అలాంటి మూడ్‌తో గదిలోకి వెళ్తే... బిగ్‌బాస్ ఫేమ్ నటి ప్రియ షాకింగ్ పోస్ట్
బుల్లితెర, వెండితెరను ఏకకాలంలో దున్నేస్తుంటారు కొందరు నటీమణులు. వీరిలో నటి శైలజా ప్రియ కూడా ఒకరు. ఎప్పటి నుంచో సినీ పరిశ్రమలో ఉన్న ఈమె.. సీరియల్స్‌తోనూ అలరించారు. అయితే బిగ్‌బాస్ షోతో ప్రియ పాపులారిటీ బాగా పెరిగింది. 47 ఏళ్ల వయసులోనూ చెక్కు చెదరని అందం, ఫిట్‌నెస్‌తో కుర్రభామలకు పోటీ ఇస్తుంటారు ప్రియ. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ప్రియ.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..
దాదాపు 30 ఏళ్లుగా తెలుగు బుల్లితెర, వెండితెరపై రాణిస్తున్నారు ప్రియ. 1997లో మెగాస్టార్ చిరంజీవి నటించిన మాస్టర్ మూవీతో టాలీవుడ్‌లో అడుగుపెట్టారు ప్రియ. ఆ తర్వాత దొంగాట, గోకులంలో సీత తదితర చిత్రాలలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఎక్కువగా సహాయ నటిగా, హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలలో కనిపించారు ప్రియ. సినిమాలతో పాటు పలు సీరియల్స్‌లోనూ నటించి తెలుగువారికి బాగా దగ్గరయ్యారు. ఆమె పోషించిన పాత్రలు ఇప్పటికీ గుర్తుండిపోతాయి.

2002లో మాచిరాజు వెంకట కిశోర్‌ను పెళ్లి చేసుకున్నారు శైలజ ప్రియ.. ఈ దంపతులకు నిశ్చయ్ అనే కుమారుడు ఉన్నాడు. పెళ్లి తర్వాత భర్త, కుమారుడు, కుటుంబం కోసం దాదాపు 10 ఏళ్ల పాటు సినీరంగానికి దూరంగా ఉన్నారు ప్రియ. ఆ తర్వాత పరిస్ధితులు చక్కబడటంతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. కృష్ణ ముకుందా మురారి, శశిరేఖా పరిణయం, నెం 1 కోడలు, నంది వర్సెస్ నందిని తదితర సీరియల్స్‌తో కుటుంబ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. సినిమాల సంగతి సరేసరి.
సీరియల్స్, సినిమాలకే పరిమితం కాకుండా.. ఎప్పటికప్పుడు అప్‌డేట్ కావడం ప్రియ విజయ రహస్యం. తన వయసున్న నటీమణులు ఉంటే షూటింగ్.. లేదంటే ఇంటికే పరిమితం అవుతారు. కానీ ప్రియ మాత్రం విభిన్నంగా ఆలోచించారు. తెలుగు వారి ఫేవరేట్ రియాలిటీ షో.. బిగ్‌బాస్‌లో అడుగుపెట్టి షాకిచ్చారు. సహజంగా 40 ప్లస్ దాటిన వారు బిగ్‌బాస్‌లో ఎక్కువ రోజులు ఉండరు. అలాగే కుర్రాళ్లతో పోటీపడి ఫిజికల్ టాస్క్‌లు, గేమ్స్, డిస్కషన్స్‌లో దూకుడుగా ఉండలేరు. కానీ ప్రియ వీటన్నింటినీ పటాపంచులు చేశారు.
గేమ్స్ అయినా, టాస్క్‌లు అయినా దుమ్ముదులిపేవారు. మాటకు మాట సమాధానంతో బిగ్‌బాస్‌లో ఫైర్‌బ్రాండ్ అనిపించుకున్నారు. హౌస్‌లో ఉన్నన్ని రోజులు తన మార్క్ చూపించారు ప్రియ. బిగ్‌బాస్ నుంచి బయటకొచ్చిన తర్వాత తిరిగి తన సినిమాలు, షూటింగ్స్‌తో బిజీ అయ్యారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన సినిమాలు, షూటింగ్స్, ఇతర వ్యక్తిగత వివరాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. చీరతో పాటు మోడ్రన్ డ్రెస్‌లలోనూ ఫోటోషూట్స్ చేస్తూ ముక్కున వేలేసుకునేలా చేస్తారు.
తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో శైలజా ప్రియ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. మోడ్రన్ డ్రెస్‌లో ఏదో ఆఫీసులోకి వెళ్లి వస్తూ సెల్ఫీలు దిగిన ఆమె.. ఆ ఫోటోలను షేర్ చేశారు. అలాగే 'నీ పని నువ్వు చూసుకో' అనే సంస్థకు నేనే సీఈవోగా అన్నట్లుగా గదిలోకి అడుగుపెడుతున్నాను అంటూ రాసుకొచ్చారు. నీ పని నువ్వు చేసుకుంటే అంతకంటే ఉత్తమమైనది ఏది లేదన్నట్లుగా ప్రియ పోస్ట్ ఉంది. ఇది చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications


















