అతను తాగొచ్చి చితకబాదేవాడు.. ప్రతి రోజు నరకం అనుభవించాం..

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు డ్యాన్సర్, ఆర్టిస్ట్, రియాలిటీ షో కంటెస్టెంట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో నైనిక (Nainika Anasuru) ఒకరు. ప్రముఖ డ్యాన్స్ షో ఢీ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన ఆమె, తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌తో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆ తరువాత బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో పాల్గొని మరింత పాపులారిటీ తెచ్చుకుంది. హౌస్‌లో తన ఆటతీరుతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో నైనిక తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన షాకింగ్ విషయాలను బయటపెట్టింది. ముఖ్యంగా తన తండ్రి గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో యాంకర్ నైనిక పాల్గొన్నారు. 'మీరు ఎప్పుడూ మీ అమ్మ గురించే మాట్లాడుతారు. ఆమెతోనే కనిపిస్తారు. మీ నాన్న గురించి ఎందుకు చెప్పరు?' అని ప్రశ్నించగా, నైనిక తన బాధను వెల్లగక్కింది.'ఆయన మాతో ఉండరు. ఆయన మంచి వ్యక్తి కాదు. మా అమ్మపై డొమెస్టిక్ వైలెన్స్ చేశారు. చిన్నప్పటి నుంచి అమ్మను కొడుతూ, టార్చర్ చేస్తూ ఉండేవారు. నేను అది నా కళ్లతో చూశాను. అందుకే ఆయనంటే నాకు ఇష్టం లేదు. నేను ఆయనను మిస్ అవ్వను' అంటూ చెప్పింది.

Bigg Boss Fame Nainika Emotional Throwback Interview on Father Mother and Struggles

నైనిక తెలిపిన వివరాల ప్రకారం.. తనకు ఐదేళ్ల వయసున్నప్పుడే తల్లిదండ్రులు విడిపోయారట. ఆ తర్వాత తండ్రితో పెద్దగా సంబంధాలు లేకుండానే తాను పెరిగానని తెలిపింది. తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో కూడా తనకు తెలియదని చెప్పింది. అయితే తన 13వ ఏట ఆయన మళ్లీ జీవితంలోకి వచ్చినా, ప్రవర్తనలో మార్పు రాలేదని వెల్లడించింది. మళ్లీ మద్యం సేవించి ఇంట్లో గొడవలు పెట్టడం, తల్లిని వేధించడం మొదలుపెట్టడంతో 'మా ఫ్యామిలీకి మీరు అవసరం లేదు.. వెళ్లిపోండి' అని తానే చెప్పినట్లు తెలిపింది. అప్పటి నుంచి ఆయన పూర్తిగా దూరమయ్యారని చెప్పింది.

ఇక్కడే ఆగకుండా తన జీవితంలో తల్లి ఎంతటి పోరాటం చేసిందో కూడా నైనిక భావోద్వేగంగా చెప్పుకొచ్చింది. తన తల్లికి సెలూన్ వ్యాపారం ఉందని, కుటుంబాన్ని ఒంటరిగా నిలబెట్టేందుకు ఆమె ఎన్నో కష్టాలు పడ్డారని తెలిపింది. ఒడిశాలో సొంతంగా మూడు నుంచి నాలుగు అంతస్తుల భవనం కట్టారని, దాని నుంచి అద్దె ఆదాయం వచ్చేదని చెప్పింది. అయితే తనకు హైదరాబాద్‌లో అవకాశాలు రావడంతో, తాను ఒంటరిగా ఉండకూడదని భావించిన తల్లి ఆ ఆస్తిని అమ్మి, హైదరాబాద్‌లో స్టూడియో స్థాయి సెలూన్ ప్రారంభించిందని తెలిపింది.

నైనిక ఇక మాట్లాడుతూ.. 'మా అమ్మే నా బలం. మావయ్య కూడా మాకు చాలా అండగా నిలిచారు. పురుషుల సపోర్ట్ లేకుండా కూడా మహిళలు జీవితంలో ముందుకు వెళ్లగలరని మా అమ్మ నిరూపించింది' అని చెప్పింది. తన ఆడిషన్స్‌కు కూడా తల్లి వెంట వచ్చేదని, తాను సాధించిన ప్రతి విజయానికి ఆమె కారణమని చెప్పింది.

ఇక ప్రేమ, రిలేషన్‌షిప్‌ల గురించి కూడా నైనిక గతంలో మాట్లాడింది. ఢీ షో సమయంలో కో-డాన్సర్ సాయితో ప్రేమలో పడినట్లు తెలిపింది. అయితే ఆ రిలేషన్ ఎక్కువ కాలం నిలవలేదని, ఇద్దరి ఆలోచనా విధానాలు వేరుగా ఉండటంతో విడిపోయామని చెప్పింది. "నన్ను ప్రేమించే వ్యక్తి మా అమ్మను కూడా గౌరవించాలి. అమ్మాయిని తక్కువగా చూసే మెంటాలిటీ ఉన్న వాళ్లు నాకు సెట్ అవ్వరు" అంటూ తన అభిప్రాయం స్పష్టంగా తెలిపింది. ప్రస్తుతం నైనిక చేసిన వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X