టాలీవుడ్ విలన్‌తో హీరోయిన్ సరసాలు.. నోట్లో నోరు పెట్టేసి మరీ ఘాటుగా!

గతంలో కంటే ఇప్పుడు సినీ ప్రముఖుల పర్సనల్ లైఫ్‌లు కూడా బహిర్గతం అయిపోతున్నాయి. దీనికి కారణం సోషల్ మీడియా అందుబాటులోకి రావడమే. దీని ద్వారా తమ జీవితాల్లో జరిగే ఎన్నో అంశాలను సెలెబ్రిటీలు బయటపెడుతున్నారు. అందులో హీరోయిన్ పూజా రామచంద్రన్ కూడా ఒకరు. హీరోయిన్‌గా ఉన్నా.. పెళ్లైనా.. తల్లైనా ఈ అమ్మడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా పూజా రామచంద్రన్ తన భర్తతో రొమాన్స్ చేస్తూ తీసుకున్న ఫొటోలను కూడా షేర్ చేసేసింది. మరి వాటిని మీరు కూడా చూసేయండి మరి!

అలా వచ్చి.. ఇలా ఫేమస్
పూజా రామచంద్రన్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వడానికి ముందే వీడియో జాకీగా పని చేసింది. ఆ తర్వాత '7am అరివు' అనే చిత్రంతో నటిగా కెరీర్ ప్రారంభించింది. ఆ వెంటనే 'లవ్ ఫెయిల్యూర్' మూవీతో తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి వరుసగా తమిళం, తెలుగు, మలయాళంలో సినిమాలు చేసింది. తద్వారా ఫుల్ ఫేమస్ అయిపోయింది.

Bigg Boss Fame Pooja Ramachandran Shares Cute Photos In Instagram

బిగ్ బాస్ ఎంట్రీతో ఫుల్లు
పలు భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సమయంలోనే పూజా రామచంద్రన్‌ బిగ్ బాస్ తెలుగు రెండో సీజన్‌లోకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా ఎంటరైంది. ఇందులోకి అంచనాలు లేకుండానే ఈ భామ అందంతో పాటు ఆటతో ఓ రేంజ్‌లో అలరించింది. అలాగే దూకుడుగా ఉంటూ మంచి పేరు సంపాదించింది. చివర్లో ఎలిమినేట్ అయినా.. తెలుగులో క్రేజ్ మాత్రం ఫుల్‌గా పెంచుకుంది.

అప్పటి నుంచి బ్రేకిచ్చి
పూజా రామచంద్రన్‌కు బిగ్ బాస్ షో తర్వాత తెలుగులో ఆఫర్లు బాగానే వచ్చాయి. ఫలితంగా ఈ బ్యూటీ ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించింది. అలాగే, తమిళంలోనూ ఈ అమ్మడు వరుసగా ఆఫర్లను అందుకుంది. దీంతో పూజా రామచంద్రన్ బిజీ ఆర్టిస్టుగా మారింది. అయితే, 2021 తర్వాత మాత్రం ఈ హీరోయిన్ సినిమాలకు పూర్తిగా గ్యాప్ ఇచ్చేసింది.

Bigg Boss Fame Pooja Ramachandran Shares Cute Photos In Instagram

రెండో పెళ్లి.. తల్లైన పూజా
2010లోనే పూజా రామచంద్రన్ వీజే క్రెయిగ్‌ అనే వ్యక్తిని పెళ్లాడింది. అతడితో ఏడేళ్ల పాటు బంధాన్ని కొనసాగించిన తర్వాత విడిపోయింది. ఆ వెంటనే అంటే 2019లో పూజా రామచంద్రన్ జాన్ కొక్కెన్ అనే సినీ నటుడి (టాలీవుడ్ విలన్)తో ప్రేమాయణం సాగించి పెళ్లి చేసుకుంది. ఈ క్రమంలోనే గత ఏడాది ఏప్రిల్ 30న పూజా రామచంద్రన్ ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది.

అందులో యమా బిజీగా
సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందు నుంచే పూజా రామచంద్రన్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే ఈ తెలుగు భామ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే ఫొటోలు, వీడియోలు వదులుతోంది. ఇక, ఈ మధ్య కాలంలో మరింత సందడి చేస్తూ ఫాలోయింగ్‌ను పెంచుకుంటూ వెళ్తోంది.

Bigg Boss Fame Pooja Ramachandran Shares Cute Photos In Instagram

గ్లామర్ షో.. రొమాంటిక్‌
పూజా రామచంద్రన్ ఈ మధ్య కాలంలో మరింత ఎక్కువగా సోషల్ మీడియాలో హడావిడి చేస్తోంది. ఇందులో ఈ సుందరాంగి ఓ రేంజ్‌లో అందాలను ఆరబోస్తోంది. ఈ క్రమంలోనే తన ఘాటు ఫొటోలు, వీడియోలను ఇంటర్నెట్‌లో వదులుతూ కుర్రకారును యమా కవ్విస్తోంది. ఇక, వివాహం తర్వాత భర్తతో రొమాంటిక్‌గా తీసుకున్న పిక్స్‌ను కూడా షేర్ చేస్తూ సెన్సేషన్ అవుతోంది.

లిప్ కిస్ ఫొటోలు వదిలి
పూజా రామచంద్రన్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఈ చిన్నది తన భర్తతో కలిసి స్విమ్మింగ్ పూల్‌లోనే సరసాలు ఆడుతూ కనిపించింది. అంతేకాదు, అతడికి లిప్ టూ లిప్ కిస్ కూడా ఇచ్చేసింది.. ఫలితంగా పూజా రామచంద్రన్ షేర్ చేసిన ఫొటోలకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఈ పిక్స్ అన్నీ తెగ వైరల్‌ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X