తమన్నాను మించి రెచ్చిపోయిన బిగ్ బాస్ బ్యూటి.. నీ పెదాలకు ఏమైందంటూ ఘోరంగా!
ఎన్నో ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో తన అందచందాలతో, నటనతో ఆకట్టుకుంటూ వస్తోంది తమన్నా. తన 18 ఏళ్ల కెరీర్ లో ఎన్నడూ చేయని విధంగా ఘాటు రొమాన్స్ సీన్స్, లిప్ లాక్స్ తో ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. జీ కర్దా, లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీసుస్లో వరుసగా శృంగారభరిత సన్నివేశాల్లో నటించి హీట్ పుట్టించింది. అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ మూవీలో హాట్ స్టెప్పులతో ఇరగదీసింది. అయితే తాజాగా తమన్నాను మించి రెచ్చిపోయింది బిగ్ బాస్ సుందరి నందిని రాయ్. ఆ వీడియో ఏంటనే వివరాల్లోకి వెళితే..
హాట్ షోతో : అందం, అభినయం, టాలెంట్ ఉన్న కొందరు మాత్రం సరైన బ్రేక్ అందుకోలేక అవస్థలు పడుతున్నారు. అలాంటి వారిలో హైదరాబాద్ కు చెందిన బ్యూటిఫుల్ నందిని రాయ్ ఒకరు. బిగ్ బాస్ రియాలిటీ షోతో తెలుగు రాష్ట్రాల్లో కాస్తా పాపులర్ అయిన ఈ సుందరి సోషల్ మీడియాలో విపరీతమైన హాట్ షో, డ్యాన్స్ వీడియోలతో అట్రాక్ట్ చేస్తుంటుంది.

మోడలింగ్ తో : నందిని రాయ్ మొదట్లో హీరోయిన్‌గా నటించింది. కానీ అవేం అంతగా హిట్ కాలేదు. కానీ, నందిని రాయ్ హీరోయిన్ గా కంటే ముందు మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి ఫుల్ పాపులర్ అయింది. ఈ మోడలింగ్ రంగంలో తనదైన అందచందాలతో ఆకట్టుకున్న ఈ హాట్ బ్యూటి అప్పుడే మిస్ ఆంధ్రాగా సెలెక్ట్ అయింది. అనంతరం నేషనల్, ఇంటర్నేషనల్ బ్రాండ్లకు కూడా అంబాసిడర్ గా వ్యవహరించింది.

హిందీలో ఎక్కువగా : మోడలింగ్, వాణిద్య ప్రకటనలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటంతో నందిని రాయ్ కు ఊహించని విధంగా గుర్తింపు దక్కింది. దీంతో ఆమెకు సినీ అవకాశాలు వచ్చాయి. కానీ, ఆమెకు తెలుగులో కంటే ఎక్కువగా హిందీలో సినీ ఛాన్సులు వరించాయి. ఫలితంగా బాలీవుడ్‌లోనే మొదటి సినిమా అవకాశం అందుకుంది.

రాని గుర్తింపు : 'ఫ్యామిలీ ప్యాక్' అనే హిందీ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైన నందిని రాయ్ ఆ తర్వాత 'మాయ' అనే చిత్రంతో తెలుగులోకి వచ్చింది. అనంతరం 'మోసగాళ్లకు మోసగాడు', 'సిల్లీ ఫెలోస్' వంటి చిత్రాలతో అలరించింది. ఇలా ఎంతో కాలం సాగిన సినీ కెరీర్‌లో తెలుగులో హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసినా నందిని రాయ్‌కి అనుకున్న స్థాయిలో గుర్తింపు దక్కలేదు.

భాగ్ సాలే మూవీ : సినిమాలతో విజయం వరించలేని పరిస్థితుల్లోనే ముద్దుగుమ్మ నందినికి బిగ్ బాస్ రెండో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొనే అవకాశం లభించింది. ఈ రియాలిటీ షోలో చక్కని ఆట, హాట్ లుక్స్‌తో అందరి దృష్టినీ ఆకర్షించింది. తర్వాత ఐటమ్ సాంగ్స్, 'ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్', 'గాలివాన' వెబ్ సిరీసులు చేసింది. ఇటీవల భాగ్ సాలే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
సర్జరీ చేసుకున్నావా : కాగా సోషల్ మీడియాలో నిత్యం హాట్ షోతో అలరించే నందిని రాయ్ తాజాగా తమన్నా చేసిన 'కావాలా' అనే పాటకు రెచ్చిపోయి మరి హాట్ స్టెప్పులేసింది. ఇందులో ఆమె ఎద, నాభి, నడుము అందాలు నెటిజన్లను అట్రాక్ట్ చేయగా.. వాటికి మించి కొందరి దృష్టి నందిని పెదాలపై పడింది. 'నీ పెదాలకు ఏం చేశా?వ్', 'ఏదైనా సర్జరీ చేసుకున్నావా?, మొహంలో చాలా మార్పు కనిపిస్తుంది' అంటూ ఘోరంగా ట్రోలింగ్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











