సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ పునర్నవి.. భర్త ఎవరంటే?

తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని నటి పున‌ర్న‌వి భూపాలం (Punarnavi Bhupalam). ఉయ్యాల జంపాల సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యింది. ఆ తరువాత బిగ్ బాస్ తెలుగు 3 పాల్గొన్న ఈ అమ్మడు.. ఎంతో క్రేజ్ సంపాదించుకుంది. తాజాగా ఈ అమ్మడు వివాహ బంధంలోకి అడుగుపెట్టి అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఎలాంటి ముందస్తు హడావిడి లేకుండా సైలెంట్‌గా పెళ్లి చేసుకోవడంతో ఈ వార్త ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రస్తుతం ఆమె వెడ్డింగ్ ఫొటోలు నెట్టింట ట్రెండ్ అవుతూ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.ఇంతకీ భర్త ఎవరంటే?

పునర్నవి ఉయ్యాల జంపాల సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అమాయకమైన పల్లెటూరి అమ్మాయి పాత్రలో మెప్పించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ, ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో ఆమె కెరీర్ కొంత మందగించింది. ఇక ఆమెకు నిజమైన పాపులారిటీ తెచ్చింది మాత్రం బిగ్ బాస్ తెలుగు సీజన్ 3. ఈ రియాలిటీ షోలో కంటెస్టెంట్‌గా పాల్గొన్న పునర్నవి, తన స్వభావం, యాక్టివ్‌నెస్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా షో సమయంలో ఆమె పేరు ఎక్కువగా వార్తల్లో నిలవడం, సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెరగడానికి కారణమైంది.

Bigg Boss fame Punarnavi Bhupalam Marries Hemanth Varma in a Private Ceremony

ఈ షో తరువాత సినిమా అవకాశాలు వచ్చినా.. వాటిని వదిలి ఆమె తన కెరీర్‌ను మరో దిశగా తీసుకెళ్లాలని నిర్ణయించుకుంది. విదేశాలకు వెళ్లి ఉన్నత విద్యను అభ్యసిస్తూ, లండన్‌లో చదువులు కొనసాగించింది. సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉండి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అప్డేట్స్‌ను అభిమానులతో పంచుకుంటూ వచ్చింది. ఈ క్రమంలోనే గత డిసెంబర్‌లో తన ప్రేమ విషయాన్ని బయటపెట్టింది. హేమంత్ వర్మ (Hemanth Varma)తో నిశ్చితార్థం జరిగినట్లు ప్రకటించింది. ఆ తర్వాత తాజాగా మార్చి 20న కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో సింపుల్‌గా పెళ్లి చేసుకుంది.

ఇంతకీ పునర్నవి పెళ్లి చేసుకున్న వ్యక్తి ఎవరు? అనే సందేహం నెటిజన్లలో ఎక్కువగా కనిపిస్తోంది. సోషల్ మీడియాలో ఆమె వెడ్డింగ్ ఫొటోలు వైరల్ అవుతున్నప్పటికీ, వరుడి వివరాలపై మొదట్లో క్లారిటీ లేకపోవడంతో చాలా మంది కామెంట్లలో అడుగుతున్నారు. సమాచారం ప్రకారం.. అతని పేరు హేమంత్ వర్మ. వృత్తిరీత్యా ఆయన వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్‌గా పనిచేస్తూ, ట్రావెలర్‌గా కూడా మంచి గుర్తింపు పొందారు. ఆయన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ చూస్తే ప్రకృతి, అడవి జీవాలు, ప్రయాణాలపై ఆసక్తి స్పష్టంగా కనిపిస్తుంది. అయితే పునర్నవి-హేమంత్ మధ్య ప్రేమ ఎప్పుడు, ఎలా ప్రారంభమైందన్న విషయంపై మాత్రం పూర్తి వివరాలు ఇంకా బయటకు రాలేదు.

ఇక కెరీర్ విషయానికి వస్తే, పునర్నవి 'ఉయ్యాల జంపాల' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, మనసుకు నచ్చింది, పిట్టగోడ, ఎందుకో ఎమో వంటి పలు చిత్రాల్లో నటించింది. అయితే బిగ్‌బాస్ ద్వారా వచ్చిన పాపులారిటీ తర్వాత కూడా ఆమె సినిమాల కంటే చదువులకే ప్రాధాన్యం ఇచ్చి విదేశాలకు వెళ్లింది. ఇప్పుడు తన వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తూ పెళ్లి చేసుకోవడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక పెళ్లి తర్వాత ఆమె మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుందా? లేక పూర్తిగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుందా? అనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X