ఆయన టార్చర్ భరించలేక మా ఫ్యామిలీ సూసైడ్ .. ప్రియాంక జైన్ ప్రియుడు శివ్ ఆవేదన

మౌనరాగం సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు శివకుమార్. తన నటనతో పాటు వ్యక్తిగత జీవితంతోనూ తరచూ వార్తల్లో నిలుస్తుంటాడు. అదే సీరియల్‌లో తనతో కలిసి నటించిన నటి ప్రియాంక జైన్‌తో ప్రేమలో పడిన శివకుమార్, గత కొన్ని సంవత్సరాలుగా ఆమెతో రిలేషన్‌షిప్‌లో ఉన్నాడు. ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలుగు బుల్లితెరపై వరుస సీరియల్స్‌తో బిజీగా ఉన్న శివకుమార్.. అప్పుడప్పుడు ప్రియాంకతో కలిసి రియాలిటీ షోలు, టీవీ కార్యక్రమాల్లో పాల్గొంటూ అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇంటర్వ్యూలో తన చిన్ననాటి చేదు జ్ఞాపకాలను పంచుకుంటూ భావోద్వేగానికి గురయ్యాడు. ముఖ్యంగా తన తండ్రి ప్రవర్తన కారణంగా కుటుంబం ఎదుర్కొన్న నరకయాతనను వివరిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.

మౌనరాగం, జానకి కలగనలేదు వంటి సీరియల్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న శివకుమార్.. నటి ప్రియాంక జైన్‌తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. వీరిద్దరూ కలిసి సోషల్ మీడియాలో తరచూ కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంటారు. బుల్లితెరపై ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించే నటుడు శివకుమార్ జీవితంలో ఇంతటి విషాదం దాగి ఉందని చాలా మందికి తెలియదు. సీరియల్స్ ద్వారా ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ఈ యువ నటుడు.. తెరపై కనిపించే ఆనందానికి భిన్నంగా తన బాల్యం ఎంతో బాధాకరంగా గడిచిందని శివకుమార్ వెల్లడించాడు.

bigg boss fame Priyanka Jain lover Shiva Kumar Reveals Painful Childhood Trauma

శివకుమార్ తల్లి ఒక స్కూల్ టీచర్ అని, కానీ ఆమెపై తన తండ్రి అనుమానాలతో నిత్యం వేధించేవాడని తెలిపాడు. స్కూల్ నుంచి అరగంట ఆలస్యంగా వచ్చినా గొడవలు పెట్టేవాడని, తల్లిని దుర్భాషలాడటమే కాకుండా కొట్టేవాడని గుర్తుచేసుకున్నాడు. ప్రతిరోజూ ఇంట్లో జరిగే ఆ గొడవలు చూసి తాను, తన చెల్లి మానసికంగా తీవ్రంగా దెబ్బతిన్నామని చెప్పాడు. అంతేకాదు, తన తండ్రికి మద్యం అలవాటు ఉండేదని, గుట్కా నమిలేవాడని, అనేక వివాహేతర సంబంధాలు కూడా ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ ప్రవర్తనను చూసి తన చెల్లికి అబ్బాయిలంటేనే విరక్తి వచ్చిందని తెలిపాడు. కుటుంబంలో ప్రేమ, భద్రత లభించాల్సిన చోట భయం, బాధ మాత్రమే కనిపించేవని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఈ సందర్భంగా తన జీవితాన్ని మార్చేసిన ఓ ఘటనను కూడా శివకుమార్ గుర్తు చేసుకున్నాడు. ఒకసారి తన తండ్రి జేబులో రూ.20 కనిపించకపోవడంతో తనపైనే దొంగతనం ఆరోపణలు చేశాడని, చిన్న విషయానికే పెద్ద గొడవ చేసి ఊరంతా ఇంటి ముందు చేరేలా చేశాడని చెప్పాడు. ఆ అవమానం, బాధ తట్టుకోలేక తాను, తన తల్లి, చెల్లి ముగ్గురం కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నామని వెల్లడించాడు. "అమ్మ, నేను, చెల్లి ముగ్గురం ఒంటిపై కిరోసిన్ పోసుకుని చనిపోవడానికి సిద్ధమయ్యాం. అగ్గిపుల్ల వెలిగించే సమయంలో అమ్మ విద్యార్థి ఒకరు వచ్చి మమ్మల్ని బయటకు తీసుకెళ్లాడు. ఆ రోజు అతను రాకపోయి ఉంటే ఈరోజు శివకుమార్ అనే వ్యక్తి ఉండేవాడు కాదు" అంటూ భావోద్వేగానికి గురయ్యాడు.

తండ్రి ప్రేమ కోసం ఎంతగానో ఎదురుచూసినా అది తనకు ఎప్పుడూ దక్కలేదని చెప్పిన శివకుమార్, మంచి తండ్రులను చూసినప్పుడల్లా తనకు ఎందుకు అలాంటి తండ్రి లేడనే బాధ కలిగేదని ఆవేదన వ్యక్తం చేశాడు. చిన్ననాటి నుంచి ఎదుర్కొన్న ఆ అనుభవాలే తన వ్యక్తిత్వాన్ని మార్చాయని తెలిపాడు. అయితే ఈ బాధల మధ్య తన జీవితంలో వెలుగులా నిలిచిన వ్యక్తి ప్రియాంక జైన్ అని చెప్పుకొచ్చాడు. తనకు బెస్ట్ ఫ్రెండ్, లవర్, కుటుంబ సభ్యురాలు అన్నీ ప్రియాంకేనని పేర్కొన్నాడు. తన బాధలు, సంతోషాలు పంచుకునే ఏకైక వ్యక్తి ఆమెనే అని చెప్పాడు. ప్రతి అబ్బాయి తన భార్యలో తల్లిని చూసుకుంటాడని, తనకు మాత్రం ప్రియాంకలో తన తల్లి కనిపిస్తుందని చెప్పడం అభిమానులను కదిలించింది.

ప్రేమ గురించి మాట్లాడుతూ.. ఒక అమ్మాయి జీవితాన్ని ఎప్పుడూ మోసం చేయకూడదని, ప్రేమించిన వ్యక్తిని గౌరవించాలనే విలువలను కూడా శివకుమార్ పంచుకున్నాడు. తన చిన్ననాటి అనుభవాలే మహిళల పట్ల గౌరవం నేర్పాయని పేర్కొన్నాడు. చివరగా తన తల్లి జీవితంపై కూడా స్పందించిన శివకుమార్.. ఇలాంటి వ్యక్తితో ఇన్నేళ్లు ఎందుకు కలిసి ఉన్నావని ఎన్నోసార్లు తల్లిని ప్రశ్నించానని, ఇప్పుడు ఆమెకు తండ్రి నుంచి విడాకులు ఇప్పించే ప్రయత్నం చేస్తున్నానని తెలిపాడు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎప్పుడూ నవ్వుతూ కనిపించే శివకుమార్ జీవితంలో ఇంతటి విషాదం ఉందని తెలుసుకున్న అభిమానులు షాక్‌కు గురవుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X