తల్లైన బిగ్ బాస్ బ్యూటీ: బాలయ్య విలన్ ఇంట్లో సంబరాలు.. అప్పుడే భలే పేరు పెట్టారుగా!

రేడియో జాకీగా కెరీర్‌ను ఆరంభించి.. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్న బ్యూటీ పూజా రామచంద్రన్. సౌతిండియాలోని చాలా భాషల్లో సినిమాలు చేస్తూ కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా తీసుకు వెళ్తోన్న ఈ బ్యూటీ.. వైవాహిక జీవితాన్ని కూడా మంచిగానే నడుపుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ అమ్మడు ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని పూజాతో పాటు ఆమె భర్త సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అంతేకాదు, పేరు కూడా పెట్టినట్లు చెప్పారు. వివరాల్లోకి వెళ్తే...

అలా పరిచయమైంది
బెంగళూరుకు చెందిన పూజా రామచంద్రన్ వీడియో జాకీగా కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత '7am అరివు' అనే చిత్రంతో సినీ రంగంలోకి ఎంటరైంది. ఆ వెంటనే 'లవ్ ఫెయిల్యూర్' మూవీతో తెలుగులోకి కూడా అడుగు పెట్టింది. అప్పటి నుంచి వరుసగా తమిళం, తెలుగు, మలయాళంలో సినిమాలు చేసింది. తద్వారా సినిమా నటిగా విశేషమైన గుర్తింపును దక్కించుకుంది.

pooja1

బిగ్ బాస్ షోతో ఫేమస్
వరుస సినిమాలతో దూసుకెళ్తోన్నప్పుడే పూజా రామచంద్రన్‌.. బిగ్ బాస్ తెలుగు రెండో సీజన్‌లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇందులోకి సాదాసీదాగానే వచ్చిన ఈ భామ అందంతో పాటు ఆటతో విశేషంగా ఆకట్టుకుంది. అలాగే దూకుడుగా ఉంటూ మంచి పేరు తెచ్చుకుంది. చివర్లో ఎలిమినేట్ అయినా.. తెలుగులో కూడా ఈ అమ్మడు తన క్రేజ్‌ను రెట్టింపు చేసేసుకుంది.

pooja1

విలన్‌తో రెండో పెళ్లి
రేడియో జాకీగా కొనసాగుతోన్న సమయంలోనే పూజా రామచంద్రన్.. వీజే క్రెయిగ్‌ను పెళ్లి చేసుకుంది. అతడితో దాదాపు ఏడేళ్ల పాటు వైవాహిక జీవితాన్ని గడిపిన తర్వాత 2017లో విడాకులు ఇచ్చేసింది. ఆ వెంటనే అంటే 2019లో పూజా రామచంద్రన్ జాన్ కొక్కెన్ అనే సినీ నటుడిని పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి అతడితో వైవాహిక జీవితాన్ని ఓ రేంజ్‌లోనే ఎంజాయ్ చేస్తోంది.

pooja1

గర్భంతోనూ ఘాటుగా
ప్రముఖ నటుడు జాన్ కొక్కెన్‌తో వివాహం జరిగిన తర్వాత పూజా రామచంద్రన్ కొన్ని నెలల క్రితం గర్భం దాల్చింది. దీంతో ఈ అమ్మడు యాక్టింగ్ కెరీర్‌కు కాస్త విరామం తీసుకుంది. కానీ, గర్భంతోనూ హాట్ షో చేస్తూ రెచ్చిపోయింది. బేబీ బంప్‌తో ఉన్న సమయంలోనూ అందాలను ఆరబోస్తూ ఫొటోషూట్లు చేసింది. వీటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ట్రెండింగ్‌లో నిలిచింది.

తల్లైన బిగ్ బాస్ భామ
ఫేమస్ యాక్ట్రెస్ పూజా రామచంద్రన్ శనివారం ఓ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమెతో పాటు భర్త జాన్ కొక్కేన్ తమ తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా తెలిపారు. అంతేకాదు, వీళ్లిద్దరి చేతలకు ఆ చిన్నారి చేతిని కూడా జోడించిన ఓ ఫొటోను కూడా షేర్ చేశారు. 'మా జీవితాలను సంతోషంగా ఉంచడానికి పిల్లాడు వచ్చేశాడు' అని రాసుకొచ్చారు.

pooja1

పేరు పెట్టిన సినీ జోడీ

మగ బిడ్డ పుట్టిన వెంటనే పేరును కూడా పెట్టినట్లు పూజా రామచంద్రన్ దంపతులు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో 'ఈ ప్రపంచంలోకి కియాన్ కొక్కేన్‌కు స్వాగతం. మీ అందరి ప్రేమకు, మా కోసం చేసి ప్రార్థనలకు ధన్యవాదాలు' అని తెలిపారు. ఇదిలా ఉండగా.. జాన్ కొక్కేన్ ఇటీవలే 'వీర సింహా రెడ్డి' చిత్రంలో విలన్‌గా నటించి మంచి హిట్‌ను అందుకున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X