నన్నెవరూ టచ్ చేయలేరు... నటి ప్రియ షాకింగ్ పోస్ట్

తెలుగునాట బుల్లితెర, వెండితెరపై పాపులర్ అయ్యారు నటి ప్రియ. బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్‌గా అవకాశం దక్కించుకుని ఫైర్ బ్రాండ్ అనిపించుకున్నారు. 45 ఏళ్ల వయసులోనూ వన్నెతగ్గని అందాలతో కుర్ర భామలకు పోటీ ఇస్తున్నారు ప్రియ. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారి తెలుగులో మోస్ట్ వాంటేడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బిజీగా ఉన్నారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ప్రియ.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..

ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్లకు చెందిన ప్రియ పూర్తి పేరు.. మామిళ్ల శైలజా ప్రియ. వీరి కుటుంబం తర్వాత బాపట్ల నుంచి హైదరాబాద్‌లో స్థిరపడింది. డిగ్రీ తర్వాత నటనవైపు అడుగులు వేసిన ఈ ముద్దుగుమ్మ.. సీరియల్స్, సినిమాలు చేసుకుంటూ వచ్చారు. తొలుత మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన మాస్టర్ మూవీ ద్వారా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన ప్రియకు ఆ తర్వాత హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్స్, ఇతర సహాయక పాత్రలు వరించాయి. ఏ అవకాశాన్ని వదిలిపెట్టకుండా సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు ప్రియ.

Bigg Boss Fame Priya elevated herself quietly and confidently Her insta post goes viral

2002లో మాచిరాజు వెంకట కిశోర్‌ను పెళ్లి చేసుకున్నారు శైలజ ప్రియ.. వీరి నిశ్చయ్ అనే కుమారుడు ఉన్నాడు. పెళ్లి తర్వాత భర్త, కుమారుడు, కుటుంబం కోసం దాదాపు 10 ఏళ్ల పాటు సినీరంగానికి దూరంగా ఉన్నారు ప్రియ. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి బిజీ అయ్యారు. రాజకుమారుడు, గోకులంలో సీత, కత్తి కాంతారావు, మిర్చి, సన్నాఫ్ సత్యమూర్తి, రారండోయ్ వేడుక చూద్దాం సహా కెరీర్‌లో దాదాపు 200కు పైగా సినిమాల్లో నటించారు శైలజా ప్రియ.

అటు బుల్లితెరపైనా సీరియల్స్‌లో నటించారు. లేడీ డిటెక్టివ్, సంఘర్షణ, జ్వాల, కొత్త బంగారం, మానస, చిన్న కోడలు, కృష్ణ ముకుందా మురారి, శశిరేఖా పరిణయం, నెం 1 కోడలు, నంది వర్సెస్ నందిని తదితర సీరియల్స్‌తో కుటుంబ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. బిగ్‌బాస్‌ తెలుగులో కంటెస్టెంట్‌గా అవకాశం దక్కించుకుని 7 వారాల పాటు అలరించారు. ప్రస్తుతం అమరావతికి ఆహ్వానం సినిమాలో ప్రియ కీలకపాత్ర పోషించారు. ఎస్తర్ నోరోన్హా లీడ్ రోల్ పోషించిన ఈ సినిమాలో శివ కంఠంనేని, ధన్య బాలకృష్ణ, సురేఖవాణి తదితరులు కీలకపాత్రలు పోషించారు. జీవీకే దర్శకత్వం వహించిన ఈ సినిమాను లైట్‌హౌస్ సినీ మ్యాజిక్ బేనర్‌పై కేఎస్ శంకర్రావు, ఆర్ వెంకటేశ్వరరావులు నిర్మిస్తున్నారు. వాలంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ప్రియ.. తన సినిమాలు, సీరియల్స్, షూటింగ్స్ ఇతర వ్యక్తిగత వివరాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అలాగే సమాజంలో జరుగుతున్న అంశాలపై తన అభిప్రాయాలను తెలియజేస్తుంటారు. అలాగే ఫోటోషూట్‌లతోనూ మైండ్ బ్లాంక్ చేస్తుంటారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఎలాంటి మెరుపులు అక్కర్లేదు.. ఆమె సొంతంగా ప్రకాశించగలదు. ఆమె మరింత హాట్‌గా, నిశ్శబ్ధంగా, సంపన్నురాలిగా ఎదిగింది. ఆమెను అందుకోవడం కష్టం.. అది నువ్వేనంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More from Filmibeat

Read more about: bigg boss priya
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X