బిగ్‌బాస్ సెలబ్రిటి కార్యక్రమంలో అపశృతి.. ఒకరు మృతి, పలువురికి గాయాలు
పబ్లిక్ వేదికల వద్ద సినీ తారల కార్యక్రమాలు చాలా సార్లు జోష్‌ను కలిగిస్తాయి. దాని వల్ల ఎవరికీ ఇబ్బంది ఉండుద. కానీ కొన్ని సార్లు స్టార్ హీరోయిన్, హీరోల ఫంక్షన్లు చేదు అనుభవాన్ని మిగులుస్తాయి. దాంతో తీరని విషాదాన్ని చవిచూడాల్సి వస్తుంది. తాజాగా ఓ బిగ్‌బాస్ ఫేమ్ డ్యాన్సర్ కార్యక్రమం తొక్కిసలాటకు గురైంది. ఆ విషాదం గురించి..

బిగ్‌బాస్ ఫేం స్వప్న చౌదరీ
బీహార్‌లో ఛత్ పూజను ఘనంగా నిర్వహిస్తారు. చాలా ప్రతిష్టాత్మకంగా భావించే కార్యక్రమం కోసం భారీగా ఏర్పాట్లు చేస్తారు. ఇలాంటి పండుగ నేపథ్యంలో అత్యంత ప్రజాదరణ పొందిన హర్యానా డ్యాన్సర్, బిగ్‌బాస్ 11 ఫేమ్ స్వప్న చౌదరీ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఇసుక వేస్తే రాలనంత జనం
స్వప్న చౌదరీ కార్యక్రమానికి బెగుసరాయ్ పట్టణం వేదికైంది. ఇసుక వేస్తే రాలనంత జనం తరలివచ్చారు. జనాన్ని కంట్రోల్ చేసేందుకు ఏర్పాటు చేసిన బారికేడ్లు తోపులాటలో విరిగిపోయాయి. పక్కనే ఉన్న వేదికపైకి భారీగా ఎక్కడంతో అది కూలిపోయింది.

ఒకరు మరణించగా.. పలువురు
స్వప్న చౌదరీ ఉన్న వేదిక కూలిపోవడంతో సమీపంలో ఉన్న ప్రేక్షకులు పరుగులు పెట్టారు. దాంతో భారీగా తొక్కిసలాట జరిగింది. అధికారులకు జనాన్ని కంట్రోల్ చేయడం తలకు మించిన భారంగా మారింది. ఈ దుర్ఘటనలో ఒకరు మరణించగా.. చాలా మంది గాయపడ్డారు. బాధితులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

షాక్ గురైన స్వప్న చౌదరీ
తన నృత్య కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకోవడంతో స్వప్న చౌదరి షాక్ గురయ్యారు. అర్ధాంతరంగా కార్యక్రమాన్ని నిర్వాహకులు రద్దు చేశారు. నిర్వాహకులు అశ్రద్ద వల్లే ఈ దుర్ఘటన చోటుచేసుకొన్నదని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో నిర్వాహకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











