Just In
- 1 hr ago
హాలీవుడ్ చిత్రం గాడ్జిల్లా vs కాంగ్ ట్రైలర్ విడుదల: తెలుగుతో పాటు ఆ భాషల్లో కూడా వదిలారు
- 2 hrs ago
మహేశ్ బాబు పేరిట ప్రపంచ రికార్డు: సినిమాకు ముందే సంచలనం.. చలనచిత్ర చరిత్రలోనే తొలిసారి ఇలా!
- 3 hrs ago
ఘనంగా హీరో వరుణ్ వివాహం: సీసీ కెమెరాలు తీసేసి మరీ రహస్యంగా.. ఆయన మాత్రమే వచ్చాడు!
- 4 hrs ago
శ్రీరాముడిపై మోనాల్ గజ్జర్ అనుచిత వ్యాఖ్యలు: అందుకే అలాంటోడిని చేసుకోనంటూ షాకింగ్‌గా!
Don't Miss!
- Sports
మెల్బోర్న్ సెంచరీ చాలా స్పెషల్.. అందుకే సిడ్నీలో మైదానం వీడలేదు: అజింక్యా రహానే
- News
నేరం మీది కాదు..ఆ అదృశ్య వ్యక్తిది: ఎన్టీఆర్ సినిమా చూపిస్తున్నారు: నిమ్మగడ్డకు ముద్రగడ..ఘాటుగా
- Automobiles
కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ ఎప్పుడు? ఇందులో కొత్తగా ఏయే ఫీచర్లు ఉండొచ్చు?
- Lifestyle
జుట్టు పెరగడానికి నూనె మాత్రమే సరిపోదు, ఇక్కడ మోకాలి పొడవు జుట్టు యొక్క రహస్యం ఉంది
- Finance
Budget 2021: హెల్త్ బడ్జెట్ డబుల్! నిర్మలమ్మ 'ప్రధానమంత్రి హెల్త్‌ఫండ్?'
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కరోనా ఫైనల్ రిపోర్ట్స్ వచ్చేశాయ్.. రవికృష్ణపై బిగ్‌బాస్ హౌస్‌మేట్స్ రియాక్షన్!!
బిగ్‌బాస్ ఫేమ్ రవికృష్ణకు కరోనా వచ్చిందనే వార్తలు ఎంతగా వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సీరియల్ షూటింగ్లకు అనుమతివ్వడంతో సినీ పరిశ్రమలో కరోనా విజృంభించడం ప్రారంభించింది. వరుసబెట్టి సీరియల్ నటీనటులకు కరోనా సోకుతోంది. ఈ క్రమంలోనే ఆమె కథ సీరియల్ హీరో, హీరోయిన్లకు కరోనా వచ్చింది. ముందుగా హీరోయిన్ నవ్యస్వామికి పాజిటివ్ అని తేలింది. దీంతో యూనిట్ మొత్తం ఆందోళనకు గురైంది.

నవ్యస్వామికి కరోనా..
నవ్యస్వామికి కరోనా సోకిందనే వార్త క్షణాల్లో వైరల్ అయింది. అయితే ఈ వార్తలపై నవ్యస్వామి స్పందించింది. కరోనా వచ్చినదానికంటే తనపై వచ్చిన రూమర్లే తనను ఎక్కువగా బాధించాయని చెప్పుకొచ్చింది. తాను కావాలనే అందరికీ అంటించానని కొందరు ప్రచారం చేస్తున్నారని వాపోయింది. అయితే రవికృష్ణకు కూడా కరోనా అని బయటపడటంతో మరింత షాక్‌కు గురైంది యూనిట్.

లక్షణాలు లేకపోయినా..
నవ్యస్వామికి కరోనా అని తేలడంతో సీరియల్ యూనిట్ అంతా అప్రమత్తమైంది. అందరికీ పరీక్షలు నిర్వహించారు. అయితే అందులో రవికృష్ణకు ఎలాంటి లక్షణాలు లేకపోయినా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో స్వీయ నియంత్రణను పాటిస్తూ హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకున్నాడు.

తాజాగా ఫైనల్ రిపోర్ట్స్..
ఇన్ని రోజులు చికిత్స అనంతరం మరోసారి పరీక్షలు నిర్వహించగా.. తాజాగా ఫైనల్ రిపోర్ట్స్ వచ్చాయట. దాంట్లో నెగెటివ్ అని రావడంతో ఎగిరి గంతులువేస్తున్నాడట. రవికృష్ణకు నెగెటివ్ అని తేలడంతో బిగ్ బాస్ హౌస్‌మేట్స్ అంతా సంబరాల్లో మునిగిపోయారు.

సంతోషంలో సభ్యులు..
బిగ్ బాస్ సభ్యులు శివజ్యోతి, అషూ, హిమజ, రాహుల్ సిప్లిగంజ్ ఇలా అందరూ రవికృష్ణకు పాజిటివ్ రావడంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అవునవును.. అతను కోవిడ్ 19 నుంచి రికవరీ అయ్యాడు, నెగెటివ్ వచ్చిందని అషూ, యా మై బాయ్ బ్యాక్ టు నార్మల్ అని శివజ్యోతి, బ్యాక్ టు నార్మల్ మాము... ఘర్ ఆజావో అని రాహుల్ తన సంతోషాన్ని పంచుకున్నారు.