40 ఏళ్లు దాటాక వెంటాడుతున్న ఆ డేంజర్... నటి ప్రియ ఎమోషనల్

తెలుగునాట క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీగా ఉంటున్నారు నటి ప్రియ. సినిమాలతో పాటు బుల్లితెరపైనా సత్తా చాటి దూసుకెళ్తున్నారు. 45 ఏళ్ల వయసులోనూ చెక్కు చెదరని అందాలతో కుర్ర భామలకు పోటీ ఇస్తూ స్టైలీష్ మదర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు ప్రియ. ఈ ఏజ్‌లోనూ అప్‌డేట్‌గా ఉంటూ ఫ్యాషన్, స్టైల్ విషయంలో తనకు తిరుగులేదని నిరూపించింది ఈ ముద్దుగుమ్మ. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ప్రియ.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..

ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్లకు చెందిన ప్రియ పూర్తి పేరు.. మామిళ్ల శైలజా ప్రియ. హైదరాబాద్‌లోనే డిగ్రీ చేసిన ప్రియ చదువుతున్న రోజుల్లోనే నటన, మోడలింగ్ వైపు అడుగులు వేశారు. తొలుత మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన మాస్టర్ మూవీ ద్వారా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. అనంతరం హీరోయిన్‌లకు ఫ్రెండ్ క్యారెక్టర్స్, ఇతర సహాయక పాత్రలు చేస్తూ వచ్చింది. ఎలాంటి రోల్ వచ్చినా సరే దానిని వదిలిపెట్టకుండా సద్వినియోగం చేసుకుంటోంది ప్రియ. రాజకుమారుడు, గోకులంలో సీత, కత్తి కాంతారావు, మిర్చి, సన్నాఫ్ సత్యమూర్తి, రారండోయ్ వేడుక చూద్దాం సహా కెరీర్‌లో దాదాపు 200కు పైగా సినిమాల్లో నటించారు శైలజా ప్రియ.

Bigg Boss Fame Shailaja Priya Stuns Fans with Style at 45 Viral Instagram Post Sparks Buzz

2002లో మాచిరాజు వెంకట కిశోర్‌ను పెళ్లి చేసుకున్నారు శైలజ ప్రియ.. ఈ దంపతులకు నిశ్చయ్ అనే కుమారుడు ఉన్నాడు. పెళ్లి తర్వాత భర్త, కుమారుడు, కుటుంబం కోసం దాదాపు 10 ఏళ్ల పాటు సినీరంగానికి దూరంగా ఉన్నారు ప్రియ. ఆ తర్వాత పరిస్ధితులు చక్కబడటంతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. సినిమాలు, సీరియల్స్‌లో ఏకధాటిగా నటించారు. లేడీ డిటెక్టివ్, సంఘర్షణ, జ్వాల, కొత్త బంగారం, మానస, చిన్న కోడలు, కృష్ణ ముకుందా మురారి, శశిరేఖా పరిణయం, నెం 1 కోడలు, నంది వర్సెస్ నందిని తదితర సీరియల్స్‌తో కుటుంబ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు.

ఇక.. బిగ్‌బాస్‌ రియాలిటీ షో ఆమెను మరింత పాపులర్ చేసింది. ఈ జనరేషన్‌కు ప్రియను దగ్గర చేసి మరిన్ని అవకాశాలు క్యూకట్టేలా చేసింది. బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా 7 వారాల పాటు హస్‌లో ఉండి విశ్లేషకులకు షాకిచ్చారు. టాస్క్‌లు, గేమ్స్‌లో కుర్రాళ్లతో తలపడుతూ తనలో వాడి వేడి ఏమాత్రం తగ్గలేదని ప్రూవ్ చేసుకున్నారు. మాటలతోనూ, చేతలతోనూ తన జోలికి వచ్చే వారికి అప్పటికప్పుడే ఇచ్చిపడేస్తూ ఫైర్ బ్రాండ్ అనిపించుకున్నారు.

సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ప్రియ.. తన సినిమాలు, సీరియల్స్, షూటింగ్స్ ఇతర వ్యక్తిగత వివరాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అలాగే సమాజంలో జరుగుతున్న అంశాలపై తన అభిప్రాయాలను తెలియజేస్తుంటారు. ఇక ఫోటోషూట్‌లతోనూ ప్రేక్షకులను మైండ్ బ్లాంక్ చేస్తుంటారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.

ఈసారి 40 ఏళ్లు దాటిన ఆడవారి పరిస్ధితి గురించి, వారి ఆలోచనా విధానం గురించి శైలజ ఆసక్తికరంగా పోస్ట్ పెట్టారు. 40 తర్వాత జీవితం... నా ఫ్యాషన్ ఎట్టకేలకు నా ఆత్మవిశ్వాసానికి సరిగ్గా సెట్ అయ్యింది. సౌకర్యంగా, హుందాగా ఉంది. అయితే ఇందులో కొంత డేంజర్ కూడా ఉందని శైలజ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆమె పోస్ట్‌పై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు.

Read more about: bigg boss priya
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X