ప్రేమ పేరుతో మోసం.. ఆ కోరిక తీరగా నడిరోడ్డు మీద అలా.. బిగ్‌బాస్ బ్యూటీ ఎమోషన్

బిగ్ బాస్ ఫేమ్, నటి ప్రియాంక సింగ్ (పింకీ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ తెలుగు 5 ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. తన స్ట్రైట్‌ఫార్వర్డ్ నేచర్, ఎమోషనల్ ఎక్స్‌ప్రెషన్ తో ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది. ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులకు దగ్గరవుతుంది. షో తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఎందుకు అయ్యారనే ప్రశ్న అందరిలోనూ ఉంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ అమ్మడు తన జీవితంలోని ఎన్నో తెలియని కోణాలను బయటపెట్టింది. ముఖ్యంగా తన లవ్ ఫెయిల్యూర్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఈ థ్రోబ్యాక్ ఇంటర్వ్యూలో మొదటగా బిగ్ బాస్ నటుడు మానస్ తో ఉన్న అనుబంధం గురించి క్లారిటీ ఇచ్చింది. షో సమయంలో వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ కనిపించడంతో, బయట కూడా అదే కొనసాగుతుందా అన్న సందేహం అందరిలో ఉంది. కానీ ప్రియాంక ఇచ్చిన సమాధానం అందరినీ షాక్‌కు గురిచేసింది. "బిగ్ బాస్ తర్వాత మానస్ నాతో మాట్లాడలేదు. మేము టచ్‌లో ఉన్నామనే వార్తల్లో నిజం లేదు" అంటూ ఆమె క్లియర్‌గా చెప్పింది.

Bigg Boss fame Priyanka Singh s Throwback Interview on Love Failure and Bigg Boss Bond Goes Viral

అక్కడితో ఆగకుండా, షోలో తన ఫీలింగ్స్ గురించి కూడా ఆమె స్పష్టత ఇచ్చింది. "బిగ్ బాస్‌లో నేను చూపించిన ప్రతి ఫీలింగ్ నిజమే. అది స్క్రిప్టెడ్ కాదు, కంటెంట్ కోసం కాదు. నేను ప్రేమిస్తే హార్ట్ ఫుల్‌గా ప్రేమిస్తాను' అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఈ మాటలు ఆమె ఎంతగా ఆ అనుబంధాన్ని సీరియస్‌గా తీసుకుందో తెలియజేస్తాయి. అయితే, షో తర్వాత ఇద్దరూ కలిసి చేసిన ప్రోగ్రామ్‌ల్లో కూడా 'హాయ్-బాయ్' స్థాయికే పరిమితమైపోయిందని, ఇప్పుడు అసలు కాంటాక్ట్ కూడా లేదని షాకింగ్ విషయాలను వెల్లడించింది.

ఇక ఇంటర్వ్యూలో తన ఫెయిల్యూర్ లవ్ స్టోరీ చెప్పింది. తన గతాన్ని గుర్తుచేసుకుంటూ ప్రియాంక భావోద్వేగానికి లోనైంది. "నా బాయ్‌ఫ్రెండ్ కోసం నా జీవితాన్ని అంకితం చేశాను. ప్రేమ పేరుతో దగ్గర అయ్యాడు. పెళ్లి చేస్తానని నమ్మించి, ఎన్నో నిర్ణయాలు తీసుకునేలా చేశాడు. కానీ చివరికి నన్ను మోసం చేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు" అంటూ ఎమోషనల్ అయ్యింది. ఇంకా షాకింగ్ విషయం ఏమిటంటే, ఆ వ్యక్తి మళ్లీ తిరిగి వచ్చి "నీతోనే ఉండాలి" అంటూ మాట్లాడినట్టు ఆమె వెల్లడించింది. "నా కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను చూసుకోని వ్యక్తి ఇప్పుడు ఎందుకు?" అంటూ ఆమె ప్రశ్నించింది. "అతని కోసం నడిరోడ్డు మీద ఏడ్చా... పిచ్చికుక్కలా తిరిగా" అంటూ కన్నీరు పెట్టుకుంది.

ప్రియాంక తన జీవితంలోని మరో ముఖ్యమైన కోణాన్ని కూడా బయటపెట్టింది. "నేను ట్రాన్స్ ఉమెన్‌ని. నాలుగు గోడల మధ్య నాకు ప్రేమ చూపించిన వ్యక్తి, బయట మాత్రం నాతో కనిపించడానికి భయపడేవాడు. సమాజం ఏమంటుందోనని దూరం పెట్టాడు" అంటూ సమాజంలో ట్రాన్స్‌జెండర్‌లపై ఉన్న వివక్షను బహిర్గతం చేసింది. "చాలామంది ట్రాన్స్ గర్ల్స్‌ను కేవలం వస్తువుల్లా చూస్తారు" అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

ఇండస్ట్రీలో ఎదురైన అవమానాల గురించి చెప్పింది. ఒక కామెడీ షోలో ఆఫర్ ఇచ్చి, రిహార్సల్స్ చేయించి, చివరి నిమిషంలో "నువ్వు చేస్తే షోకు చెడ్డ పేరు వస్తుంది" అంటూ బయటకు పంపించిన ఘటనను గుర్తుచేసుకుంది. "ఆ అవమానం నన్ను మానసికంగా పూర్తిగా కుంగదీసింది. అలా వరుస అవమానాల కారణంగా దాదాపు ఒకటిన్నర సంవత్సరం మంచానికే పరిమితమయ్యాను" అని చెప్పింది. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X