భార్య చేతుల్లో బిగ్‌బాస్ కంటెస్టెంట్‌కు నరకం... దొంగనంటూ జైలుకి పంపి..
చిత్ర పరిశ్రమలో చిన్నాచితకా పాత్రలు చేస్తూ బిగ్‌బాస్ ద్వారా పాపులర్ అయ్యాడు సామ్రాట్ రెడ్డి. 2005లో విడుదలైన యువకులు సినిమాతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన ఆయనకు వినాయకుడు, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, పంచాక్షరీ, తకిట తకిట, బెట్టింగ్ బంగార్రాజు, బావ, ప్రేమకావాలి, మిస్టర్ నూకయ్య, దేనికైనా రెడీ, దూసుకెళ్తా, కిట్టు ఉన్నాడు జాగ్రత్త తదితర సినిమాలతో గుర్తింపు వచ్చింది. బుల్లెట్‌లా కెరీర్ దూసుకెళ్తున్న దశలో సామ్రాట్ రెడ్డి వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న పరిణామాలు.. ఆయనను దూకుడుకు బ్రేక్ వేశాయి. దాదాపు 8 ఏళ్లుగా వెండితెరకు దూరంగా ఉంటున్న సామ్రాట్ రెడ్డి.. ఇటీవల ధన్య బాలకృష్ణతో కలిసి చేసిన ముసలోడ సాంగ్‌తో మళ్లీ లైమ్ లైట్‌లోకి వచ్చాడు. ఈ నేపథ్యంలో ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్, జైలు జీవితం, మొదటి భార్యతో విడాకులు తదితర అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..
వెళ్తూ వెళ్తూ నా జీవితం నాశనం చేసి
నా మీద వచ్చినవన్నీ ఆరోపణలే. నా గురించి తెలిసిన వారికి నేనంటే ఏంటో తెలుసు. నేను ఎలా ఉంటానో? ఎలా మాట్లాడతానో వారికి తెలుసు. అంత దారుణంగా నేను పెరగలేదు. ఒక మ్యారేజ్ వర్కవుట్ కాకపోతే .. దానిని డీల్ చేయడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. పరస్పరం భార్యాభర్తలే ఏదో ఒక నిర్ణయం తీసుకోవచ్చు. అలాంటి ఆప్షన్స్ ఎంచుకోకుండా.. నా భార్య తప్పుడు దారి ఎంచుకుంది. నేను నటుడిని కావడం వల్ల అలా ఎందుకు వదలాలి అని నెగిటివ్ చేసింది. దాంతో బాగా ఇబ్బంది పడ్డా.. అదే టైంలో నాన్నకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. మంచి స్పీడుగా వెళ్తున్న బండికి బ్రేక్ ప్లేట్స్ తెగిపోయినట్లుగా నాకు, నా కుటుంబం పరిస్ధితి తయారైంది అని సామ్రాట్ రెడ్డి ఎమోషనల్ అయ్యారు.

నా ఇంట్లోనే నేనే దొంగతనం చేశానంటూ
దొంగతనం కేసులో నేను జైలుకు వెళ్లా.. నా ఇంట్లోనే నేను దొంగతనం చేశానట. జైళ్లో ఉన్నప్పుడు న్యూస్ పేపర్‌లో ఈ వార్త చూసి నవ్వుకున్నా. నా మీద లేనిపోని కేసులన్నీ వేసేశారు.. నా క్యారెక్టర్‌పై దుష్ప్రచారం చేశారు. ఈ పరిణామాలతో నా కెరీర్ నాశనమైంది, అదో రకమైన డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా. నాన్నకి నా వల్లే ఇలా జరిగిందనే బాధ ఇప్పటికీ ఉంది. ఆయన వెరీ ఫిట్, వెరీ ఎనర్జిటిక్. తనని హాస్పిటల్ బెడ్‌పై చూడగానే తట్టుకోలేకపోయానని సామ్రాట్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
బిగ్‌బాస్‌తో తల ఎత్తుకున్నా
నాన్నను చూసుకుంటూనే కాలం గడుపుతున్న టైంలోనే బిగ్‌బాస్‌లో అవకాశం వచ్చింది. ఫస్ట్ నో అనేశా.. ఎందుకంటే నాన్నకి టాబ్లెట్ దగ్గరి నుంచి వాకింగ్, ఫిజియో అందరి కాంటాక్ట్స్ నా దగ్గరే ఉన్నాయి. ఈ విషయం ఇంట్లో చెబితే.. ఇదే కరెక్ట్ టైం. నువ్వేంటో ప్రూవ్ చేసుకోవడానికి అక్కడికి వెళ్లాల్సిందే. మా కుటుంబంతో బంధువులు మాట్లాడం మానేశారు.. నా క్లోజ్ ఫ్రెండ్స్ 20 మంది కట్ చేశారు. ఆ సమయంలోనే ఎవరు నా వాళ్లు, ఎవరు పరాయివాళ్లో అర్ధమైంది. బిగ్‌బాస్‌లో లాస్ట్ వరకు ఉండటం వల్ల ఏపీ, తెలంగాణతో పాటు ఈ ప్రపంచం మొత్తానికి నేను ఎలాంటి వాడినో తెలిసింది. నాకు ఫ్యాన్స్, ఫాలోవర్స్ పెరిగారు.. తలదించుకునే పరిస్థితి నుంచి తలెత్తుకున్నా. 113 రోజుల పాటు బిగ్‌బాస్‌లో ఉన్నా.. ఏ రోజు నటించలేదు, యాక్ట్ చేసుంటే అది ఖచ్చితంగా బయటపడుతుందని సామ్రాట్ రెడ్డి తెలిపారు.
హంతకుడితో ఒకే సెల్‌లో
బిగ్‌బాస్‌లో అడుగుపెట్టగానే.. సామ్రాట్ రెడ్డి ఎందుకొచ్చాడు? అంత క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది? జైలుకు వెళ్లాడు, దొంగతనం చేశానని వచ్చింది అని నా ముందే కంటెస్టెంట్స్ అంతా మాట్లాడుకున్నారు. జైలులో రెండు రోజులు ఉన్నా.. ఆరోజు వచ్చే క్రిమినల్స్ అందరినీ ఒకటే దానిలో వేస్తారు. పెద్దహాల్‌లో 20 నుంచి 30 మంది ఉంటారు. ఆ నైట్.. బొటానికల్ గార్డెన్ దగ్గర ముగ్గురిని హత్య చేసి ఆయన కూడా చేయి కట్ చేసుకుని చికిత్స తీసుకుని వచ్చాడు. అతనిని నాతో పాటే ఉంచారు. దాంతో వాడు నన్నేమైనా చేస్తాడేమోనని వణికిపోయా.. ఫస్ట్ డేకి వచ్చేసేవాడిని, కానీ కూకట్‌పల్లి కోర్ట్ నుంచి బెయిల్ తీసుకుని చర్లపల్లి జైలుకు రావడంలో 10 నిమిషాలు డీలే అయ్యింది. జైలు క్లోజ్ అయ్యింది.. రేపు కొత్త బెయిల్ తీసుకుని రమ్మన్నారు. సాయంత్రం 5.30 తర్వాత ఎవరినీ రానివ్వరు. అలా రెండు రోజులు జైలులో ఉన్నానని సామ్రాట్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
బిగ్‌బాస్‌తో రాటుదేలిపోయా
ఇద్దరు అక్కలు, అమ్మ నేను ఇంట్లో చిన్న పిల్లోడిని.. చాలా గారాభంగా పెరిగా. ఎవరైనా ఏమైనా అంటే నో అని చెప్పలేను. ఈ పరిణామాలతో రాయిలా మారిపోయా. ఇది రాంగ్ అని చెప్పే అవకాశం నాకు బిగ్‌బాస్‌లో వచ్చింది. బిగ్‌బాస్‌లో ఎన్నో పాఠాలు నేర్చుకున్నా.. డ్రగ్స్ వేరే అలవాట్లు ఏమైనా ఉంటే బయటకు వచ్చేవాడినా? జీవితంలో ఎన్నో అనుభవించా.. బాగా రాటుతేలిపోయానని సామ్రాట్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా .. నెటిజన్లు ఆయన ధైర్యాన్ని, పోరాటాన్ని మెచ్చుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











