బిగ్‌బాస్ రోహిణిపై పర్సనల్ అటాక్.... టాప్ యాంకర్‌కు నటి శాపనార్ధాలు

వెబ్‌సిరీస్‌లు, సినిమాలు, బుల్లితెరపై దూసుకెళ్తున్నారు రోహిణి. ఇండస్ట్రీలో లేడీ కమెడియన్ల కొరత దృష్ట్యా రోహిణికి అన్ని విధాలా కలిసొస్తోంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ ముందుకెళ్తున్నారు రోహిణి. తొలుత యాంకర్, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా ఆమె కెరీర్ ప్రారంభించారు. అనంతరం పలు సీరియల్స్‌లో నటించినా అంతగా గుర్తింపు రాలేదు. ఈ దశలో జీ తెలుగులో ప్రసారమైన కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్‌లో నెల్లూరు యాసలో నవ్వులు పువ్వులు పూయించింది రోహిణి.

ఈ సీరియల్‌తో తెలుగునాట పాపులరైన రోహిణికి జబర్దస్త్ కామెడీ షో మరింత పాపులారిటీ తెచ్చిపెట్టింది. హైపర్ ఆది సహా పలువురు టీమ్ లీడర్స్‌తో కలిసి చేసిన స్కిట్స్ హిట్ కావడంతో పాటు ఆమె కామెడీ టైమింగ్‌ అదిరిపోయింది. ఆ తర్వాత ఇన్స్‌పెక్టర్ కిరణ్ అంటూ బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైంది రోహిణి. అప్పట్లో టిక్‌టాక్‌, డబ్‌స్మాష్‌లో కామెడీ రీల్స్, వీడియోలు చేసి సోషల్ మీడియాలో బాగా ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఈ ఫేమ్‌తో రోహిణికి బిగ్‌బాస్ సీజన్ 3లో కంటెస్టెంట్‌గా అవకాశం దక్కింది.

Bigg Boss Fame Rohini s Funny Warning to Express Hari Goes Viral in Aadivaram With Star Maa Parivaaram Show

బుల్లితెరపై సత్తా చాటిన రోహిణి ఆ తర్వాత సినిమాల్లోనూ సత్తాచాటారు. భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు, మత్తు వదలరా, బంగార్రాజు, హ్యాపీ బర్త్ డే, హనుమాన్ వంటి సినిమాలలో కీలకపాత్రలు పోషించింది. అన్నింటికి మించి ఓటీటీలో వచ్చిన సేవ్ ది టైగర్స్ సిరీస్ రోహిణి కెరీర్‌ను మరింత మలుపు తిప్పింది. ఈ వెబ్‌సిరీస్‌లో పని మనిషి లక్ష్మీగా కడుపుబ్బా నవ్వించింది రోహిణి. ముఖ్యంగా అభినవ్ గోమఠం, రోహిణి మధ్య వచ్చే సీన్లు బాగా పాపులర్ అయ్యాయి. బిగ్‌బాస్ తెలుగు 8లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చి మరోసారి అభిమానులను ఆకట్టుకుంది రోహిణి. అయితే ఈ ముద్దుగుమ్మ పెళ్లి ఎప్పుడు అంటూ పలు ఇంటర్వ్యూలలో యాంకర్లు అడగ్గా.. నవ్వుతూ తప్పించుకునేది రోహిణి. తాజాగా మరోసారి ఆ ప్రస్తావన రావడంతో అందరికీ వార్నింగ్ ఇచ్చింది.

స్టార్ మాలో ప్రసారమవుతున్న ఆదివారం విత్ స్టార్ మా పరివారం కార్యక్రమం ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతోంది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఈసారి కొత్తగా రెడీ అయ్యింది ఈ కార్యక్రమం. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. బుల్లితెర నటులు, ఇతర సెలబ్రిటీలు ఈ సందర్భంగా సందడి చేశారు. ముందుగా యూట్యూబర్ నిఖిల్ విజయేంద్ర సింహతో శ్రీముఖి మాట్లాడుతుంది. ఈ ఏడాది నీ పెళ్లి అనే వార్త గురించి సత్యనే కాదు.. బయట అందరూ మాట్లాడుకుంటున్నారని చెప్పింది.

ఈ మధ్యలో దూరిన రోహిణి.. చివరికి దీనిని కూడా నీ పెళ్లి ఎప్పుడు అని అడుగుతున్నారు. నన్నెప్పుడూ అడగటం లేదని ప్రశ్నించింది. వాడికి పెళ్లి వయసు వచ్చింది కాబట్టి అడిగారు.. నీది పెళ్లి వయసు దాటిపోయింది, ఇక దేని గురించి అడుగుతామని ఎక్స్‌ప్రెస్ హరి కౌంటర్ వేస్తాడు. దాంతో సీరియస్ అయిన రోహిణి.. నీకు పెళ్లి అవ్వలేదు కదా? అస్సలు అవ్వదు, వీడు నాతో పాటు సింగిల్‌గానే ఉండిపోతాడంటూ శాపనార్ధాలు పెట్టడంతో హరి షాక్ అవుతాడు. ఆ తర్వాత విజే సన్నీ మాట్లాడుతూ.. నేనొక పల్లెటూరికి వెళ్లా.. అక్కడి పనిమనిషి నన్ను చూసి యాక్టింగ్ ఇరగదీశానని చెప్పడంతో చాలా హ్యాపీగా ఫీలయ్యానని చెప్పాడు. ఏ సినిమాలో అని శ్రీముఖి అడగ్గా.. బ్రహ్మముడి అందని చెప్పడంతో అంతా నవ్వేస్తారు.

అనంతరం అషు రెడ్డి మాట్లాడుతూ.. కొత్త సంవత్సరం రోజున చాలా ఫ్రాంక్స్ చేయాలి, అది కాకుండా పెళ్లి అంటూ సిగ్గుపడిపోతుంది. ఇంతలో హరి వచ్చి తనకు తగలడంతో తమ్ముడు కొంచెం పక్కకు జరగమని చెప్పడంతో అంతా నవ్వేస్తారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. రౌడీ రోహిణికి- హరికి రాజీ కుదిరిందా? విజే సన్నీ ఎలాంటి ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు? అషురెడ్డి ఉగాది ప్లాన్స్ ఏంటీ? తెలియాలంటే ఆ ఆదివారం 11 గంటలకు ప్రసారమయ్యే ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో చూడాల్సిందే.

Read more about: bigg boss sreemukhi rowdy rohini
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X