ఆ హీరోని కిస్ చేయాలని ఉంది.. అలా ఓపెన్ అయిన బిగ్‌బాస్ బ్యూటీ

బిగ్‌బాస్ ద్వారా తెలుగునాట పాపులర్ అయిన వారిలో ప్రేరణ కంబం కూడా ఒకరు. తొలుత ఆమె జర్నీ సీరియల్స్ ద్వారా ప్రారంభమైంది. స్టార్ మాలో ప్రసారమైన కృష్ణ ముకుంద మురారి సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులను పలకరించారు ప్రేరణ. ఈ పాపులారిటీతో బిగ్‌బాస్ తెలుగు 8లో కంటెస్టెంట్‌గా స్థానం సంపాదించారు. గేమ్‌ను అర్ధం చేసుకుంటూ.. అందరితో మంచిగా ఉంటూ టాప్ 5లో చోటు దక్కించుకున్నారు ప్రేరణ. గౌతమ్, నిఖిల్ వంటి టాప్ కంటెస్టెంట్స్‌కి గట్టి పోటీ ఇచ్చినప్పటికీ టైటిల్‌కు అడుగుదూరంలో బిగ్‌బాస్ జర్నీ ముగించింది. ప్రస్తుతం తెలుగు, కన్నడ భాషల్లో పలు సీరియల్స్, రియాలిటీ షోలలో పాల్గొంటున్నారు ప్రేరణ.

Also Read
శ్రీముఖి పెద్ద పిసినారి... స్టార్ యాంకర్‌పై బుల్లితెర నటుడు షాకింగ్ కామెంట్స్
శ్రీముఖి పెద్ద పిసినారి... స్టార్ యాంకర్‌పై బుల్లితెర నటుడు షాకింగ్ కామెంట్స్

2017లో హరహర మహదేవ్ అనే కన్నడ సీరియల్ ద్వారా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చారు ప్రేరణ కంబం. ఆ తర్వాత రంగనాయకిలో నటించారు సీరియల్స్‌తో పాటు చూరికట్టె, ఆనా, పెంటగాన్, ఫిజిక్స్ టీచర్ వంటి సినిమాలలో మెరిసింది. 2021లో కన్నడ బిగ్‌బాస్ మినీ సీజన్‌లో పాల్గొంది. 2022లో కృష్ణ ముకుందా మురారి అనే సీరియల్‌తో తెలుగు టెలివిజన్ రంగంలో అడుగుపెట్టింది. శ్రీపాద్ అనే వ్యక్తిని 2023లో ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లయినప్పటికీ నటనను కంటిన్యూ చేస్తున్నారు ప్రేరణ.

Bigg Boss Fame Prerana Kambam s Shocking Answers About Nikhil Gautam and Prithvi Go Viral

నేషనల్ క్రష్, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న, ప్రేరణలు బెస్ట్ ఫ్రెండ్స్. అంతేకాదు రూమ్ మేట్స్ కూడా. మోడలింగ్ చేస్తూ సినిమాలలో అవకాశాల కోసం తిరిగేటప్పుడు ఇద్దరూ కలిసి ఒకే గదిలో ఉండేవారట. అయితే రష్మిక టాలీవుడ్, బాలీవుడ్‌లలో వరుస అవకాశాలు అందుకుని స్టార్ హీరోయిన్‌గా సెటిలైపోయింది. అందం, ప్రతిభకు అదృష్టం తోడై రష్మిక ఉన్నత శిఖరాలను చేరుకుని ఇటీవలే తన ప్రియుడు, హీరో విజయ్ దేవరకొండతో ప్రేమాయణానికి ఫుల్‌స్టాప్ పెట్టి వైవాహిక బంధంతో ఒక్కటైన సంగతి తెలిసేంద. అయితే పలుమార్లు రష్మికతో తన బాండింగ్ గురించి ప్రేరణ బయటపెట్టింది కూడా.

Recommended For You
'నేనేమీ బ్రేక్ తీసుకోలేదు.. అలా సినిమాలకు దూరమయ్యా’
'నేనేమీ బ్రేక్ తీసుకోలేదు.. అలా సినిమాలకు దూరమయ్యా’

కొద్దిరోజుల క్రితం తెలుగు ఓటీటీ ఛానెల్ ఆహాలో సినీనటి తేజస్వి మదివాడ హోస్ట్‌గా ప్రసారమైన కాకమ్మ కథలు సీజన్ 2లో తన బెస్ట్ ఫ్రెండ్ యష్మీ గౌడతో కలిసి పాల్గొంది ప్రేరణ. ఈ సందర్భంగా తేజస్వి అడిగిన ప్రశ్నలకు ఆమె షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది. నా ఫేవరేట్ యాక్టర్స్ మహేశ్ బాబు, త్రిష. ఇక బ్యూటీ ఎక్కువ, బ్రెయిన్ తక్కువ అని నాకు యష్మిని చూసినప్పుడు అనిపిస్తుంది. నాకు ఏదైనా సూపర్ పవర్ కావాలనుకుంటే అదృశ్యం అవ్వాలని కోరుకుంటా.. ఎవరికీ కనిపించకుండా ఏదేదో చేసేయాలని ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో రష్మిక మందన్న గురించి ఎక్కువగా తెలుసుకుంటూ ఉంటా. నేను హైదరాబాద్‌లో సెటిల్ అయ్యానని.. శ్రీపాద్ వాళ్ల అమ్మనాన్నలకు ఇల్లు కొనిపెట్టినట్లుగా రూమర్స్ రావడం ఫన్నీగా అనిపించింది. అబ్బాయిల్లో కామెడీ, అర్ధం చేసుకోవడం, మంచితనం నాకు చాలా ఇష్టమని ప్రేరణ తెలిపింది.

You May Also Like
'6 నెలల్లో స్టాలిన్ సీఎం అవుతారు... విజయ్ టీవీకేని తరిమికొడతాం’
'6 నెలల్లో స్టాలిన్ సీఎం అవుతారు... విజయ్ టీవీకేని తరిమికొడతాం’

ఇక కిస్, కిక్, ఇగ్నోర్ అనే వాటిని పృథ్వీ, నిఖిల్, గౌతమ్‌లలో ఎవరికీ ఇస్తావని తేజస్వి అడగ్గా.. ఇందులో శ్రీపాద్‌ను పెట్టమని ప్రేరణ బతిమలాడింది. అయితే అవన్నీ కుదరవు.. ఉన్న ముగ్గురిలోనే ఆన్సర్ చెప్పు.. అయినా కిస్ అంటే బుగ్గ మీద పెట్టొచ్చు, చేతి మీద కూడా పెట్టొచ్చని తేజస్వి తేల్చేసింది. అయితే పృథ్వీని కిస్ చేస్తా.. కిక్ ఇవ్వాలంటే నిఖిల్.. గౌతమ్‌ని ఇగ్నోర్ చేస్తానని ప్రేరణ తెలిపింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X