రవికృష్ణకు కరోనా సోకడం వెనుక అసలు కారణం.. అడగకూడని ప్రశ్న అడిగిన శివజ్యోతి!

By Manoj

చైనాలో పుట్టి ప్రపంచాన్నే గడగడలాడిస్తోంది కరోనా వైరస్. దాదాపు ఐదారు నెలలుగా ఈ మహమ్మారి ప్రభావాన్ని చూపుతోంది. సామాన్యుల నుంచి సెలెబ్రిటీల వరకు ఎవరినీ వదలకుండా అంటుకుంటోంది. మరీ ముఖ్యంగా మన దేశంలో ఈ వైరస్ ఉగ్రరూపం దాల్చింది. దీంతో చాలా మంది ఆ వ్యాధి బారిన పడి మరణిస్తున్నారు. ఇక, ఈ మధ్య తెలుగు బుల్లితెర రంగాన్ని కూడా అంటుకుందీ వైరస్. ఈ క్రమంలోనే ప్రముఖ నటుడు, బిగ్ బాస్ ఫేం రవికృష్ణకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ చిట్ చాట్‌లో తనకు ఆ వైరస్ రావడానికి అసలు కారణాలు వెల్లడించాడు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి.!

Recommended Video

Serial Actor Ravi Krishna,Shiva Jyothi Live About His Corona కరోనా గురించి మాట్లాడిన రవికృష్ణ
ఆ ఒక్క సీరియల్ రవికృష్ణను స్టార్‌ను చేసింది

ఆ ఒక్క సీరియల్ రవికృష్ణను స్టార్‌ను చేసింది


బుల్లితెరపైకి ప్రవేశించిన కొద్ది రోజులకే భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు ప్రముఖ నటుడు రవికృష్ణ. ‘మొగలిరేకులు' సీరియల్‌తో పాపులారిటీని సంపాదించుకున్న అతడు.. ‘వరూధినీ పరిణయం'తో బాగా ఫేమస్ అయ్యాడు. ఈ సీరియల్ రవి కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది. దీని తర్వాత అతడు వరుస ఆఫర్లతో బిజీ అయిపోయాడు.

బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ.. మంచోడిగా పేరు

బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ.. మంచోడిగా పేరు

వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉన్న సమయంలో బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌లోకి ఎంటర్ అయ్యాడు బుల్లితెర స్టార్ రవికృష్ణ. సానుకూల ధృక్పదంతో ఉంటూ నలుగురితో కలిసి సరదాగా గడిపాడు. మధ్యలో ఒకరిద్దరితో మనస్పర్ధలు వచ్చినప్పటికీ... సహనం పాటిస్తూ వచ్చాడు. ఫలితంగా మంచివాడిగా పేరు సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే మరికొన్ని ఆఫర్లు అందుకున్నాడు.

ఆ హీరోయిన్‌కు కరోనా.. రవికృష్ణకూ పాజిటివ్

ఆ హీరోయిన్‌కు కరోనా.. రవికృష్ణకూ పాజిటివ్

కరోనా వైరస్ తెలుగు బుల్లితెరనూ తాకింది. ‘ఆమె కథ' అనే సీరియల్‌లో హీరోయిన్‌గా చేస్తున్న నవ్య స్వామికి కొద్ది రోజుల క్రితం జరిగిన కోవిడ్ టెస్టులో పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. అదే సీరియల్‌కు హీరోగా చేస్తున్న రవికృష్ణకూ నాలుగు రోజుల క్రితం కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని అతడే సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన సంగతి తెలిసిందే.

చాలా బాగున్నాను.. దానికి కారణం మీరందరే

చాలా బాగున్నాను.. దానికి కారణం మీరందరే


కరోనా వ్యాధి సోకడంతో ఇంట్లోనే స్వీయ చికిత్స తీసుకుంటున్నాడు రవికృష్ణ. ఈ క్రమంలోనే తాజాగా అతడు సోషల్ మీడియాలో బిగ్ బాస్ ఫేం శివజ్యోతితో లైవ్ చాట్ నిర్వహించాడు. ఈ సందర్భంగా ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు. ఈ క్రమంలోనే తన ఆరోగ్యం గురించి చెబుతూ.. అందరి అభిమానంతో బాగానే ఉన్నానని వెల్లడించాడు.

తనకు కరోనా రావడానికి కారణం చెప్పిన రవి

తనకు కరోనా రావడానికి కారణం చెప్పిన రవి


శివజ్యోతితో జరిగిన లైవ్‌ చాట్ సందర్భంగా తనకు కరోనా వ్యాధి సోకడానికి గల కారణాన్ని రవికృష్ణ వెల్లడించాడు. ‘లాక్‌డౌన్ తర్వాత షూటింగుల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అయితే, మేము యాక్టర్లు అవడం కారణంగా అందరిలా మాస్క్‌లు పెట్టుకోవడం కుదరదు. ఈ కారణంగానే నాకు కరోనా సోకిందని భావిస్తున్నా' అని అతడు వివరించాడు.

వాళ్ల వల్ల కరోనా వచ్చిందని నిందించకండి

వాళ్ల వల్ల కరోనా వచ్చిందని నిందించకండి

తనకు మాస్క్ లేకపోవడం కారణంగానే కరోనా వచ్చి ఉంటుందన్న రవికృష్ణ... ఈ విషయంపై ఎవరినీ నిందించవద్దని అందరినీ కోరాడు. ‘కరోనా వైరస్ గాలిలో చాలా సేపు ఉంటుంది. షూటింగ్ సమయంలో నేను మాస్క్ వాడలేదు కాబట్టి కోవిడ్ -19 పాజిటివ్ వచ్చింది. అంతేకానీ, వేరే వాళ్ల వల్ల నాకు కరోనా వచ్చిందని దయచేసి ఎవరినీ నిందించవద్దు' అని పేర్కొన్నాడు.

రవికృష్ణను అడగకూడని ప్రశ్న అడిగిన శివజ్యోతి.!

రవికృష్ణను అడగకూడని ప్రశ్న అడిగిన శివజ్యోతి.!

ఈ లైవ్ చాట్‌లో తనకు సంబంధించిన విషయాలన్నీ వివరించాడు రవికృష్ణ. ఆ సమయంలోనే శివజ్యోతి కలగజేసుకుని ‘నీ లగ్గమెప్పుడు రా' అని అతడిని ప్రశ్నించింది. దీనికి రవి ‘అసలే కరోనా వచ్చి బాధ పడుతుంటే లగ్గం గురించి అడుగుతావేంటే.. ఈ టైమ్‌లో అడిగే ప్రశ్నేనా అది' అంటూ సమాధానమిచ్చాడు. అంతేకాదు, త్వరలోనే పెళ్లి చేసుకుంటా అని చెప్పుకొచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X