నా బట్టలు నా ఇష్టం…మీకేంటీ నొప్పి… బిగ్‌బాస్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్
Priyanka Jain: టాలీవుడ్ టెలివిజన్ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు ప్రియాంక జైన్. మౌనరాగం, జానకి కలగనలేదు వంటి హిట్ సీరియల్స్‌తో ఈ భామ తెలుగు ప్రేక్షకులను బాగా కట్టిపడేసింది. తన సహజ నటన, అందంతో చిన్నవయసులోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక ప్రియాంక బిగ్‌బాస్ 7లో కంటెస్టెంట్‌గా పాల్గొని ఫినాలే వరకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ రియాలిటీ షో ఆమెకు మరో స్థాయి క్రేజ్‌ను అందించింది. బిగ్‌బాస్ తర్వాత కొత్త సీరియల్స్ చేయకపోయినా, ఈవెంట్స్, టీవీ షోలు, ఓటీటీ ప్రాజెక్టులతో బిజీగా మారింది.
ఇక ఈ అమ్మడు తన ప్రొఫెషనల్ లైఫ్ తోనే కాకుండా.. పర్సనల్ లైఫ్ విషయాలతో కూడా ఎప్పుడు వార్తల్లో నిలుస్తోంది. సీరియల్ నటుడు శివకుమార్‌తో ప్రియాంక ప్రేమలో ఉందన్న విషయం గత కొన్ని రోజులుగా ప్రచారంలో ఉంది. ప్రస్తుతం వీరిద్దరూ లివింగ్‌లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. ఇటీవల ప్రియాంక ఆహా ఓటీటీలో ప్రసారమయిన 'డ్యాన్స్ ఐకాన్ 2' షోలో పాల్గొంది. ఈ షోలో ఈ అమ్మడు వేసుకున్న ఔట్‌ఫిట్‌పై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. కొందరు నెటిజన్లు అగ్రెస్సివ్‌గా ట్రోలింగ్ చేశారు. ఈ విమర్శలపై ప్రియాంక స్పందించారు.

సీరియల్ బ్యూటీ ప్రియాంక జైన్ ( Priyanka Jain) జబర్దస్త్ వర్ష హోస్ట్ వ్యవహరిస్తున్న 'కిస్సిక్ టాక్'లో పాల్గొన్నారు. ఈ తన డ్రెస్సింగ్ పై ట్రోలింగ్ పై స్పందించారు. ప్రియాంక మాట్లాడుతూ... "ట్రోల్స్ చూసి నేను షాక్ అయ్యాను. ఏంటి ప్రపంచం మొత్తం నా మీదే మాట్లాడుతోందా? అన్నట్లుగా కామెంట్లు చేశారు. నేను నటించిన క్యారెక్టర్‌లో ఉన్నంతసేపే ఆ లుక్‌లో ఉంటాను. నేను యాక్టర్‌ను, నాకు కూడా ఫ్రీడం ఉంది. నాకు నచ్చిన డ్రెస్ వేసుకోవడంలో తప్పేముంది?" అని ప్రశ్నించింది. కొన్ని కామెంట్లు భరించలేనంత దారుణంగా ఉన్నాయని, చూసి తనకే అసహ్యం వేసిందని చెప్పుకొచ్చింది.
ఈ సమయంలో తన బాయ్‌ఫ్రెండ్ శివకుమార్ తనకు మోరల్ సపోర్ట్ ఇచ్చాడని, ట్రోల్స్ పట్టించుకోవద్దని ధైర్యం చెప్పాడని తెలిపింది. ప్రియాంక ఇంకా మాట్లాడుతూ "డ్యాన్స్ ఐకాన్‌లో వేసుకున్న డ్రెస్సింగ్‌లో అతిగా ఏమీ లేదు. ఎక్కడ ఎలాంటి డ్రెస్సింగ్ వేసుకోవాలో నాకు తెలుసు అని ఘాటుగా స్పందించారు. ఇక సోషల్ మీడియాలో నా మీద రాయబడిన 'అమ్మ కొట్టింది' అనే వార్త పూర్తిగా అబద్ధమనీ, కావాలనే రాసిన గాసిప్స్ అని వార్తలను ఖండించింది.
బిగ్‌బాస్‌లోకి రాకముందు సీరియల్ యాక్ట్రెస్‌గా ఉన్నానని, ఇప్పుడు షోలు, ఈవెంట్స్, ఓటీటీ చేసేందుకోసం అవసరమైన స్టైల్‌లో ఉండాల్సి వస్తుందని చెప్పింది. "అప్పటి ప్రియాంక వేరు, ఇప్పటి ప్రియాంక వేరు. నచ్చితే ఫాలో అవ్వండి, లేదంటే అన్‌ఫాలో చేయండి. కానీ మనసుకు నొప్పి చేసేలా కామెంట్ చేయొద్దు. మేం కూడా మనుషులమే. మీ కామెంట్ల వల్ల మేమూ ఏడుస్తాం.నా బట్టలు నా ఇష్టం...మీకేంటీ నొప్పి " అని ప్రియాంక భావోద్వేగానికి గురైంది. ట్రోలింగ్స్‌పై ప్రియాంక చేసిన కౌంటర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫీలింగ్స్‌ను దాచకుండా ఓపెన్‌గా చెప్పిన ప్రియాంక మాటలు నెటిజెన్స్‌లో చర్చనీయాంశంగా మారాయి.


Click it and Unblock the Notifications










