బిగ్ బాస్ బ్యూటీ బికినీ ట్రీట్.. తల్లైన కొద్ది రోజులకే సెన్సేషనల్ షో
ఒకప్పుడు హీరోయిన్లు ఎవరైనా హైలైట్ అవ్వాలంటే సినిమాల్లోనే కనిపించాల్సిన పరిస్థితులు ఉండేవి. కానీ, ఇప్పుడు మాత్రం సోషల్ మీడియా అందుబాటులోకి రావడంతో మూవీలు చేసినా, చేయకపోయినా నిత్యం హాట్ టాపిక్ అవుతూ క్రేజ్‌ను పెంచుకుంటున్నారు. అలాంటి వారిలో కన్నడ భామ పూజా రామచంద్రన్ ఒకరు. చాలా ఏళ్ల క్రితమే నటిగా ప్రయాణం మొదలెట్టిన ఈ అమ్మడు.. ఈ మధ్యన సోషల్ మీడియాలో యమా హాట్ షో చేస్తూ రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా పూజా రామచంద్రన్ అదిరిపోయే ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరే చూసేయండి!
వీజేగా ఫేమస్.. సినిమాల్లోకి
పూజా రామచంద్రన్ వీడియో జాకీగా కెరీర్‌ను మొదలు పెట్టుకుంది. అలా ఫుల్ ఫేమస్ అయిన తర్వాత '7am అరివు' అనే చిత్రంతో నటిగా కెరీర్ ప్రారంభించింది. ఆ వెంటనే 'లవ్ ఫెయిల్యూర్' మూవీతో తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి వరుసగా తమిళం, తెలుగు, మలయాళంలో సినిమాలు చేసింది. తద్వారా సౌతిండియాలో పాపులర్ అయింది.

తెలుగు బిగ్ బాస్‌లో చాన్స్
వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్న సమయంలోనే పూజా రామచంద్రన్.. బిగ్ బాస్ తెలుగు రెండో సీజన్‌లో వైల్డ్ కార్డ్ ద్వారా కంటెస్టెంట్‌గా ఎంటరైంది. ఇందులోకి సాదాసీదాగానే వచ్చినన ఈ భామ అందంతో పాటు ఆటతో ఓ రేంజ్‌లో మెప్పించింది. అలాగే దూకుడుగా ఉంటూ మంచి పేరు సంపాదించింది. చివర్లో ఎలిమినేట్ అయినా.. తెలుగులో క్రేజ్ పెరిగింది.
పెళ్లి తర్వాత గ్యాప్ ఇచ్చి
పూజా రామచంద్రన్‌కు బిగ్ బాస్ షో తర్వాత తెలుగులో ఆఫర్లు బాగానే వచ్చాయి. ఫలితంగా ఈ బ్యూటీ ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపించింది. అలాగే, తమిళంలోనూ ఈ చిన్నది వరుసగా ఆఫర్లను అందుకుంది. దీంతో పూజా రామచంద్రన్ బిజీ ఆర్టిస్టుగా మారింది. అయితే, 2021 తర్వాత గ్యాప్ ఇచ్చిన.. 2023లో 'మై నేమ్ ఈజ్ శృతి' మూవీలో కనిపించింది.

విలన్‌తో పెళ్లి.. తల్లైందిగా
2010లోనే పూజా రామచంద్రన్ వీజే క్రెయిగ్‌ను వివాహం చేసుకుంది. అతడితో ఏడేళ్ల పాటు బంధాన్ని కొనసాగించిన తర్వాత 2017లో విడాకులు ఇచ్చింది. ఆ వెంటనే అంటే 2019లో పూజా రామచంద్రన్ జాన్ కొక్కెన్ అనే సినీ నటుడిని ప్రేమ వివాహం చేసుకుంది. ఈ క్రమంలోనే గత ఏడాది ఏప్రిల్ 30న పూజా రామచంద్రన్ ఓ మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.
అందులో యమ యాక్టివ్
వీడియో జాకీగా చేస్తున్నప్పటి నుంచే పూజా రామచంద్రన్ సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే ఈ తెలుగు భామ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అలాగే ఫొటోలు, వీడియోలు వదులుతోంది. ఇక, ఈ మధ్య కాలంలో మరింత సందడి చేస్తూ ఫ్యాన్స్‌ను మెప్పిస్తూ ముందుకెళ్తోంది.

గ్లామర్ ట్రీట్‌తో సెన్సేషన్
ఈ మధ్య కాలంలోనే పూజా రామచంద్రన్ మరింత ఎక్కువగా సోషల్ మీడియాలో హడావిడి చేస్తోంది. ఇందులో ఈ అమ్మడు ఓ రేంజ్‌లో అందాలను ఆరబోస్తూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే తన ఘాటు ఫొటోలు, వీడియోలను ఇంటర్నెట్‌లో వదులుతూ కుర్రకారును రెచ్చగొడుతోంది. ఇప్పుడు తల్లైన తర్వాత కూడా ఏమాత్రం తగ్గకుండా గ్లామర్ ట్రీట్ చేస్తూనే ఉంది.
బికినీ ట్రీట్‌తో కవ్విస్తోంది
తల్లైన కొంత కాలం నుంచే పూజా రామచంద్రన్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా బికినీలో తీసుకున్న పిక్స్‌ను షేర్ చేసింది. వీటిలో ఈ అమ్మడు అందాలు మొత్తం ఆరబోస్తూ కవ్విస్తోంది. ఫలితంగా పూజా రామచంద్రన్ షేర్ చేసిన ఫొటోలకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఈ పిక్స్ అన్నీ వైరల్‌గా మారాయి.


Click it and Unblock the Notifications











