అతనితో బ్రేకప్ .. 10 ఏళ్లు సీక్రెట్‌గా, షాకింగ్ విషయం బయటపెట్టిన బిగ్‌బాస్ బ్యూటీ
బిగ్‌బాస్ ద్వారా పాపులైన వారిలో సాయితేజ అలియాస్ ప్రియాంక సింగ్ కూడా ఒకరు. తొలుత ఈటీవీలో ప్రసారమైన జబర్దస్త్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న పింకీ అలియాస్ ప్రియాంక సింగ్‌కు బిగ్‌బాస్ మరింత లైఫ్ ఇచ్చింది. తెలుగు లోగిళ్లకు పరిచయం కావడంతో పాటు సినిమాలు, ఇతర కార్యక్రమాల్లోనూ ఆఫర్లు అందుకుంటున్నారు ప్రియాంక. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియాంక తన వ్యక్తిగత జీవితం, ప్రేమ గురించి కీలక వ్యాఖ్యలు చేసింది.
అచ్చుగుద్దినట్లు అమ్మాయిలా ఉండే సాయి.. తాను సర్జరీ చేయించుకుని అమ్మాయిలా మారినట్లు పలు వేదికలపై తెలిపింది. బిగ్‌బాస్ తెలుగు 5లో అవకాశం రావడంతో వెంటనే ఓకే చెప్పింది ప్రియాంక. దీంతో తమన్నా సింహాద్రి తర్వాత బిగ్‌బాస్ తెలుగులో అడుగుపెట్టిన సెకండ్ ట్రాన్స్‌జెండర్‌గా పింకీ రికార్డుల్లోకెక్కింది. ఎలాంటి అంచనాలు కానీ, ఫ్యాన్ సపోర్ట్ కానీ లేకుండా హౌస్‌లోకి వచ్చిన ప్రియాంక తన చలాకీతనం, ఆటలు, మైండ్ గేమ్‌తో దాదాపు 91 రోజులు హౌస్‌లో నిలిచారు. టాప్ 5లో ఉంటారని అంతా అనుకున్నప్పటికీ లక్ కలిసిరాలేదు.

బిగ్‌బాస్‌లో ఉన్నప్పుడు తన కో కంటెస్టెంట్, బుల్లితెర నటుడు మానస్ నాగులపల్లిని ఎంతో ఇష్టపడింది ప్రియాంక. హౌస్‌లో ఉన్నంతసేపూ అతని వెంటే తిరిగింది. వంట చేసి అందరికీ ఆకలి తీర్చింది. చాలా టాస్క్‌ల్లో పాల్గొని 91 రోజులు హౌస్‌లో ఉన్నప్పటికీ కెప్టెన్ కావాలనే కల నిజం కాకుండానే బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. ఇది తనను వెంటాడుతూనే ఉంటుందని ప్రియాంక పలుమార్లు తెలిపింది. బిగ్‌బాస్ షోలో ఉన్నందుకు గాను వారానికి రూ.1.75 లక్షల నుంచి రూ.2 లక్షల చొప్పున మొత్తంగా రూ.25 లక్షలను పింకీ తన రెమ్యునరేషన్‌గా పొందిందని అప్పట్లో వార్తలు వచ్చాయి.
ఇక అబ్బాయి నుంచి అమ్మాయిగా మారడానికి తనలో తాను ఎంతో సంఘర్షణను అనుభవించినట్లు ప్రియాంక తెలిపింది. ఏది ఏమైనప్పటికీ తాను ట్రాన్స్‌జెండర్‌గా మారడం ముమ్మాటికీ దైవ నిర్ణయంగానే ఆమె భావిస్తున్నారు. ట్రాన్స్‌జెంటర్ ఆపరేషన్‌కు ముందు హైదరాబాద్ పెద్దమ్మ తల్లి సన్నిధిలో అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నట్లు ఆమె ఇంటర్వ్యూలో తెలిపారు. అనంతరం ముంబై వెళ్లి ఆపరేషన్ ద్వారా ట్రాన్స్‌జెండర్‌గా మారినట్లు తెలిపింది.
బిగ్‌బాస్ ద్వారా పలు సినిమాలలోనూ ప్రియాంక అవకాశాలు దక్కించుకుంది. ఈ ఏడాది ప్రారంభంలో ప్రియాంకకు హీరోయిన్‌గా అవకాశం వచ్చింది. ఘంటసాల విశ్వనాథ్ దర్శకత్వంలో ప్రియాంక ఓ సినిమాలో నటిస్తున్నారు.అమెరికాలోనూ ఈ సినిమా షూటింగ్ జరిగింది. గతంలో ఎటు చూసినా నువ్వే, కెమెస్ట్రీతో పాటు పలు చిత్రాలకు మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేసిన విశ్వనాథ్ ఈ చిత్రంతో దర్శకుడిగా మారారు. గతేడాది ప్రియాంక సింగ్ తండ్రి బీబీ సింగ్ అనారోగ్యంతో మరణించడంతో ఆమె కోలుకోలేకపోయారు.
ఇక ప్రియాంక పెళ్లికూతురు కాబోతున్నట్లు గతంలో పలు వార్తలు వచ్చాయి. అయితే తనకు పదేళ్ల క్రితం ఓ అబ్బాయితో బ్రేకప్ జరిగిందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు ప్రియాంక. ఇప్పుడు అదంతా గుర్తు తెచ్చుకోలేనని, ఓ మేఘం అలా వచ్చి నాపై కురిసి వెళ్లిపోయిందని ఫన్నీగా చెప్పింది పింకీ. ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదు? పిల్లలు వద్దా ? అని యాంకర్ ప్రశ్నించగా.. నేను అందరికీ నచ్చాలని లేదు, నాకు నచ్చినవాళ్లు నాతో ఉండరని చాలా టేకిట్ ఈజీ అన్నట్లుగా చెప్పింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ప్రియాంకను ఇష్టపడింది ఎవరు? ఎందుకు వీరిద్దరూ విడిపోయారు ? అంటూ పలు ప్రశ్నలు సంధిస్తున్నారు నెటిజన్లు.


Click it and Unblock the Notifications











