దీప్తి సునైనాతో బ్రేకప్.. ప్రియురాలితో షణ్ముఖ్ ఎంగేజ్‌మెంట్, అమ్మాయి బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
టాలీవుడ్‌లో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఫిబ్రవరి 26వ తేదీన విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నలు పెళ్లి చేసుకోబోతున్నారు. ఆ తర్వాత మార్చి 6వ తేదీన మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చిన్నకుమారుడు అల్లు శిరీష్ - నయనిక రెడ్డిల వివాహం జరగనుంది. తాజాగా బిగ్‌బాస్ తెలుగు కంటెస్టెంట్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ షణ్ముఖ్ జస్వంత్ తన ప్రియురాలితో సైలెంట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ వార్త బుల్లితెర వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వివరాల్లోకి వెళితే..
విశాఖపట్నానికి చెందిన షణ్ముఖ్ జస్వంత్.. గీతం యూనివర్సిటీలో చదువుకున్నాడు. చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఉండటంతో తన సోదరుడు వినయ్ షణ్ముఖ్‌తో కలిసి పలు షార్ట్ ఫిలింస్ చేశాడు. ఈ క్రమంలో తన మిత్రులతో కలిసి చేసిన వైవా అనే కామెడీ షార్ట్ ఫిలింతో వీరంతా ఫేమస్ అయ్యారు. ఈ ఒక్క వీడియోతో వీరి యూట్యూబ్ ఛానెల్ బాగా పాపులర్ అయ్యింది. ఇందులో నటించిన వైవా హర్ష.. ఇప్పుడు స్టార్ కమెడియన్ రేసులో దూసుకెళ్తున్నాడు. అటు షణ్ముఖ్‌కు తెలుగు బుల్లితెరపై అవకాశాలు వచ్చాయి.

ఆ తర్వాత షణ్ముఖ్ చేసిన సూర్య, సాఫ్ట్‌వేర్ డెవలపర్ తదితర వెబ్ సిరీస్‌లు యువతలో ఆయనకి మంచి క్రేజ్ తీసుకొచ్చాయి. ఈ క్రమంలో ఫేమస్ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు 5లో కంటెస్టెంట్‌గా షణ్ముఖ్ జస్వంత్‌కు అవకాశం దొరికింది. ఈ సీజన్‌లో తన అద్భుతమైన ఆటతీరు, దూకుడుతో రన్నరప్‌గా నిలిచి మరింత పాపులర్ అయ్యారు. ఈ క్రమంలో షన్నూకి సినిమాలలోనూ అవకాశం దక్కింది. నన్నుదోచుకుందువటే, లీలా వినోదం తదితర సినిమాలలో నటించారు. వీటితో పాటు పలు మ్యూజిక్ ఆల్బమ్స్‌లోనూ సత్తా చాటారు.
కాగా.. తనతో పాటు కొన్ని షార్ట్ ఫిలింస్‌లో నటించిన యూట్యూబర్ దీప్తి సునైనాతో షణ్ముఖ్ ప్రేమలో పడి ఇద్దరూ కొన్నేళ్ల పాటు డేటింగ్ చేశారు. త్వరలోనే పెళ్లి అనుకుంటూ ఉండగా.. అనూహ్యంగా ఈ జంట విడిపోయింది. వీరి బ్రేకప్‌పై మీడియాలో రకరకాల కథనాలు వచ్చాయి. అయితే బిగ్‌బాస్‌లో షణ్ముఖ్ ప్రవర్తన నచ్చకే అతనితో సునైనా రిలేషన్ కట్ చేసుకుందని ప్రచారం జరిగింది. వీరిద్దరూ మళ్లీ కలవాలని అభిమానులు బలంగా కోరుకున్నారు. కానీ ఇద్దరూ తమ కెరీర్‌పైనే ఫోకస్ పెట్టారు. దీప్తి తన వీడియోలు, మ్యూజిక్ ఆల్బమ్స్‌తో బిజీగా ఉన్నారు. ఆమె ఒంటరిగానే లైఫ్ లీడ్ చేస్తుండగా.. షన్నూ మాత్రం మరోసారి ప్రేమలో పడ్డాడు.
ఈ ఏడాది ప్రారంభంలో తాను ప్రేమలో పడినట్లు అమ్మాయితో కలిసున్న ఫోటోలను షేర్ చేశాడు షణ్ముఖ్. అయితే అందులో ఆమె వివరాలు కానీ, ముఖం కానీ కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. కేవలం ఇంగ్లీష్ అక్షరం వీ అనే పేరుతో హింట్ ఇచ్చాడు. ఈసారి సైలెంట్‌గా షాకిచ్చాడు షణ్ముఖ్. ఆ అమ్మాయితోనే ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. ప్రియురాలి వేలికి ఉంగరం తొడుగుతూ త్వరలోనే ఆమెను పెళ్లి చేసుకుంటున్నట్లు అనౌన్స్ చేశాడు. తనకు కాబోయే భార్య పేరు వైష్ణవి చోడిశెట్టి అని తనొక ఇన్‌ఫ్లూయెన్సర్ అని వివరాలు పంచుకున్నాడు. త్వరలోనే వైష్ణవి మెడలో మూడు ముళ్లు వేయనున్నాడు షణ్ముఖ్. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా అభిమానులు ఈ జంటకు విషెస్ తెలియజేస్తున్నారు.


Click it and Unblock the Notifications











