For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సీరియల్ హీరోయిన్‌తో రవికృష్ణ లవ్వాట: ప్రపోజ్ చేయగానే ముద్దు పెట్టేసిన బుల్లితెర స్టార్.!

  By Manoj
  |

  బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చిన కొద్ది రోజులకే అద్భుతమైన టాలెంట్‌తో భారీ స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్నాడు ప్రముఖ హీరో రవికృష్ణ. 'మొగలిరేకులు' అనే సీరియల్‌లో గుర్తింపు తెచ్చుకున్న అతడు.. వరుసగా సూపర్ హిట్ సీరియల్స్‌లో నటిస్తూ బాగా ఫేమస్ అయ్యాడు. 'వరూధినీ పరిణయం'తో ఎనలేని క్రేజ్‌ను సంపాదించుకున్న ఈ బుల్లితెర స్టార్... వరుస ఆఫర్లతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఈ నేపథ్యంలో రవికృష్ణ... సీరియల్ హీరోయిన్‌తో రొమాన్స్ చేయడం.. ముద్దు పెట్టడం హాట్ టాపిక్ అవుతోంది. ఇంతకీ ఎవరా హీరోయిన్.? పూర్తి వివరాల్లోకి వెళితే....

  బుల్లితెర స్టార్‌కు మంచి పేరు తెచ్చిన షో

  బుల్లితెర స్టార్‌కు మంచి పేరు తెచ్చిన షో

  బుల్లితెరపై వరుస సీరియల్స్‌తో తన హవాను చూపిస్తున్నాడు హీరో రవికృష్ణ. వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటోన్న సమయంలో బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. మూడో సీజన్‌లో వచ్చిన కంటెస్టెంట్లు అందరిలోనూ మంచోడిగా పేరు తెచ్చుకున్న రవి.. మరింత ఫేమస్ అయ్యాడు. అంతేకాదు, మరిన్ని అవకాశాలు అందుకుంటూ దూసుకెళ్తున్నాడు.

  మహమ్మారి బారిన పడిన బుల్లితెర హీరో

  మహమ్మారి బారిన పడిన బుల్లితెర హీరో

  కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్న సమయంలో రవికృష్ణ కరోనా మహమ్మారి బారిన పడ్డాడు. ‘ఆమెకథ' సీరియల్ షూటింగ్‌లో పాల్గొన్న సమయంలో అతడికి ఈ వైరస్ సోకినట్లు ప్రచారం జరిగింది. అంతకు ముందే హీరోయిన్ నవ్యసామికి పాజిటివ్ రావడంతో ఈ ప్రచారం మొదలైంది. కరోనాను జయించిన తర్వాత రవికృష్ణ మరింత స్పీడు పెంచేసి సీరియల్స్‌లో నటిస్తున్నాడు.

  సోదరి, ప్రియురాలి కలిసి ఎంట్రీ ఇచ్చాడు

  సోదరి, ప్రియురాలి కలిసి ఎంట్రీ ఇచ్చాడు

  బిగ్ బాస్ ద్వారా శివజ్యోతితో రవికృష్ణ సోదర బంధంతో చాలా క్లోజ్ అయ్యాడు. అప్పటి నుంచి వీళ్లిద్దరూ ఎప్పుడూ కలిసే కనిపిస్తున్నారు. ఇక, తాజాగా ఆమెతో పాటు తన సీరియల్ పార్ట్‌నర్ అయిన నవ్యసామితో కలిసి రవికృష్ణ ‘క్యాష్' షోలో పాల్గొన్నాడు. వీళ్లతో పాటు ప్రణవి కూడా వచ్చింది. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. దీనికి మంచి రెస్పాన్స్ వస్తోంది.

  ఆడిషన్స్‌లో కలిసిన రవికృష్ణ, నవ్యసామి

  ఆడిషన్స్‌లో కలిసిన రవికృష్ణ, నవ్యసామి

  షోలో భాగంగా సుమ దర్శకురాలిగా ‘పాతాళగంగ' అనే సీరియల్ తీస్తున్నట్లు చెప్పింది. ఇందుకుగానూ ఆడిషన్స్ నిర్వహించింది. దీనికి రవికృష్ణ, నవ్యసామి హాజరయ్యారు. ఆ సమయంలో మీకు ఏం కావాలి చెప్పండి అంటూ ఆ ఇద్దరూ దర్శకురాలైన సుమను అడిగారు. దీనికి ‘యాక్టింగ్ కావాలి' అంటూ పంచ్ పేల్చింది. ఆ తర్వాత మీపై మాకు అంచనాలు లేవంటూ మరో బాంబ్ పేల్చింది.

  సీరియల్ హీరోయిన్‌తో రవికృష్ణ లవ్వాట

  సీరియల్ హీరోయిన్‌తో రవికృష్ణ లవ్వాట

  బుల్లితెర రంగంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌గా ఉన్న రవికృష్ణ.. కొద్ది రోజులుగా తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. గతంలో అతడు సీరియల్ హీరోయిన్ నవ్యసామితో ప్రేమాయణం సాగిస్తున్నాడని కూడా ప్రచారం జరిగింది. ఇప్పుడు దీనికి బలం చేకూర్చేలా సుమ షోలో నిర్వహించిన ఆడిషన్స్‌లో భాగంగా నవ్యసామి... రవికృష్ణకు ప్రపోజ్ చేసింది. దీంతో ఈ జంట మరోసారి హైలైట్ అయింది.

  ప్రపోజ్ చేయగానే ముద్దు పెట్టేసిన హీరో

  షోలో జరిగిన ఆడిషన్స్‌లో భాగంగా నవ్యసామి మోకాళ్లపై కూర్చుని రవికృష్ణకు ప్రపోజ్ చేయగానే... అతడు వెంటనే ఆమె నుదిటిపై ముద్దు పెట్టేశాడు. దీంతో పక్కనే ఉన్న సుమ షాకైపోవడంతో పాటు నోరెళ్లబెట్టేసింది. అంతేకాదు, ‘మనం ముద్దు పెట్టమని చెప్పలేదు కదా. ఈ సీన్ మన సీరియల్‌లో లేదురా' అంటూ కామెంట్ చేసింది. దీంతో ఇది నిజమేనేమోనన్న ఫీల్ కలుగుతోంది.

  Actor Navdeep Strong Counter To Netizen | Oneindia Telugu
  మరో లెవెల్‌కు వెళ్తే మా పరిస్థితి ఏంటి

  మరో లెవెల్‌కు వెళ్తే మా పరిస్థితి ఏంటి

  ముద్దు ఎందుకు పెట్టావ్ అని సుమ ప్రశ్నించగానే... రవికృష్ణ ‘అంటే ఫ్లోలో పెట్టేశాను. సీన్‌ను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లాలి కదండి' అంటూ వివరణ ఇచ్చుకున్నాడు. దీనికి ‘ఏంటండి నెక్ట్స్ లెవెల్.? ఇంకో లెవెల్‌కు వెళ్తే మా పరిస్థితి ఏంటండి' అంటూ బదులిచ్చింది. దీంతో ఆ జంటతో పాటు అక్కడున్న వారందరూ నవ్వుకున్నారు. దీంతో ఈ ప్రోమో బాగా వైరల్ అయిపోయింది.

  English summary
  Ravi Krishna is an Indian actor who works in Telugu television industry. He is participating in one of the popular television reality show, Bigg Boss Telugu Season 3 hosted by Akkineni Nagarjuna.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X