Priyanka Singh: గ్లామర్ డోస్ పెంచేసిన జబర్ధస్త్ ప్రియాంక.. ఆమెనిలా ఎప్పుడూ చూసుండరు
మొదట జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపుని అందుకొని ఆ తర్వాత బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన వారిలో ప్రియాంక సింగ్ ఒకరు. అబ్బాయి నుంచి అమ్మాయిగా మారిన ప్రియాంక సింగ్ తన గ్లామర్ తో సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ గా మారుతూ ఉంటుంది. అయితే రీసెంట్ గా ఇచ్చిన మరికొన్ని స్టిల్స్ అయితే నేటిజెన్లకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. గతంలో ఎప్పుడూ లేనంత స్టైలిష్ గా బాలీవుడ్ హీరోయిన్స్ కంటే ఘాటుగా ఆమె దర్శనం ఇచ్చింది. అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

జబర్దస్త్ ప్రయాణం
మొదట సాయి తేజ జబర్దస్త్ లో అమ్మాయిల వేషాలు వేస్తూ మంచి కామెడీ టైమింగ్ తో ఆకట్టుకుంటూ వచ్చాడు. అయితే అతను షోలో ఉన్నప్పుడే కొన్ని విభేదాలు తలెత్తాయి. సాయి తేజ జబర్దస్త్ లో ఉన్నప్పుడు దాదాపు అన్ని టీమ్స్ లలో కూడా మంచి కామెడీ టైమింగ్ ఉన్న పాత్రలో కనిపిస్తూ ప్రేక్షకులను నవ్విస్తూ వచ్చాడు. ఇక మరికొంత కాలానికి జబర్దస్త్ విభేదాలు వచ్చి ఆ షో నుంచి బయటకు వచ్చేసాడు.

అమ్మాయిగా మారి..
ఇక సాయి తేజ పూర్తిస్థాయిలో అమ్మాయిగా మారిపోయి తన గ్లామర్ తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉండేవారు. గతంలో అతను ఇంటర్వ్యూలలో కూడా తన జీవితానికి సంబంధించిన విషాదకర విషయాలను తెలియజేశాడు. అమ్మాయిగా మారడానికి చాలా ఖర్చు చేశాను అని నేను అమ్మాయిగా మారిన విషయం ఇంట్లో కూడా తెలియదని బిగ్ బాస్ లో కూడా వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే.

బిగ్ బాస్ క్రేజ్
బిగ్ బాస్ తెలుగు ఐదో సీజన్లో ప్రియాంక సింగ్ ఒక కంటెస్టెంట్ గా పాల్గొని చివరి వరకు గట్టిగానే పోరాడింది. కానీ టైటిల్ విన్నర్ గా మాత్రం నిలవలేకపోయింది. అంతేకాకుండా ఆ షోలో అనే తన అందంతో కూడా ఎంతగానో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. బయటికి వచ్చిన తర్వాత ప్రియాంక ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది.

మరో షో ద్వారా క్రేజ్
ఇక ప్రియాంక సింగ్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పలు ఎంటర్టైన్మెంట్ షోలతో బాగానే హైలైట్ అవుతూ వచ్చింది. ముఖ్యంగా జబర్దస్త్ లో ఆఫర్ వచ్చినప్పటికీ ఆమె అందులోకి వెళ్లలేదు. ఇక ఆమె నాగబాబు జడ్జిగా ఉన్న అదిరింది షోలో కూడా కొంతకాలం పాటు వర్క్ చేసింది. మంచి ఆదాయంతో పాటు ఆమెకు క్రేజ్ కూడా వచ్చింది.
ఊహించని గ్లామర్ డోస్
ఇక ప్రియాంక రీసెంట్ గా ఆమె ఇన్ స్టాగ్రామ్ లో ఒక వీడియోను పోస్ట్ చేసింది. అందులో ఆమె గతంలో ఎప్పుడు లేనంత గ్లామర్ తో కనిపించింది. అందమైన స్కట్ లో ప్రియాంక సింగ్ ఘాటుగా తన గ్లామర్ ను ప్రజెంట్ చేసింది. ఇక ఫోటోలు చూసినవారు చాలా అందంగా ఉన్నావు అని బాలీవుడ్ హీరోయిన్స్ కంటే కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నావు అని పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఇక ప్రియాంక సింగ్ అయితే గ్లామరస్ పాత్రలు వచ్చినా కూడా తాను చేయడానికి సిద్ధమే అని గతంలో వివరణ ఇచ్చింది.


Click it and Unblock the Notifications











