Bigg Boss Telugu 7 టేస్టీ తేజా ఓ తుప్పాస్.. ఎలిమినేషన్ తర్వాత మండిపడ్డ పూజా మూర్తి

బిగ్‌బాస్ తెలుగు 7 రియాలిటీ షోలో 7వ వారం ఎలిమినేషన్ పూర్తయింది. అందరూ ఊహించనట్టుగానే పూజా మూర్తి ఎలిమినేట్ అయింది. వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఆమె రెండు వారాల్లోనే ఇంటి నుంచి బయటకు వచ్చింది. అయితే ఎలిమినేషన్ తర్వాత బిగ్‌బాస్ బజ్ షోలో ఇంటర్వ్యూ ఇస్తూ తన మనసులోని మాటలను పంచుకొన్నారు. ఎలిమినేషన్ తర్వాత తొలి ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ..

ఉల్టా పల్టా సీజన్‌గా మారిన బిగ్‌బాస్ తెలుగు 7 సీజన్‌లో 2.0 ‌లో భాగంగా వైల్డ్ కార్డు ద్వారా ఇంటిలోకి అడుగుపెట్టింది. వాస్తవానికి ఆమె బిగ్‌బాస్ షో ఆరంభంలోనే రావాల్సి ఉంది. కానీ షోలోకి రావడానికి రెండు రోజుల ముందు పూజా మూర్తి తండ్రి మరణించడంతో ఆగిపోయింది. ఆ తర్వాత కొన్ని వారాలకు వైల్డ్ కార్డు ద్వారా ఇంట్లోకి అడుగుపెట్టింది.

 Bigg Boss fame Pooja Murthy shocking comments on Tasty Teja after Elimination from Bigg Boss Telugu 7

బిగ్‌బాస్ తెలుగు 7 ఇంటిలో 7వ వారం నామినేషన్ సందర్భంగా పూజా మూర్తిని టేస్టీ తేజ నామినేట్ చేశాడు. తన మీద నీళ్లు చల్లినావనే కారణంతో నామినేట్ చేశాడు. ఎలాంటి బలమైన కారణం లేకుండా నామినేట్ చేయడంతో ఇలా స్టేజ్ మీద ఉండాల్సి వచ్చిందని నాగార్జునతో పూజా మూర్తి కన్నీళ్లు పెట్టుకొన్నది.

బిగ్‌బాస్ బజ్ కార్యక్రమంలో తుప్పాస్ నామినేషన్ ఏది అనిపించింది అని అడిగిన ప్రశ్నకు పూజా మూర్తి మాట్లాడుతూ.. టేస్టీ తేజ ఫోటోను చూపించింది. తేజా వేసిన నామినేషన్ తుప్పాస్ అంటూ కామెంట్ చేసింది. కోపంతో తేజా ఫోటోను చింపి వేసి ఆగ్రహం వ్యక్తం చేసింది. తుప్సాస్ నామినేషన్ కారణంగానే ఎలిమినేట్ కావాల్సి వచ్చిందని పూజా మూర్తి చెప్పింది.

 Bigg Boss fame Pooja Murthy shocking comments on Tasty Teja after Elimination from Bigg Boss Telugu 7

వైల్డ్ కార్డు ద్వారా ఇంటిలోకి వెళ్లినప్పటికీ.. నేను వైల్డ్‌గా ఆడలేకపోవచ్చు. కానీ నా ఆటను నేను ఆడాను. కంటెస్టెంట్‌గా కాకుండా కోచ్ ఆడానని చెప్పడం తప్పు. నా ఆట ఆడుతూనే నేను సలహాలు ఇచ్చాను. అది నా గేమ్ స్ట్రాటజీలో భాగం. నేను తీసుకొన్న నిర్ణయాలు రాంగ్ కావొచ్చు. కానీ నేను ఆడలేదని చెప్పడం సరికాదు అని పూజా మూర్తి చెప్పింది.

బిగ్‌బాస్ తెలుగు 7 షోలో నా కంటే తక్కువగా ఆడిన వాళ్లు ఉన్నారు. అశ్వినీ శ్రీ, భోలే షవాలే లాంటి వాళ్లు ఆడటం లేదు. వారికంటే నేను తక్కువేమీ కాదు. తేజా చేసిన నామినేషన్ కారణంగా నేను ఇంటి నుంచి బయటకు రావాల్సి వచ్చింది అని పూజా మూర్త చెప్పింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X