ఆ కారణంతో రష్మిక సినిమా నుంచి అవుట్.. బిగ్ బాస్ నైనిక ఎమోషనల్

నైనిక అనసురు (Nainika Anasuru)గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బిగ్‌బాస్ సీజన్ 8 ద్వారా క్రేజ్ తెచ్చుకున్న భామల్లో నైనికా ఒకరు. డ్యాన్స్ షో 'ఢీ'తో గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు, ఆ తర్వాత సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆ ఫేమ్ తో బిగ్‌బాస్ ద్వారా తన క్రేజ్‌ను మరింత పెంచుకున్నారు. ప్రస్తుతం టీవీ షోలు, ప్రైవేట్ సాంగ్స్, డ్యాన్స్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ సమయంలో తన సినీ ప్రయాణంలో ఎదుర్కొన్న ఓ చేదు అనుభవాన్ని పంచుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు.

బిగ్ బాస్ ఫేమ్ నైనిక తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా నైనిక మాట్లాడుతూ తన సినిమాల్లో అవకాశాల గురించి ప్రస్తవించారు. తాను కోల్పోయిన పాత్రల్లో ఒకటి హీరోయిన్ రష్మిక మందన్న నటిస్తున్న 'గర్ల్‌ఫ్రెండ్'సినిమా అని తెలిపారు. ఆ సినిమాలో రష్మిక బెస్ట్ ఫ్రెండ్ పాత్ర కోసం తనను ఎంపిక చేసే దశ వరకు వెళ్లారని చెప్పారు. అయితే చివరి నిమిషంలో తనను ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పించారని వెల్లడించారు.

Bigg Boss Fame Nainika Reveals Why She Lost Rashmika Mandanna s Girlfriend Movie Role

నైనిక చెప్పిన వివరాల ప్రకారం.. ఆడిషన్స్ పూర్తయిన తర్వాత చిత్ర యూనిట్‌లోని కొందరు సభ్యులు తనతో ప్రత్యేకంగా మాట్లాడారట. "మీరు కొంచెం దూరం నుంచి చూస్తే రష్మికలా కనిపిస్తున్నారు. సినిమాలో మీ పాత్ర చిన్నదే అయినప్పటికీ, మీ లుక్ హీరోయిన్ క్యారెక్టర్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది" అని చెప్పారని నైనిక వెల్లడించారు. అంతేకాకుండా, "మీరు చాలా గ్లామరస్‌గా కనిపిస్తున్నారు. ఈ పాత్రకు అవసరమైన లుక్ కంటే ఎక్కువ ఆకర్షణీయంగా ఉన్నారు" అని కూడా చెప్పారట.

దీనికి స్పందించిన నైనిక, "నేను మేకప్ లేకుండా వచ్చాను. అవసరమైతే మేకప్ ద్వారా లుక్ మార్చుకోవచ్చు" అని చెప్పినా, యూనిట్ సభ్యులు తమ నిర్ణయాన్ని మార్చుకోలేదని తెలిపారు. మరో మంచి అవకాశం వస్తే తప్పకుండా సంప్రదిస్తామని చెప్పి పంపించేశారని గుర్తుచేసుకున్నారు. అయితే ఈ విషయంపై మాట్లాడుతూ నైనిక ఎక్కడా అసహనం వ్యక్తం చేయలేదు. ఆ సమయంలో తాను పెద్దగా బాధపడలేదని, ఎందుకంటే ఇండస్ట్రీలో ఇలాంటి పరిస్థితులు సహజమేనని భావించానని చెప్పారు. కానీ తర్వాత సినిమా గురించి తెలిసినప్పుడు, ఆ పాత్రను తాను చేయలేకపోయానన్న చిన్న బాధ కలిగిందని ఒప్పుకున్నారు.

ముఖ్యంగా దర్శకుడు రాహుల్ గురించి మాట్లాడుతూ, "ఈ నిర్ణయం ఆయనది కాదు. నా ఆడిషన్ తీసుకున్నది డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లోని మరో వ్యక్తి. రాహుల్ సార్ చాలా మంచి వ్యక్తి. ఆయనపై నాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు" అని స్పష్టం చేశారు. దీంతో సోషల్ మీడియా ఈ అమ్మడు కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సినీ పరిశ్రమలో అవకాశాలు రావడం, చివరి నిమిషంలో చేజారిపోవడం సాధారణమే అయినప్పటికీ, ఒక పెద్ద ప్రాజెక్ట్‌లో అవకాశం కోల్పోయిన అనుభవాన్ని నైనిక ఎంతో హుందాగా వివరించడం అభిమానులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆమె మరిన్ని టెలివిజన్, డిజిటల్ మరియు సినీ అవకాశాల కోసం ప్రయత్నాలు కొనసాగిస్తుండగా, భవిష్యత్తులో హీరోయిన్‌గా లేదా కీలక పాత్రల్లో ఆమెను చూడాలని అభిమానులు ఆశిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X