'చిన్న వయసులోనే ఆ తప్పు చేశా.. నా మీదే నాకే జాలి వేస్తుంది'

ఒకప్పుడు గ్లామర్ హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులను అలరించింది సంజన గల్రానీ (Sanjjanaa Galrani). పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన బుచ్చిగాడు (Bujjigadu) సినిమాతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్నది సంజన. ఆ తర్వాత పలు భాషల్లో సినిమాలు చేసినప్పటికీ ఊహించిన స్థాయిలో స్టార్‌డమ్ అందుకోలేకపోయారు. అనంతరం డ్రగ్స్ కేసులో చిక్కుకుని తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఆమె, కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇటీవల బిగ్‌బాస్ సీజన్ 9తో మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె తన సినీ ప్రయాణం, చేసిన తప్పులు, ఎదుర్కొన్న మానసిక ఒత్తిళ్ల గురించి ఎమోషనల్ కామెంట్స్ చేశారు.

ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంజన తన గతాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. "ఇప్పుడు కూడా గ్లామర్ పాత్రలు చేయడానికి సిద్ధమే. కానీ నా బాడీ ఫిట్‌గా ఉండాలి. నేను ఏ డ్రెస్ వేసుకున్నా అది అందంగా కనిపించాలి. ఇతరులు చూసి విమర్శించేలా ఉండకూడదు అనేది నా అభిప్రాయం" అని చెప్పారు. వెస్ట్రన్ డ్రెస్సులు వేసుకోవడంలో ఇబ్బంది లేదని, కానీ మరీ అల్ట్రా మోడ్రన్ అవుట్‌ఫిట్స్ విషయంలో మాత్రం ఇప్పుడు ఆలోచిస్తానని వెల్లడించారు.

Bigg Boss fame Sanjjanaa Galrani Gets Emotional About Career Mistakes and Industry Struggles

తన కుటుంబ పరిస్థితులే తనను ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకునేలా చేశాయని సంజన తెలిపారు. "నేను చాలా చిన్న కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చాను. ఇంటి ఖర్చులు, అమ్మానాన్నల బాధ్యతలు, చెల్లెలి చదువు అన్నీ నా భుజాలపై ఉండేవి. ఒక అవకాశం మిస్ అయితే మళ్లీ సినిమా వస్తుందా లేదా అనే భయం ఉండేది. ఆ భయంతోనే నాకు ఇష్టం లేని పాత్రలు కూడా చేశాను" అంటూ ఆమె చెప్పుకొచ్చారు.

అంతేకాదు, చాలా చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి రావడం వల్ల సరైన అవగాహన లేక తప్పులు చేశానని ఆమె అంగీకరించారు. "నేను కేవలం 12 ఏళ్ల వయసులో ఇండస్ట్రీలోకి వచ్చాను. 16 ఏళ్లకే హీరోయిన్ అయ్యాను. అప్పుడు నాకు ఏది సరైందో, ఏది తప్పో చెప్పే వారు లేరు. ఇప్పుడు నేను చేసిన కొన్ని సినిమాలు చూస్తే నామీద నాకే జాలి వేస్తుంది. ఎందుకు అలాంటి పాత్రలు చేశానా అని అనిపిస్తుంది" అంటూ సంజన భావోద్వేగానికి గురయ్యారు.

ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చే అమ్మాయిలకు కూడా ఆమె ముఖ్యమైన సూచనలు చేశారు. "అవకాశాల కోసం కంగారు పడొద్దు. నేను చేసిన పెద్ద తప్పు అదే. ఒక సినిమా కోసం, ఒక అవకాశం కోసం తొందరపడి నిర్ణయాలు తీసుకున్నాను. కానీ తర్వాత వాటి ప్రభావం జీవితాంతం వెంటాడుతుంది. కొత్తగా వచ్చే అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి' అని హెచ్చరించారు. సినిమాల విషయంలో కూడా యంగ్ జనరేషన్ ఆలోచించి అడుగు వేయాలని ఆమె సూచించారు. "ప్రతి సినిమా విడుదల అవుతుందని అనుకోవద్దు. ప్రతి కథ, ప్రతి పాత్రను అంచనా వేసుకుని ఒప్పుకోవాలి. కొన్నిసార్లు మనం చేసిన పని బయటకు రాకపోయినా, దాని ప్రభావం మాత్రం మన కెరీర్‌పై పడుతుంది" అని అన్నారు.

ఇక సోషల్ మీడియాలో అసభ్యకర ఫోటోలు, ట్రోలింగ్ గురించి కూడా సంజన స్పందించారు. "మేము కొంచెం పొట్టి డ్రెస్సులు వేసుకుంటే కొన్ని యాంగిల్స్‌లో ఫోటోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తారు. ఒక వెబ్‌సైట్‌లో ఉంటే తొలగించొచ్చు. కానీ ఇప్పటికే వేలమంది షేర్ చేస్తుంటారు. వాటిని పూర్తిగా ఆపడం చాలా కష్టం" అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం సంజన గల్రానీ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X