ప్రియుడి కౌగిలిలో నలిగిపోయిన బిగ్‌బాస్ బ్యూటీ.. రొమాన్స్‌లో మునిగితేలిన ప్రియాంక
బిగ్‌బాస్, సీరియల్స్ ద్వారా పాపులారిటీ సంపాదించిన ముద్దుగుమ్మలు దేశంలో ఎంతో మంది ఉన్నారు. వీరిలో ప్రియాంక ఎం జైన్ కూడా ఒకరు. తెలుగు బుల్లితెరపై హల్‌చల్ చేసిన ఈ అమ్మడు.. బిగ్‌బాస్‌తో తెలుగు లోగిళ్లకు మరింత దగ్గరయ్యారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ప్రియాంక పెట్టిన పోస్ట్ తాజాగా వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే...
జూలై 2, 1998న ముంబైలో పుట్టి పెరిగిన ప్రియాంక జైన్ .. బెంగళూరులో చదువుకున్నారు. చిన్నతనం నుంచే నటనపై ఆసక్తి ఉన్న ఈ ముద్దుగుమ్మ ఈ దిశగా అప్పటి నుంచే అడుగులు వేశారు. 2015లో సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన ప్రియాంక.. తమిళ చిత్రం రంగి తరంగ చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. ఆ వెంటనే కన్నడ ఇండస్ట్రీ నుంచి ఈమెకు అవకాశాలు వచ్చాయి. 2016లో గోలిసోడాలో నటించిన ప్రియాంక.. అటు నుంచి హైదరాబాద్‌లో ల్యాండ్ అయ్యారు. 2018లో చల్తే చల్తే చిత్రంతో తెలుగు వారిని పలకరించారు. మరాఠీ, హిందీ, ఇంగ్లీష్, కన్నడ, తమిళ, తెలుగు భాషల్లో అనర్గళంగా మాట్లాడగలదు ఈ ముద్దుగుమ్మ.

ఈ దశలో బుల్లితెరపై ఫోకస్ పెట్టిన ప్రియాంక జైన్.. 2017లో స్టార్ మాలో ప్రసారమైన మౌనరాగం ద్వారా తెలుగు టెలివిజన్ రంగంలో ఎంట్రీ ఇచ్చారు. ఇందులో అమ్ములు అనే క్యారెక్టర్‌లో అద్భుతంగా నటించారు. అమాయకంగా కనిపిస్తూ, క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకున్న ప్రియాంక జైన్‌కు తెలుగు ఫ్యామిలీ ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. సీరియల్స్‌తో సినిమాల్లోనూ చిన్నాచితకా పాత్రల్లో నటించిన ఈమె.. ఎవడూ తక్కువ కాదు, వినరా సోదర వీర కుమార వంటి సినిమాలతో పాటు యూ గాట్ మీ గర్ల్, సితార, సోచ్ వంటి వెబ్‌సిరీస్‌లలోనూ నటించారు.
ఈ పాపులారిటీతో బిగ్‌బాస్ తెలుగు 7లో కంటెస్టెంట్‌గా అవకాశం దక్కించుకున్న ప్రియాంక తుది వరకు తనదైన ఆటతో మెప్పించారు. ఆడవాళ్లు ప్రాణంగా చూసుకునే జుట్టును కట్ చేయించుకుని షాకిచ్చారు. తన ఆటతీరు, మాట తీరుతో బిగ్‌బాస్ లవర్స్‌ని ఎంటర్‌టైన్ చేసిన ప్రియాంక జైన్.. ఫైనల్ చేరి, ఏకైక లేడీ ఫైనలిస్ట్‌గా నిలిచింది. బిగ్‌బాస్ నుంచి బయటికొచ్చాక తన ప్రియుడు శివకుమార్‌తో కలిసి యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్, వీడియోలు చేస్తూ కాలం గడిపేస్తోంది.
కొద్దిరోజుల క్రితం ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు వెళ్లిన ఈ జంట పుణ్యస్నానాలు ఆచరించింది. అలాగే దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను కూడా షేర్ చేసింది. దీనిపై నెటిజన్లు ట్రోలింగ్‌కు దిగగా.. తాజాగా ప్రియాంక - శివకుమార్‌లు రొమాంటిక్ మూడ్‌లో ఉన్న మరో వీడియో బయటికొచ్చింది. ఇందులో వీరిద్దరూ ఒకరినొకరు గట్టిగా హత్తుకుంటూ కనిపించారు. శివకుమార్ కాస్త హైట్ కావడంతో ప్రియాంక కోసం కాళ్లు కొంచెం చాపి ఆమెను హగ్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేసిన ప్రియాంక.. స్టోరీ ఆఫ్ ఏవ్రీ షార్ట్ గార్ల్ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











