‘విష్ణుప్రియ కాదు.. శ్రీలీలను ముద్దుపెట్టుకోవాలని ఉంది’

బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమైన నటుడు పృథ్వీరాజ్ శెట్టి (Prithviraj Shetty) మరోసారి హాట్ టాపిక్‌గా మారారు. అన్నపూర్ణ ప్రొడక్షన్ హౌస్ నిర్మించిన 'నాగపంచమి' సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన పృథ్వీ, తొలి సీరియల్‌తోనే తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత బిగ్ బాస్ తెలుగు లో కంటెస్టెంట్‌గా పాల్గొని తన పెర్ఫార్మెన్స్‌తో పాటు వ్యక్తిత్వంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. తాజాగా తాను హీరోగా సినిమా చేస్తే ఓ స్టార్ హీరోయిన్ తో నటించడానికి రెడీ అంటున్నారు. ఈ వ్యాఖ్యలన్నీ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు?

బిగ్ బాస్ హౌస్‌లో పృథ్వీరాజ్‌కు తోటి కంటెస్టెంట్ విష్ణుప్రియతో ఏర్పడిన అనుబంధం అప్పట్లో విపరీతంగా చర్చకు వచ్చింది. పృథ్వీ తనదైన దూరాన్ని పాటిస్తున్నప్పటికీ, విష్ణుప్రియ మాత్రం అతనిపై తన భావాలను ఎలాంటి సంకోచం లేకుండా వ్యక్తపరచడం అందరినీ ఆశ్చర్యపరిచింది. పెళ్లి విషయానికి వస్తే 'చేసుకుంటే పృథ్వీనే' అన్న స్థాయిలో ఆమె తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పడం హౌస్‌లో హైలైట్‌గా నిలిచింది.

Bigg Boss Fame Prithvi Shetty Says He Is Ready to Act with Sreeleela Kissing Scenes OK

ఫ్యామిలీ వీక్ సందర్భంగా పృథ్వీరాజ్ తల్లి హౌస్‌లోకి వచ్చినప్పుడు, 'ఎలాంటి కోడలు కావాలి?' అని అడగగా విష్ణుప్రియ తనకు ఓకే అన్నట్లుగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం మరింత ఆసక్తిని రేకెత్తించింది. దీంతో పృథ్వీరాజ్ తల్లి కోరిక మేరకు విష్ణుప్రియనే పెళ్లి చేసుకుంటాడేమోనని అప్పట్లో అభిమానులు ఊహించుకున్నారు. అయితే బిగ్ బాస్ షో ముగిసిన తర్వాత కూడా వీరిద్దరూ పలు షోలలో జంటగా కనిపిస్తున్నప్పటికీ, తమ మధ్య ఉన్న బంధం గురించి పృథ్వీరాజ్ మాత్రం స్పష్టంగా మాట్లాడడం లేదు. ఇదిలా ఉండగా తాజాగా బిగ్ టీవీ నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ కార్యక్రమానికి అతిథిగా హాజరైన పృథ్వీరాజ్, తన వ్యక్తిగత జీవితంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

షోలో భాగంగా యాంకర్ వర్ష 'ఈ సమయంలో విష్ణుప్రియ వచ్చి నిన్ను పెళ్లి చేసుకోవాలని అంటే ఏం చెబుతారు?'అని ప్రశ్నించగా, పృథ్వీరాజ్ భావోద్వేగంగా స్పందించారు. 'వద్దమ్మా... నాకంటే మంచివాడిని చూసుకుని పెళ్లి చేసుకో. అలా చేస్తే బాగుంటావు' అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఈ సమాధానంతో యాంకర్ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. దీంతో వర్ష తిరిగి, 'మీరు కూడా మంచి వాళ్లే కదా... మరి ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు?' అని ప్రశ్నించగా, పృథ్వీరాజ్ 'ఇప్పుడే పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడే పెళ్లి ఎందుకు?'అంటూ మరో ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు.

అంతటితో ఆగని వర్ష, 'ఇంకా టైమ్ ఉందా?'అని అడగగా, 'నాకు ఉండొచ్చు... కానీ విష్ణుప్రియ వయసు అయిపోయింది' అంటూ సరదాగా ఫన్నీ కామెంట్ చేసి నవ్వులు పూయించారు. ఇలా మాట్లాడితే విష్ణుప్రియ హర్ట్ అవుతుందని వర్ష హెచ్చరించగా, 'నేను ఎప్పుడూ చెబుతూనే ఉంటా... నువ్వు ఆంటీ అని' అంటూ ఇది కేవలం సరదా మాటేనని చెప్పుకొచ్చారు. ఇక షోలో మరో ఆసక్తికర ఘట్టంగా, మహేష్ బాబు నటించిన పోకిరి సినిమాలోని లిఫ్ట్ సీన్‌ను విష్ణుప్రియతో రీక్రియేట్ చేస్తే ఎలా ఉంటుందని ప్రశ్నించగా, విష్ణు ప్రియను చూస్తే నాకు టెన్షన్ ఆగుతుంది'అంటూ హాట్ డైలాగ్ చెప్పి ప్రేక్షకులను అలరించారు.

ఇంకా మీరు ఎంతోమంది లేడీ ఆర్టిస్టులతో నటించారని, అందులో ఎవ్వరైనా నచ్చారా అని అడిగితే, 'నాకు అంతగా ఎవ్వరూ నచ్చలేదు... అంత హాట్‌గా అనిపించలేదు' అంటూ క్లియర్‌గా సమాధానం చెప్పారు. అయితే హీరోయిన్స్‌లో ఎవరైనా నచ్చారా అని అడగగానే మాత్రం దిశా పటాని, శ్రీ లీల, భాగ్యశ్రీ బోర్స్లే' పేర్లు చెప్పి మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. ఒకవేళ తాను హీరోగా సినిమా చేస్తే ఎవరి సరసన నటించాలనుకుంటున్నారని ప్రశ్నించగా, 'శ్రీలీలతో నటించడానికి రెడీ... కిస్సింగ్ సీన్స్ కూడా ఓకే' అంటూ రొమాంటిక్‌గా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలన్నీ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

దీంతో నెటిజన్లు 'పృథ్వీ కావాలనే విష్ణుప్రియను దూరం పెడుతున్నాడా?', 'స్టార్ హీరోయిన్లపై కన్నేశాడా?' అంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి కిస్సిక్ టాక్స్ వేదికగా పృథ్వీరాజ్ చేసిన ఈ కామెంట్స్, ఆయన వ్యక్తిగత జీవితం చుట్టూ ఉన్న ఊహాగానాలకు మరింత ఆజ్యం పోసినట్టయ్యాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X