‘ఇండస్ట్రీలో నాపై అలాంటి కుట్ర... యూట్యూబర్ పవర్ ఏంటో చూపించా’
షణ్ముఖ్ జస్వంత్.. యూట్యూబ్‌లో సంచలనం సృష్టించి ఎంతోమంది యువతను షార్ట్ ఫిలింస్, వెబ్ సిరీస్‌ల వైపు నడిపించాడు. చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఉండటంతో తన సోదరుడు వినయ్ షణ్ముఖ్‌తో కలిసి పలు షార్ట్ ఫిలింస్ చేశాడు. ఈ క్రమంలో తన మిత్రులతో కలిసి చేసిన వైవా అనే కామెడీ షార్ట్ ఫిలింతో వీరంతా ఫేమస్ అయ్యారు. ఇందులో నటించిన వైవా హర్ష.. ఇప్పుడు టాలీవుడ్‌లో స్టార్ కమెడియన్ రేసులో దూసుకెళ్తున్నాడు.
షణ్ముఖ్ చేసిన సూర్య, సాఫ్ట్‌వేర్ డెవలపర్ తదితర వెబ్ సిరీస్‌లు యువతలో ఆయనకి మంచి క్రేజ్ తీసుకొచ్చాయి. ఈ క్రమంలో బిగ్‌బాస్ తెలుగు 5లో రన్నరప్‌గా నిలిచి మరింత పాపులర్ అయ్యారు. ఈ ఫేమ్‌తో షన్నూకి సినిమాలలోనూ అవకాశం దక్కింది. నన్నుదోచుకుందువటే, లీలా వినోదం తదితర సినిమాలలో నటించారు. వీటితో పాటు పలు మ్యూజిక్ ఆల్బమ్స్‌లోనూ సత్తా చాటారు. తనతో పాటు షార్ట్ ఫిలింస్‌లో నటించిన దీప్తి సునైనాతో ప్రేమాయణం సాగించాడు షన్నూ. అయితే అనూహ్యంగా ఈ జంట విడిపోయింది. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షణ్ముఖ్ జస్వంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..

మీతో పాటు యూట్యూబ్‌లో కెరీర్ స్టార్ట్ చేసినవాళ్లు ఎక్కడో ఉన్నారు? మీరు మాత్రం ఇంకా బిగ్‌స్క్రీన్ మీదకి ఎందుకు వెళ్లలేదని యాంకర్ ప్రశ్నించగా.. నాకు చాలా సినిమాల్లో ఆఫర్స్ వచ్చాయి. చాలామంది తను చేయడు, తను యూట్యూబ్ మెగాస్టార్ అంట అనే టాక్ బయట స్ప్రెడ్ చేశారు. షన్నూ చేయడు, యూట్యూబ్ మెగాస్టార్ అన్న ట్రీట్‌మెంట్ ఇస్తేనే అప్పుడు మూవీస్ చేస్తాడని వేరే వేరే వాళ్లు.. వేరే రకంగా నా గురించి రాంగ్ ప్రాపగాండ చేశారు. నేను బయట మూవీ చేస్తున్నప్పుడు.. మీరు చేయరట కదా బ్రో.. యూట్యూబ్ మెగాస్టార్ అంట కదా అని నాతోనే అనేవారు. నేను మీకు తెలుసా? అని అడిగితే.. తెలియాల్సిన అవసరం లేదు. నీ చుట్టుపక్కల అదే అంటున్నారు నీ గురించి అని చెప్పారు. సినిమా గురించే కదా సార్ మేమంతా ఇక్కడికి వచ్చింది అని అన్నా.. యూట్యూబ్ మెగాస్టార్‌ను మేం హ్యాండిల్ చేయలేమని మాకు ఫీలింగ్ వచ్చింది అని కౌంటర్ వేసేవారని షణ్ముఖ్ జస్వంత్ అన్నారు.
సినిమాలలో ఆఫర్లు వచ్చాయి. ఓ సినిమాలో చిన్నదే అయినా చాలా మంచి రోల్ వచ్చింది. అప్పుడు నాకు తెలిసిన వాళ్లలోనే కొందరు.. షన్నూ ఇంకా సినిమాలు చేయలేదు కదా, అతని బదులు నేను చేస్తానని తను చేశాడు. ఇలాంటివి బోల్డెన్నీ జరిగాయి. నేను సీబీఎస్ఈలో చదువుకున్నా ప్రతియేటా మాకు స్పోర్ట్స్ ఈవెంట్స్ ఉండేవి. రన్నింగ్ రేసులో నేను టాప్.. ఫైనల్‌లో కూడా నేనే ముందున్నా, లైఫ్‌లో ఫస్ట్ టైం నా పక్కనోడు ఎక్కడున్నాడో చూసుకున్నా అంతే.. వాడు ముందుకెళ్లిపోయాడు. ప్రాక్టీస్‌లో ఫస్ట్ వచ్చి.. ఫైనల్స్‌లో థర్డ్ ర్యాంక్ రావడంతో తట్టుకోలేకపోయా. పెద్దోడినయ్యా.. హైదరాబాద్ వచ్చా, నా పని నేను చూసుకుంటున్నా. నా కన్నా అందరూ ముందు దూసుకెళ్తున్నారు, నేను మాత్రం అక్కడే ఉండిపోయా. ఒకరితో మనం ఎప్పుడూ పోల్చి చూసుకోకూడదు. విజయ్ దేవరకొండ సార్ కూడా ఎన్నో ఏళ్లు కష్టపడితే కానీ సక్సెస్ రాలేదు. నాతో యాక్ట్ చేసినవాళ్లే అలా ఉంటే, నేను యాక్ట్ చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. మూవీలో ప్రతి అబ్బాయి కనెక్ట్ అవుతాడు. టీజర్ చూస్తే మీకు అర్ధమవుతుందని షణ్ముఖ్ తెలిపారు.
అమృత కాలేజీలో చదువుతున్నప్పుడు నా వల్ల కావడం లేదు.. మానేస్తాను, నా లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ హెవీ అయిపోయిందని చెప్పా. అప్పుడు మా నాన్న ఒకటే అన్నారు. నువ్వు ఈ ఫీల్డ్‌లోకి వెళితే.. నీలాంటి మైండ్ సెట్‌తో తప్పకుండా చాలా ఫేస్ చేస్తావని 2012లోనే చెప్పారు. అందరినీ ఈజీగా నమ్మేస్తాను, మళ్లీ మళ్లీ చెత్త చెత్త వాటిల్లోకి వెళతావేమో, స్థిరంగా ఉండే మైండ్ సెట్ కాదు నీది. నువ్వు స్కూల్సే నాలుగు మారావు, ఇంటరే రెండుసార్లు మారావు అని అప్పుడే చెప్పడంతో ఆశ్చర్యపోయా. నెగిటివ్ అయినా, పాజిటివ్ అయినా దానిని డీల్ చేయాలి. వన్ మిలియన్ వచ్చిందని, 100కే వచ్చిందని కేక్ కటింగ్స్ ఎప్పుడూ చేయలేదు. కంటెంట్ ఈజ్ సెలబ్రేషన్స్ నాకు.. ఒక వీడియో తీసిన తర్వాత అది ఇచ్చే కిక్క్.. నా లైఫ్‌లో ఇప్పటి వరకు ఏది ఇవ్వలేదు. ఒక వీడియో కానీ వెబ్ సిరీస్ కానీ.. ఆ ఆనందం బయటకు చూపించలేను. ఒక యాక్టర్‌ని అని ప్రజలు గుర్తించడం నా జీవితంలో బిగ్గెస్ట్ అని షణ్ముఖ్ అన్నారు.
నేను ఎన్నో ఆడిషన్స్‌కి వెళ్లాను, ఎన్నో సినిమాల్లో ఉండాలి. లాస్ట్ మినిట్‌లో తీసేశారు. కానీ ఆ తీసేయడం కూడా నాకు మంచే చేసింది. ఎందుకంటే అక్కడి మాటలకు నాకు కాలింది. అంతా మీ చేతుల్లోనే ఉందా? మీరేనా నన్ను యాక్టర్‌ని చేయగలరు. నన్ను నేను యాక్టర్‌గా ఎందుకు చేసుకోలేనా? యూట్యూబ్ నా అడ్డా? నా ఛానెల్.. మీరేం చేయగలరు? మీరొచ్చి నన్ను ఆపగలరా? సరే నేను యూట్యూబ్‌లోనే వెబ్ సిరీస్ చేస్తా.. యూట్యూబ్‌లోనే కంటెంట్ చేస్తా, ఇది ఆపగలరా? వాళ్లకి ఆ టైంలో యూట్యూబర్ అంటే వీడికి 200కే వ్యూస్ వస్తే మన సినిమా ప్రమోషన్స్‌కి వాడుకుందాం, హీరో పక్కన పెడితే మనోడు బెండ్ అవుతాడు కదా అనేవారు. నాకు ఆ మైండ్ సెట్ మార్చాలని ఉండేది... మార్చానని జస్వంత్ తెలిపారు.
ఒక యూట్యూబర్‌ని యూట్యూబర్‌లా చూడలేకపోవడం ఒక వెబ్ సిరీస్ వల్లే. జనం ఎక్కడున్నారో అందరూ అక్కడే ఉంటారు. జనం యూట్యూబ్‌లో ఉన్నారు.. చూస్తున్నారు అన్నప్పుడు కోవిడ్ టైంలో అందరూ ఓటీటీకి వచ్చారు. ఓటీటీ డీల్స్ ఇప్పుడు ఈ స్థాయిలో ఎందుకు రన్ అవుతున్నాయి. అవకాశాల్ని నేనే క్రియేట్ చేసుకున్నా. ఏ ప్రొడక్షన్ హౌస్ వాళ్లు నన్ను తీసేశారో... వాళ్లే పిలిచి ఆఫర్ ఇచ్చారు అని షణ్ముఖ్ జస్వంత్ గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications


















