ఆ అవమానం భరించలేకపోయా.. మంచాన పడితే మెగా హీరో సాయం..

Priyanka Singh: బిగ్ బాస్ 5 ఫేమ్, నటి ప్రియాంక సింగ్ (పింకీ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లో తన అందం, అభిమానంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది ప్రియాంక. షో తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఎందుకు అయ్యారనే ప్రశ్న అందరిలోనూ ఉంది. తాజాగా యాంకర్ వర్షా హోస్ట్ చేస్తున్న కిసిక్ టాక్ షోలో పాల్గొన్న ఆమె, ఇప్పటి వరకు ఎప్పుడూ బయటపెట్టని పలు షాకింగ్ విషయాలను వెల్లడించారు. ఇంతకీ ఆమెకు సహాయం చేసిన మెగా హీరో ఎవరు? వివరాల్లోకెళ్లే..

బిగ్ బాస్ తర్వాత ఇండస్ట్రీకి దూరమైందెందుకు? ఈ ప్రశ్నకు ప్రియాంక ఇచ్చిన సమాధానం అందరినీ షాక్‌కు గురి చేసింది.'సోషల్ మీడియా అంటే ఇప్పుడు బూతులు, చెత్త, హింస... చిన్నా పెద్దా అనే తేడా లేదు. లైక్స్, వ్యూస్ కోసం ఎంత దారుణంగా అయినా మాట్లాడుతున్నారు'అని ప్రియాంక బాధ వ్యక్తం చేశారు. ఇన్‌స్టాగ్రామ్ వచ్చాక పరిస్థితి మరింత దిగజారిపోయిందని, ఇంట్లో సాదారణంగా ఉండే వారు కూడా అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభించారని ఆమె తెలిపింది.

Bigg Boss Fame Priyanka Singh Reveals Industry Struggles Insults and Nagababu s Support

'నిన్ను సాయి అని పిలవాలా? ప్రియాంక అని పిలవాలా?'ఈ ప్రశ్న ప్రియాంకను తీవ్రంగా బాధించింది. ప్రియాంక కంటతడి పెట్టుకుంటూ స్పందిస్తూ'ఇలాంటి ప్రశ్నలు అడుగుతారని తెలిసే నేను ఇంటర్వ్యూలు ఇవ్వడం లేదు. బురదను రాయిస్తే అది మనమీదే పడుతుంది. ఇది ఎవరి ప్రశ్న?'అని భావోద్వేగంతో మాట్లాడారు. 'మీకు ఎప్పుడైనా కాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురైందా?'
అనే ప్రశ్నకు ప్రియాంక సమాధానం తీవ్రంగా స్పందించారు. 'కాస్టింగ్ కౌచ్ అనే పదం సినిమా ఇండస్ట్రీకి మాత్రమే కాదు. ప్రతి రంగంలోనూ మహిళలు వేధింపులకు గురవుతున్నారు. బట్టల షాప్‌లో పనిచేసే అమ్మాయిలు కూడా తమ యజమానులతో ఇబ్బందులు పడుతున్నారు'అంటూ షాకింగ్ విషయాలను బయటపెట్టారు.

ఒక కామెడీ షో నుంచి తొలగించిన ఘటన ప్రియాంకను తీవ్రంగా గాయపరిచింది. షో ఆఫర్ ఇచ్చి, రిహార్సల్స్ చేయించి, స్టేజ్‌పైకి వెళ్లే సమయంలోనే నిర్మాతలు వచ్చి "నువ్వు చేస్తే ఈ షోకు చెడ్డ పేరు వస్తుంది" అంటూ ఆమెను బయటకు పంపించారని తెలిపారు. ఇదే కాదు, ఆమెతో కలిసి చేయడానికి సైన్ చేసిన ఆర్టిస్టులు కూడా చివరి నిమిషంలో "చేయను, వెళ్లిపోతా"
అని షోను వదిలి వెళ్లిపోయారని బాధతో తెలిపారు. ఈ అవమానాలు, నిర్లక్ష్యం వల్ల మానసికంగా ఇబ్బంది పడినట్టు తెలిపింది. ఆ అవమానాల వల్ల ఒక సంవత్సరం పాటు మంచాన పడ్డానని, ఆ సమయంలో తన మెంటల్ హెల్త్ పూర్తిగా దెబ్బతిందని ప్రియాంక తెలిపింది.

ఈ కఠిన సమయంలో మెగా బ్రదర్ నాగబాబు అండగా నిలిచారని ప్రియాంక వెల్లడించారు. "ప్రతి నెలా నా ఖాతాలో డబ్బులు పంపించారు. మాటలు చెప్పకుండానే అండగా నిలిచారు" అని కృతజ్ఞతతో చెప్పారు. బిగ్ బాస్ తర్వాత ప్రియాంక సింగ్ ఎందుకు కనిపించలేదన్న ప్రశ్నకు ఆమె అనుభవించిన అవమానాలు,సోషల్ మీడియా ట్రోలింగ్, మానసిక కుంగుబాటు, ఇండస్ట్రీకి దూరమయ్యానని వెల్లడించింది. అయితే ఈ బాధాకరమైన ప్రయాణంలో ఆమెకు అండగా నిలిచిన నాగబాబుకు కృతజ్ఞత చెప్పడం హైలెట్ గా నిలిచింది.

More from Filmibeat

Read more about: bigg boss nagababu priyanka singh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X