పెళ్లైన 8 నెలలకే బిగ్ బాస్ ఛాన్స్.. పెద్ద గొడవ.. మా ఆయనతో రాత్రంతా ..

తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎన్నో ఏళ్లుగా అలరిస్తోన్న ప్రముఖ రియాలిటీ షో 'బిగ్ బాస్' కొత్త సీజన్‌కు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే తొమ్మిది సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు పదో సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. అయితే.. అధికారిక ప్రకటన రాకున్న సోషల్ మీడియాలో మాత్రం ఈ రియాలిటీ షోపై భారీ అంచనాలు నెలకొనేలా పలు కథనాలు వస్తున్నాయి. దీంతో మరోసారి బిగ్ బాస్ హౌస్‌లోకి ఎవరెవరు అడుగుపెడతారనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ఇదిలా ఉంటే.. ఓ మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ తన బిగ్ బాస్ జర్నీగురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ఇంతకీ ఏమన్నారంటే?

ఆ బిగ్ బాస్ కంటెస్టెంట్ ఎవరో కాదు.. బిగ్ బాస్ సీజన్ 8 లో ఫినాలే వరకు చేరుకుని టైటిల్‌కు చాలా దగ్గరగా వెళ్లిన కంటెస్టెంట్ ప్రేరణ. ఈ అమ్మడు బీబీ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న కంటెస్టెంట్లలో ఒకరుగా నిలిచారు. ఓ ఇంటర్వ్యూలో తన బిగ్ బాస్ జర్నీ వెనుక ఉన్న భావోద్వేగ కథను పంచుకుంది. సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రేరణ, పెళ్లయిన కొద్దికాలానికే బిగ్ బాస్ అవకాశం రావడం తన జీవితంలో పెద్ద మలుపుగా మారిందని తెలిపింది.

Bigg Boss Fame Prerana Reveals Emotional Struggles Before Entering the Reality Show

ప్రేరణ మాట్లాడుతూ.. 'నాకు పెళ్లయి కేవలం ఎనిమిది నెలలే అయ్యింది. అలాంటి సమయంలో బిగ్ బాస్ నుంచి కాల్ వచ్చింది. అది నా కెరీర్‌కు చాలా పెద్ద అవకాశం. కానీ అదే సమయంలో నా వ్యక్తిగత జీవితంలో ఒక పెద్ద పరీక్షగా మారింది' అని చెప్పుకొచ్చింది. బిగ్ బాస్‌లో పాల్గొనడం విషయంలో ఆమె భర్త మొదట తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారట. 'ఒకవేళ నువ్వు ఫినాలే వరకు వెళ్తే మూడు నుంచి నాలుగు నెలలు నన్ను వదిలి వెళ్లిపోతావు. పెళ్లి తర్వాత వచ్చే మొదటి పుట్టినరోజులు, పండగలు, వెడ్డింగ్ యానివర్సరీ అన్నీ మిస్ అవుతాయి. అలాంటప్పుడు ఎందుకు వెళ్లాలి?'అని తన భర్త బాధపడ్డారని వెల్లడించింది.

సాధారణంగా కొత్తగా పెళ్లైన దంపతులు కలిసి గడపాలని, ప్రతి చిన్న సందర్భాన్ని ప్రత్యేకంగా జరుపుకోవాలని కోరుకుంటారు. అలాంటి సమయంలో భార్య నెలల తరబడి ఇంటికి దూరంగా ఉండాల్సి రావడం సహజంగానే భర్తను బాధపెట్టిందని ప్రేరణ చెప్పింది. అయితే మరోవైపు, తనకు వచ్చిన ఈ అవకాశం జీవితంలో మళ్లీ వస్తుందో లేదో తెలియదనే భయం కూడా వెంటాడిందని తెలిపింది. 'ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని వదులుకుంటే మళ్లీ ఇలాంటి అవకాశం వస్తుందో లేదో తెలియదు. అందుకే నేను బిగ్ బాస్‌కు వెళ్లాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. ఈ విషయంపై మా ఇద్దరి మధ్య పెద్ద చర్చ జరిగింది. కొన్నిసార్లు గొడవ కూడా అయ్యింది' అని చెప్పింది.'

ఈ నిర్ణయం కారణంగా తన భర్త కొన్ని రోజుల పాటు తనతో మాట్లాడలేదని కూడా ప్రేరణ వెల్లడించింది. మూడు నాలుగు రోజులు నాతో మాట్లాడలేదు. ఆయన బాధ ఒకవైపు, నా కల మరోవైపు. ఆ సమయంలో నేను కూడా చాలా ఎమోషనల్ అయ్యాను'' అని తెలిపింది. అయితే చివరికి ప్రేమే గెలిచిందని ప్రేరణ చెప్పింది. బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లే ముందు రాత్రంతా తన భర్తతో మాట్లాడి తన మనసులోని భావాలను వివరించిందట. తన కెరీర్‌కు ఈ అవకాశం ఎంత ముఖ్యమో అర్థమయ్యేలా చెప్పడంతో ఆయన కూడా ఒప్పుకున్నారని తెలిపింది.

'మరుసటి రోజు నుంచి మామూలుగానే మాట్లాడారు. నేను హౌస్‌లో ఉన్నంతకాలం బయట నుంచి నన్ను ఎంతో ప్రోత్సహించారు'' అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ప్రేరణ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒకవైపు కెరీర్ కోసం పోరాడిన మహిళగా, మరోవైపు కుటుంబ బంధాలను కాపాడుకుంటూ ముందుకు సాగిన వ్యక్తిగా ఆమెను అభిమానులు ప్రశంసిస్తున్నారు. బిగ్ బాస్ వంటి రియాలిటీ షోలు కేవలం కంటెస్టెంట్లకే కాదు, వారి కుటుంబ సభ్యులకు కూడా ఎంత పెద్ద భావోద్వేగ ప్రయాణమో ప్రేరణ చెప్పిన ఈ అనుభవం మరోసారి నిరూపించింది.

ఇక ప్రస్తుతం ప్రేరణ సీరియల్స్, వెబ్ సిరీస్‌లతో బిజీగా కొనసాగుతోంది. బిగ్ బాస్ ద్వారా వచ్చిన గుర్తింపును సద్వినియోగం చేసుకుంటూ తన కెరీర్‌ను మరింత ముందుకు తీసుకెళ్తోంది. కాగా, ఆమె పంచుకున్న ఈ వ్యక్తిగత అనుభవం అభిమానులను ఆకట్టుకుంటూ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X