నాకు అంత బ్రెయిన్ లేదు... సబ్‌స్క్రిప్షన్‌ వివాదంపై రీతూ చౌదరి రియాక్షన్

ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు తీసుకొచ్చిన సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ద్వారా సెలబ్రిటీలు భారీగా సంపాదిస్తున్నారు. ఎక్స్‌క్లూజివ్ పేరిట, హాట్, బోల్డ్ కంటెంట్‌ను షేర్ చేస్తుండటంతో వివాదాస్పదం అవుతోంది. స్టార్ యాంకర్ విష్ణుప్రియ, అషురెడ్డి, అనన్య నాగళ్ల వంటి సెలబ్రిటీలు తెలుగునాట ఈ సబ్‌‌స్క్రిప్షన్ ప్లాన్‌తో భారీగా సంపాదిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే విష్ణుప్రియ షేర్ చేస్తున్న కంటెంట్‌లో అశ్లీలత పెరగడంతో ఆమెపై కేసులు పెట్టే వరకు వ్యవహారం వెళ్లింది. ఈ వివాదం కారణంగా ఆమె ఫాలోవర్స్, సబ్‌స్క్రైబర్లు కూడా భారీగా పెరిగారు. మరోవైపు.. బుల్లితెర నటి, బిగ్‌బాస్ ఫేమ్ రీతూ చౌదరి కూడా సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ప్రారంభించినట్లుగా వార్తలు వచ్చాయి. తాజాగా దీనికి ఆమె క్లారిటీ ఇచ్చారు.

రా ఎంటర్‌టైన్‌మెంట్స్, ప్రదీప్ మద్దాలి క్రియేటివ్స్ బ్యానర్‌పై బీవీఎస్ రవి, కౌముదిలు మేం కాపులం వెబ్ సిరీస్ నిర్మించగా.. ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహించారు. నాగేంద్రబాబు, గెటప్ శ్రీను, రవితేజ, రీతూ చౌదరి, చరణ్ లక్కరాజు, సిరి పార్వతి, కిరిటీ దామరాజు తదితరులు కీలకపాత్రలు పోషించారు. సాకేత్ కొమండూరి సంగీతం అందించగా.. మైఖేల్ డి సెల్వ ఎడిటర్‌గా, కిశోర్ బోయిడపు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రీతూ చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు.

Bigg Boss Fame Rithu Chowdary Reacts to Subscription Controversy

ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రీతూ చౌదరి మాట్లాడుతూ... మేం కాపులం మూవీలో జర్నలిస్టుగా నటిస్తున్నా. చాలా ఫన్నీ వెబ్ సిరీస్ ఇది.. తప్పకుండా జీ 5లో సబ్‌స్క్రైబ్ చేసుకుని చూడాల్సిందే. మేం కాపులంలో చాలా కామెడీ ఉంటుంది. నాగబాబు గారి రోల్ బాగుంటుంది. నేను జర్నలిస్ట్‌గా ఫస్ట్ టైం నటిస్తున్నాను.. ఇది నాకు చాలా ప్రత్యేకం. నేను నా కెరీర్ స్టార్ట్ చేసిందే వీజేగా.. ఇంటర్వ్యూలు చేశాను. ఇప్పుడు అదే రోల్‌లో నటించడం ఆనందంగా ఉంది. జర్నలిస్ట్‌ అంటేనే చాలా క్వశ్చన్స్ అడుగుతుంటారు.. కొంచెం ఇబ్బందులు పడుతుంటాం ఆ రోల్ ఎలా అనిపించిందని యాంకర్ అడగ్గా.. నేను ఎవరినీ ఇబ్బంది పెట్టలేదు, నన్నే ఇబ్బందులు పెడుతుంటారు. సినిమా చూసిన తర్వాత అంత కామ్‌గా కనిపించే జర్నలిస్ట్ కాదని అర్ధమవుతుందని రీతూ చెప్పింది.

రియల్ లైఫ్‌లో ఎక్కడికైనా వెళ్లినా, కొన్ని పరిస్ధితుల్లో చెప్పండి చెప్పండి అని వెంటపడుతుంటారు. అలాంటి రోల్ నేను ప్లే చేస్తున్నందుకు డిఫరెంట్‌గా అనిపిస్తోంది. సబ్‌స్క్రిప్షన్ వివాదం గురించి ఏమైనా ఫోన్లు వచ్చాయా అని యాంకర్ ప్రశ్నించగా.. నేను ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ తీసుకురాలేదని క్లారిటీ ఇచ్చింది రీతూ చౌదరి. అగ్రిమెంట్ కారణంగా స్టార్ మాలో కొన్ని షోలు చేస్తున్నాను. ఓటీటీలో మేం కాపులంతో పాటు మరో సినిమా చేస్తున్నాను అది ఫైనల్ అవ్వగానే నేను మీకు కనిపిస్తా. నాకు పోలీస్ క్యారెక్టర్, డాక్టర్ క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి నేను ఏది అవుదామని అనుకున్నానో ఆర్టిస్ట్‌గా అవన్నీ చేద్దామని అనుకుంటున్నాను. కానీ స్ట్రాంగ్‌గా ఉండే క్యారెక్టర్ చేయాలని ఉంది.. దేవుడి దయ వల్ల వస్తే ఇంకా ముందుకు వెళ్తానని రీతూ చౌదరి వెల్లడించారు.

సెలబ్రిటీ స్టేటస్ వచ్చాక, పాపులారిటీ వచ్చిన తర్వాత ఏది చేసినా కూడా చాలా జాగ్రత్తగా చేయాలి అలా ఏమైనా అనుకుంటున్నారా అని యాంకర్ అడగ్గా.. నాకు అంత జాగ్రత్తగా చేసే బ్రెయిన్ ఉండదు. సినిమాలు, వెబ్ సిరీస్‌లలో నేను చేసే క్యారెక్టర్ బాగుండాలని కోరుకుంటాను. దాని వల్ల ఇంకా మంచి క్యారెక్టర్స్ రావాలని చూసుకుంటాను. అలా ఈ క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది. నాగబాబుగారు ఓ వ్యక్తిగా నాకు చాలా ఇష్టం. ఆయనతో వర్క్ చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది, జీ తెలుగులోనే నా జీవితం మొదలైంది. ఈ వెబ్ సిరీస్‌లో జర్నలిస్ట్ మాత్రమే కాకుండా కొత్తగా ఉంటుందని రీతూ చౌదరి పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X