వాడు నాకంటే మూడేళ్లు చిన్న.. పెళ్లి ఆమె చేతుల్లోనే.. తేల్చేసిన బిగ్‌బాస్ రోహిణి
తెలుగు బుల్లితెరపై ఉన్న లేడీ కమెడియన్లలో టాప్ ప్లేస్‌లో ఉంటారు నటి రోహిణి రెడ్డి. జబర్దస్త్, బిగ్‌బాస్, ఇతర షోలలో సత్తా చాటుతూ నవ్వులు పూయిస్తుంటారు రోహిణి. నటన, సినిమాలపై పిచ్చితో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఉద్యోగాన్ని సైతం వదులుకుని తన కష్టం, ప్రతిభతో కల నెరవేర్చుకున్నారు రోహిణి. సీరియల్స్, స్పెషల్ షోలతో బుల్లితెరపై హల్‌చల్ చేసిన ఆమె.. పలు సినిమాల్లోనూ నవ్వులు పూయించింది. వయసు పెరుగుతున్నా ఇప్పటి వరకు పెళ్లి గురించి ఆమె ఎక్కడా బయటపెట్టలేదు. తాజాగా ఓ షోలో కీలక వ్యాఖ్యలు చేశారు రోహిణి రెడ్డి.
స్టార్ మాలో ప్రసారమవుతున్న కుకు విత్ జాతిరత్నాలు సీజన్ 2 షో ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తోంది. యాంకర్ ప్రదీప్ మాచిరాజు హోస్ట్‌గా.. అరుణ ముచ్చర్ల, అలీ, శ్రీదేవి విజయ్ కుమార్, సంజయ్ తుమ్మాలు జడ్జిలుగా అలరిస్తున్నారు. వారం వారం స్పెషల్ థీమ్‌లతో, నోరూరించే వంటకాలతో ఆకట్టుకుంటున్నారు బుల్లితెర సెలబ్రిటీలు. తాజాగా ఈ వారం ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో ప్రసారమైంది. అందులో రోహిణి రెడ్డి, నిఖిల్ విజయేంద్ర సింహ గొడవ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

కుకు విత్ జాతిరత్నాలు సీజన్ 2 షో ప్రేమమయం అయిపోయింది. ప్రేమతో ఈ ప్రేమ లేఖ నీకోసం అంటూ ప్రదీప్ ఎంట్రీ ఇచ్చాడు. అన్ లిమిటెడ్ లవ్వు.. నాన్ స్టాప్ నవ్వు అంటూ అదరిపోయేలా ఇంట్రో చెబుతాడు. ఆ వెంటనే నిఖిల్, రోహిణిలు ఫిల్ మై లవ్ అంటూ టైటానిక్ బ్యాక్‌డ్రాప్‌లో ఎంట్రీ ఇస్తారు. మంచి జోష్‌లో ఉన్న నిఖిల్.. రోహిణికి ముద్దు పెట్టడంతో అంతా షాక్ అయ్యారు. రోహిణి కూడా వెంటనే తేరుకుని ఇప్పటి వరకు స్టేజ్ మీద ఎవరూ నాకు ముద్దు పెట్టలేదు.. ఫస్ట్ టైం ముద్దుపెట్టాడు, నేను ఫిక్స్ అయ్యాను. మీ అమ్మతో మాట్లాడి ఒప్పిస్తావా? లేదా? నిన్ను నేను వదిలేదు లేదనడంతో నిఖిల్‌కు చెమటలు పడతాయి.
నిజంగా చిన్నది అయ్యుంటే నేను పెళ్లి చేసుకునే వాడిని అంటాడు నిఖిల్. ఆ మాటలకు షాకైన రోహిణి.. నాకు నీకు మూడేళ్లు డిఫరెన్స్ ఓకేనా? కాదా? అంటుంది. నా వల్ల నీకు ఎన్ని అడ్వాంటేజ్‌లు ఉంటాయంటే బీబీ జోడీకి వెళ్లొచ్చు.. బిగ్‌బాస్ కపుల్ జోడీగా వెళ్లొచ్చు. మినిమమ్ నాకు 4 లక్షలు ఇస్తారు.. నీకొక 2 లక్షలు ఇస్తారు అంటుంది రోహిణి. దాంతో అంతా నవ్వేస్తారు. ఆ వెంటనే మణికంఠ ఆడవేషంలో వచ్చి.. 400 సంవత్సరాలుగా నా ఆత్మ పరితపించి పోయి ఎటు వెళ్లాలో తెలియక చివరికి ఈ దేహంలోకి వెళ్లింది నీ కోసమే ఈ గుండె కొట్టుకుంటోందని తనూజతో అంటాడు. రెండు తన్నులు తంతానని తనూజ సీరియస్ అవుతుంది.
ఆ తర్వాత తనూజకి, మణికంఠ కళ్లకి గంతలు కట్టి స్టేజ్ మీద ప్లేటులో ఉంచిన ఫుడ్‌ని రుచి చూసి ఏ వెరైటీయో చెప్పాలని టాస్క్ ఇస్తాడు ప్రదీప్. హల్వా అని తనూజ గుర్తుపట్టగా.. మణికంఠకి మాత్రం ఘాటుగా ఉండేది తినిపిస్తాడు ప్రదీప్. మళ్లీ తనూజకి తినిపించగా.. మూతి పగులుద్ది అది హల్వా అంటూ ఆమె సీరియస్ అవుతుంది. ఆ వెంటనే ఆషిగా గోపాల్- అవినాష్‌లకు కూడా అదే టెస్ట్ పెడతారు. ఆషికా తినిపించడానికి అవినాష్ అందకపోవడంతో అంతా నవ్వేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతుండగా.. రోహిణికి, నిఖిల్‌కి గొడవ సద్దుమణిగిందా? రోహిణిని పెళ్లి చేసుకోవడానికి నిఖిల్ ఒప్పుకున్నాడా? లేదా తెలియాలంటే ఈ శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే కుకు విత్ జాతిరత్నాలు ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే.


Click it and Unblock the Notifications


