నించానని నైనిక షాకింగ్ విషయాలను వెల్లడించింది. 'ఒక సందర్భంలో నా మాట ఎవ్వరూ వినడం లేదు, నమ్మడం లేదు అనిపించింది. ఆ సమయంలోనే నేను సూసైడ్ అటెంప్ట్ చేశాను' అని ఆమె చెప్పింది. ఈ వ్యాఖ్యలు మరోసారి వైరల్ గా మారాయి. ఇక సోషల్ మీడియా, ఇండస్ట్రీలో జరుగుతున్న దుర్వినియోగాలపై కూడా నైనిక ఘాటుగా స్పందించింది. 'ఇలాంటి వాళ్లు చిన్న పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరినీ టార్గెట్ చేస్తారు. మనం ఎదుగుతున్నప్పుడు కిందకు లాగేవాళ్లు చాలా మంది ఉంటారు' అంటూ ఆమె తీవ్రంగా విమర్శించింది.

తన వ్యక్తిగత జీవితంపై మాట్లాడుతూ.. తన తండ్రి కుటుంబంతో కలిసి ఉండరని, చిన్నప్పటి నుంచి తల్లి ఒక్కరే తనను చూసుకున్నారని భావోద్వేగంగా ప్రదర్శించారు. "మా నాన్న మా అమ్మను, నన్ను టార్చర్ చేశారు. ఆయన డొమెస్టిక్ వైలెన్స్ చేశారు. మా నాన్న మంచివారు కాదు. అందుకే నేను ఆయనను ఇంటి నుంచి వెళ్లిపోమని చెప్పా. మా అమ్మ నన్ను ఎంతో కష్టపడి పెంచింది. ఆమెలా నేను నా పిల్లలను పెంచలేను" అని భావోద్వేగంగా తెలిపారు. ఈ నేపథ్యంలో తాను ఎదుర్కొన్న ప్రతి సమస్య తనను మరింత బలంగా మార్చుకున్నాననీ నైనిక చెప్పింది. ఇక నైనిక చెప్పిన ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X