సీరియల్ హీరో రవికృష్ణ పెళ్లి ఫిక్స్: చేసుకునేది ఆమెనే.. పుసుక్కున లీక్ చేసేసిన తల్లి!
అద్భుతమైన యాక్టింగ్‌కు తోడు హ్యాండ్సమ్ లుక్స్‌తో బుల్లితెరపై స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు నటుడు రవి కృష్ణ. సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో సీరియళ్లలో నటించిన అతడు.. మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. మరీ ముఖ్యంగా లేడీస్ ఫాలోయింగ్‌కు అందుకుని దూసుకుపోతున్నాడు. ఈ క్రేజ్ వల్లే బిగ్ బాస్ మూడో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నాడు. ఆ షో నుంచి వచ్చిన తర్వాత వరుస ఆఫర్లతో హవా చూపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో హీరో రవి కృష్ణ పెళ్లి పీటలెక్కబోతున్నాడు. ఈ విషయాన్ని అతడి తల్లి రివీల్ చేశారు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

అదిరిపోయే ఎంట్రీ.. అలా పాపులర్
తెలుగు రాష్ట్రాల్లో సీరియల్ యాక్టర్లకు ఉన్న ఫాలోయింగే వేరు. అందుకే మన బుల్లితెరపై నటించే వారు బిగ్ సెలెబ్రిటీలుగా వెలుగొందుతున్నారు. ఇలా 'మొగలిరేకులు' అనే సీరియల్‌లో గుర్తింపు తెచ్చుకున్నాడు రవి కృష్ణ. ఇందులో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపించిన అతడు.. తర్వాత హీరోగా మారాడు. ఈ క్రమంలోనే 'వరూధినీ పరిణయం'తో ఎనలేని క్రేజ్‌ను సంపాదించుకున్నాడు.

బిగ్ బాస్ కంటస్టెంట్... మంచోడిగా
హీరోగా మారిన తర్వాత వరుస సీరియల్స్‌తో తన హవాను చూపిస్తున్నాడు హీరో రవికృష్ణ. వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటోన్న సమయంలో బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ మూడో సీజన్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి నుంచీ చక్కగా ఆడుతూ.. హౌస్‌మేట్స్‌తో కలిసి మెలిసి ఉంటూ మంచోడిగా పేరు తెచ్చుకున్న రవి.. మరింత ఫేమస్ అయ్యాడు.

ఆఫర్లే ఆఫర్లు.. ఆమె కథతో కొత్తగా
బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత రవి కృష్ణ వరుస ఆఫర్లను అందుకుంటున్నాడు. ఈ క్రమంలోనే కొన్ని సినిమాల్లో నటించే అవకాశాలు కూడా వచ్చినా.. బుల్లితెరపైనే కనిపించేందుకు మొగ్గు చూపాడు. ఈ క్రమంలోనే 'ఆమెకథ' అనే సీరియల్‌ను మొదలెట్టాడు. ఇందులో అతడు తొలిసారి నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రను పోషిస్తున్నాడు. నవ్యసామీ లీడ్ రోల్ చేస్తోంది.

ఆ షోలో రెచ్చిపోయి.. ఆమెకు కిస్
బిగ్ బాస్ షో ద్వారా పరిచయం అయిన శివజ్యోతి, తన సీరియల్ పార్ట్‌నర్ నవ్యసామితో కలిసి రవికృష్ణ కొద్ది రోజుల క్రితం 'క్యాష్' షోలో పాల్గొన్నాడు. ఇందులో సుమ ఇచ్చిన టాస్కులో భాగంగా హీరోయిన్‌తో కలిసి లవర్‌లా నటించాడు. ఇందులో భాగంగా నవ్యసామి... రవికృష్ణకు ప్రపోజ్ చేసింది. ఆ వెంటనే ఆమెను హగ్ చేసుకున్న అతడు.. నుదుటిపై ముద్దు పెట్టి షాకిచ్చాడు.

హీరోయిన్‌తో లవ్... బాగా ఫేమస్
బుల్లితెర రంగంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌గా ఉన్న రవికృష్ణ.. కొద్ది రోజులుగా తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. గతంలో అతడు సీరియల్ హీరోయిన్ నవ్యసామితో ప్రేమాయణం సాగిస్తున్నాడని కూడా ప్రచారం జరిగింది. 'క్యాష్' షోలో చేసిన హడావిడితో వీళ్ల మధ్య బంధం నిజమేనని అంతా అనుకున్నారు. అదే సమయంలో ఇద్దరూ ఒకేసారి కరోనా బారిన పడడంతో దీనికి బలం చేకూరింది.

సీరియల్ హీరో రవికృష్ణ పెళ్లి ఫిక్స్
స్టార్‌మా ఆధ్వర్యంలో సంక్రాంతి స్పెషల్‌గా ఓ ఈవెంట్ చేస్తున్నారు. దానికి సంబంధించిన ప్రోమో కూడా విడుదలైంది. ఇందులో రవి కృష్ణ తల్లిదండ్రులు కూడా వచ్చారు. ఈ సందర్భంగా యాంకర్ లాస్య అతడి పెళ్లి గురించి ప్రశ్నించగా.. ఏప్రిల్‌లో పప్పన్నాలు పెడుతున్నాం అని అతడి తల్లి వెల్లడించారు. దీంతో రవి కృష్ణ పెద్దలు చూసిన అమ్మాయినే పెళ్లే చేసుకోబోతున్నాడని తేలిపోయింది.


Click it and Unblock the Notifications











