అర్ధరాత్రి అలాంటి ఆలోచనలు.. మిడ్ నైట్ వైబ్స్ అంటూ నటి ప్రియ వీడియో వైరల్

తెలుగు సినీ, బుల్లితెర ప్రేక్షకులకు నటి ప్రియ అంటే పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమాలు, సీరియల్స్‌తో తెలుగునాట మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు ప్రియ. 45 ఏళ్ల వయసులోనూ చెక్కుచెదరని గ్లామర్‌తో దూసుకెళ్తున్నారు ప్రియ. ప్రస్తుతం అమ్మ, అక్క, వదిన, అత్త పాత్రలతో మంచి డిమాండ్ ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నిలిచారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే శైలజా ప్రియ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..

మాస్టర్ మూవీతో వెండితెర ఎంట్రీ
ఏపీలోని బాపట్లకు చందిన ప్రియ కుటుంబం తర్వాత హైదరాబాద్‌కు మకాం మార్చింది. ముగ్గురు తోబుట్టువుల్లో ప్రియ చివరి వారు. చదువుకుంటున్న రోజుల్లోనే మోడల్‌గా చేసిన ప్రియ... పలు కాంపిటీషన్స్‌లో గెలుపొందారు. బీఏ పూర్తి చేసిన అనంతరం నటనవైపు అడుగులు వేశారు. సీరియల్స్, సినిమాలు ఇలా ఎందులో అవకాశం ఉంటే అది చేసుకుంటూ వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన మాస్టర్ మూవీ ద్వారా వెండితెరపై అడుగుపెట్టిన ప్రియకు ఆ తర్వాత హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్స్, చిన్నాచితకా పాత్రలు వచ్చాయి.

Bigg Boss Fame Shailaja Priya s Late Night Drive Video Goes Viral on Instagram

బిగ్‌బాస్‌లో ఫైర్ బ్రాండ్‌గా
రాజకుమారుడు, గోకులంలో సీత, కత్తి కాంతారావు, మిర్చి, సన్నాఫ్ సత్యమూర్తి, రారండోయ్ వేడుక చూద్దాం సహా కెరీర్‌లో దాదాపు 200కు పైగా సినిమాల్లో నటించారు శైలజా ప్రియ. ఇదే సమయంలో బుల్లితెరపైనా సత్తా చాటారు. లేడీ డిటెక్టివ్, సంఘర్షణ, జ్వాల, కొత్త బంగారం, మానస, చిన్న కోడలు, కృష్ణ ముకుందా మురారి, శశిరేఖా పరిణయం, నెం 1 కోడలు, నంది వర్సెస్ నందిని తదితర సీరియల్స్‌తో ఇక్కడా సత్తా చాటారు. అనూహ్యంగా బిగ్‌బాస్‌ తెలుగులోనూ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి 7 వారాల పాటు హౌస్‌లో ఉన్నారు. ఇటీవల ఆది సాయికుమార్ హీరోగా వచ్చిన శంబాలలో ప్రియ కీలకపాత్ర పోషించారు.

పదేళ్లు నటనకు దూరం
2002లో మాచిరాజు వెంకట కిశోర్‌ను పెళ్లి చేసుకున్నారు శైలజ ప్రియ.. ఈ దంపతులకు నిశ్చయ్ అనే కుమారుడు ఉన్నాడు. పెళ్లి తర్వాత భర్త, కుమారుడు, కుటుంబం కోసం దాదాపుప పదేళ్ల పాటు నటనకు దూరంగా ఉన్నారు ప్రియ. ఆ తర్వాత తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఆమె దూసుకెళ్తున్నారు. సీరియల్స్, సినిమాల ద్వారా శైలజ ప్రియ బాగానే సంపాదిస్తున్నారు. షూటింగ్స్, ఇతర పనులతో బిజీగా ఉన్నప్పటికీ కుటుంబం, స్నేహితులతో సమయాన్ని గడుపుతూనే ఉంటారు ప్రియ.

ఫ్రెండ్స్‌తో రచ్చ
45 ఏళ్ల వయసులోనూ హీరోయిన్లను మించిన గ్లామర్‌తో మెరిసిపోతున్నారు ఈ సీనియర్ నటి. సోషల్ మీడియాలోనూ ఆమెకు భారీ ఫాలోయింగ్‌ ఉండటంతో స్టార్స్‌కి పోటీ ఇస్తున్నారు. ఆమె ఏ పోస్ట్ పెట్టినా క్షణాల్లో వైరల్ అయిపోతోంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. అర్ధరాత్రి కారులో ఫ్రెండ్స్‌తో హైదరాబాద్ వీధుల్లో చక్కర్లు కొడుతూ పాటలు పాడుతూ ఎంజాయ్ చేస్తున్నారు ప్రియ. ఓ పాపులర్ హిందీ సాంగ్‌ను హమ్ చేస్తూ ఆమె అల్లరి చేశారు. ఈ పోస్ట్‌కు లేట్ నైట్స్... జెంటిల్ థాట్స్ అంటూ రాసుకొచ్చారు. అది చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X