అతడిని చూస్తే నాకు ఝం ఝం మాయ.. బిగ్‌బాస్ సెలబ్రిటీపై మనసు పారేసుకొన్న పికిల్ బేబి రమ్య

రమ్య మోక్ష.. ఈ యంగ్ బ్యూటీ గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. హాట్ హాట్ ఫోటోషూట్స్, రీల్స్, టిక్ టాక్ వీడియోలతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత బిగ్‌బాస్ తెలుగు 9లో అవకాశం దక్కించుకుని మరింత పాపులర్ అయ్యింది. ఈ ఫేమ్‌తో పలు టీవీ ప్రోగ్రామ్‌లు, సినిమాలలో అవకాశాలతో దూసుకెళ్తుంది రమ్య మోక్ష. తాజాగా ఓ షోలో పాల్గొన్న పచ్చళ్ల పాప హాట్ కామెంట్ చేసింది. ఈ వివరాల్లోకి వెళితే..

రాజమండ్రికి చెందిన సుమ, అలేఖ్య, రమ్య కంచర్ల అక్కాచెల్లెళ్లు. వీరిలో రమ్య చిన్నమ్మాయి. ఈమె తొలి నుంచి టిక్ టాక్ వీడియోలు, ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు, రీల్స్ చేస్తూ హాట్ హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత తన అక్కలతో కలిసి పచ్చళ్ల బిజినెస్ స్టార్ట్ చేశారు. ఈ వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలు అన్నట్లుగా జరుగుతున్న దశలో వీరిలో అలేఖ్య అనే అమ్మాయి.. ఓ కస్టమర్‌తో జరిపిన ఫోన్ కాల్ సంభాషణ వివాదాస్పదమైంది.

Bigg Boss fame Ramya Moksha s Hot Comment on Avinash Goes Viral in Aadivaram With Star Maa Parivaaram Show

ధర కాస్త ఎక్కువగా ఉందని తగ్గించమని అడిగినందుకు నువ్వు పచ్చళ్లు కొనలేకపోతున్నావు.. ముందు నీ కెరీర్‌పై ఫోకస్ పెట్టమంటూ అలేఖ్య అనుచిత వ్యాఖ్యలు చేసింది. దాంతో అలేఖ్య సిస్టర్స్‌పై జనం ట్రోలింగ్‌కు దిగారు. చివరికి అక్కాచెల్లెళ్లు క్షమాపణలు చెప్పడంతో పాటు బిజినెస్ కూడా క్లోజ్ చేశారు. అయితే ఈ వివాదం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో, సోషల్ మీడియాలో అలేఖ్య చిట్టి పికెల్స్ పేరు మారుమోగిపోయింది. ఈ క్రమంలోనే రమ్య మోక్షకు బిగ్‌బాస్ తెలుగు 9లో కంటెస్ట్‌గా అవకాశం దొరికింది. ఎక్కువ రోజులు హౌస్‌లో లేనప్పటికీ తన అందచందాలతో ఈ ముద్దుగుమ్మ అలరించింది. బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత బుల్లితెరపై పలు కార్యక్రమాలలో పాల్గొంటోంది రమ్య.

స్టార్ మాలో ప్రసారమయ్యే ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతోంది. స్టార్ యాంకర్ శ్రీముఖి దీనికి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. వారం వారం బుల్లితెర సెలబ్రిటీలతో గేమ్స్ ఆడిస్తూ, వాళ్లని నవ్విస్తూ వినోదాన్ని రాబడుతోంది శ్రీముఖి. ప్రతివారం ఏదో ఒక థీమ్‌తో సరదాలు పంచుతోంది ఆదివారం విత్ స్టార్ మా పరివారం. తాజాగా ఈ వారం బిగ్‌బాస్ తెలుగు 9లో కంటెస్టెంట్స్‌‌గా పాల్గొన్నవారు గెస్టులుగా హాజరయ్యారు. వారితో బీబీ కామనర్స్ vs బీబీ సెలబ్రిటీస్ అనే థీమ్‌తో గేమ్స్ ఆడించింది శ్రీముఖి. తాజాగా విడుదల చేసిన ప్రోమో ఆకట్టుకుంది.

ప్రోమో స్టార్టింగ్‌లోనే ఫారిన్ అమ్మాయిలతో ఎక్స్‌ప్రెస్ హరి, అవినాష్‌లు డ్యాన్స్ చేస్తారు. కరీనా నన్ను హగ్ చేసుకుంది.. నేను డ్యాన్స్ చేస్తుంటే నన్ను అదోలా చూసిందని హరి చెప్పగా.. కరీనా నిన్ను కర్రీలు అమ్ముకునేవాడు అనుకుందంటూ ఇమ్మాన్యుయేల్ పంచ్‌లు విసిరాడు. తర్వాత రీతూ కాకుండా నీకు ఎవరిని చూస్తే ఝుం ఝుం మాయ అనిపిస్తుందని డిమోన్ పవన్‌ని శ్రీముఖి అడగ్గా... నువ్వు చెప్పు అంటూ రీతూ చౌదరి సీరియస్‌గా వార్నింగ్ ఇస్తుంది. ఏం చెప్పాలో అర్ధం కాక ఆలోచిస్తున్న డిమోన్ పవన్‌ని నువ్వు ముందు కళ్లద్దాలు తీయ్ ఎక్స్‌ప్రెషన్స్ తెలియడం లేదని ఇమ్మాన్యుయేల్ పంచ్‌లు విసిరాడు.

తర్వాత నీకు ఝం ఝం మాయ అని ఎవరిని చూస్తే అనిపించిందని ప్రియాశెట్టిని శ్రీముఖి అడగ్గా.. హరి అని చెప్పింది. వాడు అచ్చం మాయలోడు లాగే ఉంటాడు కదా అని ఇమ్మూ మరోసారి సెటైర్లు వేశాడు. అనంతరం రమ్య మోక్ష దగ్గరికి వెళ్లి నీకు ఎవరిని చూస్తే ఝం ఝం మాయ అని అనిపిస్తుందని ప్రశ్నిస్తుంది శ్రీముఖి. నీకు తెలియదా అని రమ్య కౌంటర్ వేస్తుంది. తెలియకుండానే డ్యాన్స్ చేస్తానా అని అవినాష్ మీద చెయ్యేస్తుంది రమ్య. దాంతో కంటెస్టెంట్స్ అంతా గోల గోల చేస్తారు. అన్న అఫీషియల్‌గా పచ్చళ్ల ఓనర్ అని ఇమ్మూ సెటైర్లు వేస్తాడు. దాంతో అంతా నవ్వేస్తారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా... ఎవరికి ఎవరిని చూస్తే ఝం ఝం మాయ అనిపిస్తుందో తెలియాలంటే ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమయ్యే ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X