పికెల్ పాప రమ్య మోక్షకి అలాంటి మెసేజ్‌లు... ఆ యంగ్ హీరో నిజ స్వరూపం ఇదే

రమ్య మోక్ష.. ఈ యంగ్ బ్యూటీ గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. జిమ్‌లో వర్కవుట్స్‌తో పాటు హాట్ హాట్ ఫోటోషూట్స్, రీల్స్, టిక్ టాక్ వీడియోలతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేసింది. ఆ తర్వాత తన అక్కలతో కలిసి ఈమె చేసిన పచ్చళ్ల వ్యాపారం వివాదాస్పదమై.. రెండు రాష్ట్రాల్లో ఈ పచ్చళ్ల సిస్టర్స్ హాట్ టాపిక్‌గా మారారు. ఈ ఫేమ్‌తో బిగ్‌బాస్ తెలుగు 9లో కంటెస్టెంట్‌గా అవకాశం దక్కించుకుని మరింత పాపులర్ అయ్యారు రమ్య మోక్ష. ఈమెకు ప్రతినిత్యం సోషల్ మీడియాలో వేలల్లో ప్రేమ సందేశాలు, లవ్ ప్రపోజల్స్ వస్తుంటాయి. కానీ వీటిని ఆమె ఏమాత్రం పట్టించుకోదు. అయితే ఓ సెలబ్రిటీ రమ్య మోక్షతో డేట్‌కి వెళ్లేందుకు ప్లాన్ చేస్తూ దొరికిపోయాడు. ఈ వివరాల్లోకి వెళితే..

రాజమండ్రికి చెందిన సుమ, అలేఖ్య, రమ్య కంచర్ల అక్కాచెల్లెళ్లు. వీరిలో రమ్య చిన్నమ్మాయి. ఈమె తొలి నుంచి టిక్ టాక్ వీడియోలు, ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు, రీల్స్ చేస్తూ హాట్ హాట్ ఫోటోలతో పాపులారిటీ సంపాదించింది. ఈ క్రమంలోనే ముగ్గురు కలిసి చికెన్, మటన్, చేపలు, రొయ్యలు తదితర నాన్ వెజ్ వెరైటీలతో పచ్చళ్ల బిజినెస్ స్టార్ట్ చేశారు. ఈ వ్యాపారం మంచి లాభసాటిగా జరుగుతున్న దశలో ఈ ముగ్గురు సిస్టర్స్‌లోని అలేఖ్య అనే అమ్మాయి.. ఓ కస్టమర్‌తో జరిపిన ఫోన్ కాల్ సంభాషణ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది.

Bigg Boss Fame Ramya Moksha s Celebrity Dinner Chat Goes Viral

ధర కాస్త ఎక్కువగా ఉందని తగ్గించమని అడిగినందుకు ఆమె అనుచిత వ్యాఖ్యలు చేయడం.. ఈ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జనం ఈ అక్కాచెల్లెళ్లపై విరుచుకుపడ్డారు. దాంతో అందరికీ క్షమాపణలు చెప్పడంతో పాటు బిజినెస్ క్లోజ్ చేశారు అలేఖ్య సిస్టర్స్. అయితే ఈ వివాదం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో అలేఖ్య చిట్టి పికెల్స్ పేరు మారుమోగిపోయింది. వీరిలో రమ్య అందగత్తె కావడంతో పలు సినిమాల్లోనూ ఆఫర్లు వచ్చినట్లుగా గాసిప్స్ వైరల్ అయ్యాయి.

ఇదే సమయంలో బిగ్‌బాస్ తెలుగు 9లో ఈ చిన్నది అడుగుపెడుతుందని ఊహాగానాలు వినిపించాయి. చివరికి అదే నిజమైంది కూడా. బిగ్‌బాస్‌ తెలుగు 9లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన రమ్య మోక్ష.. 2 వారాల పాటు హౌస్‌లో ఉంది. ఇందుకు గాను 3 లక్షల రూపాయల పారితోషికం అందుకుంది. బిగ్‌బాస్‌తో మరింత ఫేమ్ రావడంతో ప్రమోషనల్ కార్యక్రమాలతో పాటు బుల్లితెరపై పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు రమ్య. త్వరలో సినీరంగం నుంచి కూడా పచ్చళ్ల పాపకి గట్టిగానే ఛాన్స్‌లు వచ్చే అవకాశం ఉంది.

తాజాగా స్టార్ మాలో ప్రసారమవుతోన్న బీబీ ఉత్సవం షోలో రమ్య మోక్ష ఎంట్రీ ఇచ్చి ఫ్యాన్స్‌ని అలరించింది. దీనికి సంబంధించి ఈ వారం స్టార్ మా విడుదల చేసిన ప్రోమో వైరల్ అవుతోంది. ముందుగా అన్నయ్య సినిమాలోని సాంగ్‌తో కళ్యాణ్ పడాల, డిమోన్ పవన్‌లతో కలిసి ఎంట్రీ ఇచ్చాడు ఇమ్మాన్యుయేల్. నా తమ్ముళ్లు జెమ్స్.. ఇంట్లో ఉన్నప్పుడు నా మీద కాలేసుకుని పడుకునేవాళ్లు, అసలు వాళ్లు ఎక్కడున్నారో కూడా తెలియడం లేదన్నాడు. ఆ వెంటనే కళ్యాణ్, పవన్‌లను బోనులో నిలబెట్టిన శ్రీముఖి ఏం జరిగిందని అడగ్గా.. వదినతో కాస్త టైం స్పెండ్ చేస్తాడని గ్యాప్ ఇచ్చానని కళ్యాణ్ అంటాడు. వదినతో టైం స్పెండ్ చేస్తే నేను కాఫీ షాపుకు వెళ్లాలి కానీ, నువ్వెందుకు వెళ్లావని ఇమ్మాన్యుయేల్ ప్రశ్నిస్తాడు. మూడు గంటలు తిరిగి తిరిగి ఎక్కడ కూర్చోవాలో తెలియక కాఫీ షాప్ దగ్గర కూర్చొన్నానని చెప్పాడు కళ్యాణ్. అయితే ఆ మూడు గంటలు ఎవరితో తిరిగావని ఇమ్మాన్యుయేల్ ప్రశ్నించగా.. ఈ కంప్లయంట్ సాల్వ్ కాలేదు కాబట్టి వాళ్ల నెత్తి మీద బీర్ బాటిల్స్ పగలగొట్టమని అంటుంది శ్రీముఖి. వాళ్ల బదులు నేను కొట్టుకుంటానని శ్రీముఖి అనగా.. వచ్చి కొట్టించుకోమ్మని శ్రీముఖి పంచ్ విసురుతుంది.

తర్వాత నిఖిల్ నాయర్‌ను పిలిచి సౌండ్ రాకుండా అప్పడం తినాలని టాస్క్ ఇస్తుంది శ్రీముఖి. సౌండ్ రావడంతో నువ్వు రమ్యని ఎత్తుకుని తిప్పాలని శ్రీముఖి, రీతూలు టాస్క్ ఇస్తారు. దాంతో రమ్యని ఎత్తుకుని తిప్పుతాడు నిఖిల్. తర్వాత గౌరవ్ గుప్తాను పిలిచి నీ వాట్సాప్‌లో ఫస్ట్ ముగ్గురు అమ్మాయిల వాట్సాప్ ఛాటింగ్ చూస్తానని చెబుతుంది శ్రీముఖి. ఫస్ట్ రమ్య మోక్ష బీబీ 9 తెలుగు అని ఉందని చెప్పడంతో అంతా నవ్వేస్తారు. అందులో డిన్నర్‌కి ఎప్పుడు వెళ్దాం? కత్తిలా ఉన్నావు.. నిఖిల్ నిన్ను ఎత్తుకుంటే నాకు మండిపోతుందని ఉందని శ్రీముఖి చదివి చెబుతుంది. వాడికి తెలుగు రాదు కాబట్టి.. పక్కనే ఉన్న కళ్యాణ్ గాడు టైప్ చేశాడంటూ డౌట్ పెడతాడు ఇమ్మాన్యుయేల్. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా బీబీ ఉత్సవంలో ఏం జరిగిందో తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X