ఎస్తేర్ నాకు అలా చేసింది.. నేను అలా చచ్చిపోతా.. : నోయెల్
Noel- ester Noronha: సినీ ఇండస్ట్రీలో ప్రేమలు,పెళ్లిళ్లు,విడాకులు చాలా కామన్. సార్ట్ కపుల్ ఎప్పుడూ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో? ఎప్పుడు? ఎలా విడిపోతారో? చెప్పడం మాత్రం చాలా కష్టం. అలా.. చిన్నచిన్న కారణాలతో తమ వివాహ బంధాన్ని కేవలం ఆరు నెలల్లోనే తెంచుకున్నారు ఓ ఓ స్టార్ కపుల్. ఆ స్టార్ కపుల్స్ ఎవరో కాదు. టాలీవుడ్ నటి ఎస్తర్ నోరోన్హ- బిగ్ బాస్ ఫేమ్, సింగర్ నోయల్. సింగర్ నోయల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన మాజీ భార్య ఎస్తర్ తో ప్రేమ,పెళ్లి, విడాకులపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. మీరు కూడా ఓ లూక్కేయండి.
సింగర్ నోయల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన భార్యతో ఎందుకు విడాకులు తీసుకుందో చెప్పడానికి తన వద్ద సరైన కారణం లేదనీ, ఇప్పటికి కూడా అర్థం కావట్లేదని అన్నాడు. గత కొన్నిరోజులు క్రితం తన భార్య ఓ ఇంటర్వ్యూలో 'నోయల్ సైకో, అబద్దాల కోరు' అని తనపై ముద్ర వేసిందనీ, అయితే.. ఆమె మాటలను ప్రస్తుతం తాను తప్పు పట్టలేననీ, ఆమెనే ఏదొక రోజు తన గురించి నిజం చెబుతుందని నోయల్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

తాను దేవుడు గట్టిగా నమ్ముతాననీ, తాను హీరో అవుతా గట్టిగా అనుకున్నాననీ, కాబట్టే.. తాను యాక్టర్ అయ్యానని అన్నారు. అలాగే.. ఈ విషయాన్ని కూడా తాను నమ్ముతున్నాననీ, తాను చనిపోయే లోపు అయినా.. ఏదొక రోజు ఆమెనే( నటి ఎస్టర్) వచ్చి తన గురించి నిజం చెప్పుతుందనీ, అప్పటివరకూ తనని అసలు నమ్మొద్దని భావోద్వేగానికి లోనయ్యారు. ఇప్పుడూ తనని ఎవరు నమ్మడం లేదనీ, తనకు కేవలం యాక్టింగ్ వచ్చు కాబట్టే.. రోల్స్ ఇస్తున్నారని ఫీల్ అయ్యారు నోయల్.
తన మాజీ భార్య ఎస్తార్.. తాను ఓ సైకో.. అబద్దాల కోరు, వెదవ అంటూ ఎన్నో నిందాలు వేసిందని, అలా తనపై నిందలు వేయడం వల్లే .. చాలా మంది తనకు దూరమయ్యారనీ, నా అనుకునే వాళ్లే తన దగ్గర ఉన్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆమె తనపై నిందలు వేయడం వల్ల కూడా మంచి జరిగిందనీ, ఈ విషయంలో తనని తప్పుబట్టనని అన్నారు. తనని ఎప్పడూ ప్రేమిస్తునే ఉంటానన్నారు. ఇంటెన్షన్ ఏదయితే.. చివరికి తనని కొట్టిన తనని ద్వేషించనని నోయల్ అన్నారు.

అబద్దాలు చెప్పడం తనకు వచ్చేంది ఏమి లేదనీ, లేదా సినిమా చేసి దాని ప్రమోషన్ కి ఎస్టర్ వాడుకోవట్లేదని అన్నారు. ఇప్పటికీ కూడా తాము వీడిపోవడానికి సరైన కారణం తెలియడం లేదనీ,కొంతమంది రిలేషన్ నుంచి బయటకు రాగానే ఏదో రకంగా వారిని డిస్ట్రబ్ చేయాలని చూస్తారనీ తాను మాత్రం అలాంటి వాడిని కాదనీ,ఆమె జీవితం కూడా బాగుండాలంటూ నోయల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
అలాగే.. సినిమా అవకాశాల గురించి మాట్లాడుతూ..వచ్చిన రోల్స్ అన్నింటిని చేశాను. మనీ కోసం కాదు. రిలేషన్ బ్రేక్ కావొద్దని, కానీ, అలా చేయడం తప్పు అని తరువాత తెలుసుకున్నా.. ఎదైనా సహాయం చేయాలనుకుంటే.. హెల్ప్ చేయాలి. కానీ, ప్రొఫెషనల్ మాత్రం చేయకూడదు. తన ప్రొఫెషనల్ కోసం దాదాపు 15 ఏండ్లు కష్టపడ్డాననీ, సరైన పాత్రలు కాకుండా వేరే పాత్రలు చేస్తే.. కెరీర్ ఉండదన్నారు. అందుకే తనకు అవకాశం ఇచ్చిన మూవీ మేకర్స్ ..తాను మొదటిగా ..నా స్క్రీన్ లో ఎంత టైం ఉంటుంది. నా పాత్ర ఏంటీ ? ఈ క్యారెటర్ చేస్తే రేపు ప్యూచర్ ఏంటీ అని బేరిజు వేసుకున్నా తరువాతనే ఒకే చెబుతున్నానన్నారు.


Click it and Unblock the Notifications











