పెంకుటిల్లు ఎక్కి టెంప్టింగ్ ఫోజులు .. చీరలో సెగలు రేపుతోన్న బిగ్‌బాస్ బ్యూటీ
సాధారణ న్యూస్ రీడర్‌గా , యాంకర్లుగా కెరీర్ ప్రారంభించి స్టార్‌లుగా మారినవారు ఇండస్ట్రీలో ఎందరో ఉన్నారు. అనసూయ భరద్వాజ్, ప్రియా భవానీ శంకర్ వీరిలో కొందరు. ఈ కోవలోకే వస్తారు రేష్మా పసుపులేటి. తొలినాళ్లలో ఛానెల్‌లో న్యూస్ రీడర్‌గా ఆమె కెరీర్ ప్రారంభించారు. అనంతరం సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలో అడుగుపెట్టి సీరియల్స్, షోలలో దున్నేస్తున్నారు.
1983 జూలై 23న చెన్నైలో స్థిరపడిన తెలుగు కుటుంబంలో జన్మించిన రేష్మా పసుపులేటి ఉన్నత విద్యావంతురాలు. అమెరికాలోని అర్కాన్సాస్‌లో ప్రాథమిక విద్యను , టెక్సాస్ ఏ అండ్ ఎం యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్‌లో ఇంజనీరింగ్ చేశారు. చదువు తర్వాత సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గానూ, అమెరికన్ ఎవియేషన్ కంపెనీ డెల్టా ఎయిర్‌లైన్స్‌కు ఎయిర్ హోస్టెస్‌గానూ పనిచేశారు. తర్వాతి కాలంలో స్వదేశానికి తిరిగొచ్చిన రేష్మా పసుపులేటీ .. ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌లో ఇంగ్లీష్ న్యూస్ రీడర్‌గా పనిచేశారు.

నటనపై ఆసక్తితో ఉద్యోగానికి రాజీనామా చేసిన రేష్మా పసుపులేటి కెరీర్‌ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నారు. బుల్లితెర ద్వారా వెండితెరపై అడుగుపెట్టాలని నిర్ణయించుకుని తమిళ సీరియల్ వంశంలో కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో 2015లో మసాల పాదంలో హీరోయిన్‌గా ఛాన్స్ దక్కింది. అనంతరం కో 2, మనల్ కయైరు 2, తిరైక్కు వరద కథై, వనక్కమ్ దా మపిల్లై, పే మామ, 3:33, సతియ సోతనై, సూరగాన్ వంటి తమిళ చిత్రాల్లో నటించారు రేష్మా.
2022లో ఆనంద్ దేవరకొండ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ హైవేలో రేష్మా కీలకపాత్ర పోషించారు. కానీ సినిమాల్లో మాత్రం ఈమెకు అవకాశాలు దక్కడం లేదు. బుల్లితెరపై మాత్రం రేష్మ తిరుగులేని నటిగా వెలుగొందుతున్నారు. తెలుగు, తమిళంలలో సీరియల్స్, షోలు, ఇతర కార్యక్రమాల్లో వరుసపెట్టి అవకాశాలు అందుకుంటూ బిజీగా ఉన్నారు. ఈ పాపులారిటీతో తమిళ్ బిగ్‌బాస్ 3లోనూ అవకాశం దక్కించుకుని గ్లామర్ షో చేశారు.
ఇకపోతే.. సుచీ లీక్స్ పేరిట గతంలో రేష్మా పసుపులేటిపై సుచిత్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈమెకు గతంలోనే పెద్దలు కుదిర్చిన వివాహం జరిగింది, అయితే అతనితో విభేదాల కారణంగా విడాకులు ఇచ్చేసి అమెరికాలో ఓ వ్యక్తిని పెళ్లాడి అతనితోనూ విడిపోయింది. మొన్నామధ్య దర్శకుడు నిషాంత్ రవీంద్రన్‌తో క్లోజ్‌గా ఉన్నఫోటో ఒకటి వైరల్ కావడంతో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందని గాసిప్స్ చక్కర్లు కొట్టాయి. అయితే మా ఇద్దరి మధ్య ఏం లేదని, దయచేసి అవాస్తవాలు ప్రచారం చేయొద్దని రేష్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే రేష్మ.. ఎప్పటికప్పుడు తన సీరియల్స్, షోలు ఇతర వ్యక్తిగత వివరాలను పంచుకుంటూ ఉంటారు. అలాగే హాట్ హాట్ ఫోటో షూట్‌లతో కుర్రాళ్లకి సెగలు రేపుతుంటారు. తాజాగా నారింజ రంగు చీర కట్టి.. పెంకుటిల్లు పైకి ఎక్కిన రేష్మ ఎవరి కోసమో ఎదురుచూస్తున్నట్లుగా కొంటే ఫోజులు పెట్టింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంకేందుకు ఆలస్యం మీరూ రేష్మా పసుపులేటి అందాలపై ఓ లుక్కేయండి.


Click it and Unblock the Notifications











