దీప్తి సునైనాతో బ్రేకప్... సీక్రెట్‌గా ప్రియురాలిని పెళ్లాడిన బిగ్‌బాస్ షణ్ముఖ్

సోషల్ మీడియాను రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వారికి దీప్తి సునైనా, షణ్ముఖ్ జస్వంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లుగా, యూట్యూబ్ స్టార్లుగా వీరిద్దరూ తెలుగునాట సంచలనం సృష్టించడంతో పాటు టాలెంట్ ఉంటే సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అవ్వొచ్చని, డబ్బు కూడా సంపాదించొచ్చని నిరూపించారు. వీరిని చూసి చాలామంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లుగా మారారు. షణ్ముఖ్- దీప్తి మధ్య పరిచయం ప్రేమగా మారింది, త్వరలో పెళ్లి చేసుకుంటారని అనుకుంటుండగా ఇద్దరూ బ్రేకప్‌తో విడిపోయారు. ఈ క్రమంలో షణ్ముఖ్ సీక్రెట్‌గా తన ప్రియురాలిని పెళ్లి చేసుకుని షాకిచ్చారు. ఈ వివరాల్లోకి వెళితే..

విశాఖపట్నానికి చెందిన షణ్ముఖ్ జస్వంత్ కండ్రేగుల అలియాస్ షన్నూ.. తొలుత యూట్యూబర్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఈ దశలో కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన వైవా షార్ట్ ఫిల్మ్‌ బ్లాక్‌బస్టర్ కావడంతో ఇందులో నటించిన వారికి మంచి అవకాశాలు వచ్చాయి. వైవాలో నటించిన హర్ష చెముడు.. వైవా హర్షగా మారి ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్ కమెడియన్‌లలో ఒకరిగా దూసుకెళ్తున్నాడు. షణ్ముఖ్ మాత్రం తనకు బాగా పట్టున్న యూట్యూబ్‌లోనే సంచలనం సృష్టించి యూట్యూట్‌లో స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

Bigg Boss Fame Shanmukh Jaswanth ties the knot with Vaishnavi Chodisetti

సాఫ్ట్‌వేర్ డెవలపర్, సూర్య తదితర వెబ్ సిరీస్‌లు షణ్ముఖ్‌కు యువతలో క్రేజ్ తీసుకొచ్చాయి. ఇప్పటికీ ఈ రెండు వెబ్ సిరీస్‌లు యూట్యూబ్‌లో రికార్డ్ వ్యూస్ సాధిస్తూనే ఉన్నాయి. షార్ట్ ఫిలింస్, వెబ్ సిరీస్‌లతో పాటు పలు సినిమాలలో హీరో ఫ్రెండ్‌గా సహాయ పాత్రలు కూడా చేశాడు షన్నూ. అటు హైదరాబాద్‌కి చెందిన దీప్తి సునైనా.. టిక్‌టాక్, డబ్‌స్మాష్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌తో సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సంపాదించి. హాట్ హాట్ ఫోటోషూట్స్, వెబ్ సిరీస్, షార్ట్ ఫిలింస్, మ్యూజిక్ వీడియోలతో కలకలం రేపింది ఈ ముద్దుగుమ్మ. అలా కొన్ని ప్రాజెక్ట్స్‌లో దీప్తి సునైనా, షణ్ముఖ్ కలిసి పనిచేశారు. అలా వీరిద్దరి పరిచయం ప్రేమగా మారి కొన్నేళ్ల పాటు డేటింగ్ చేశారు.

త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని అభిమానులు భావిస్తున్న దశలో బిగ్‌బాస్ తెలుగులో షణ్ముఖ్‌కు అవకాశం లభించింది. అక్కడ టాస్క్‌లు, గేమ్స్, తన వ్యక్తిత్వంతో బుల్లితెర ప్రేక్షకులను అలరించిన ఆయన ఫైనల్‌లో అడుగుపెట్టారు. అయితే గ్రాండ్ ఫినాలేలో షణ్ముఖ్‌ దురదృష్టవశాత్తూ రన్నరప్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బిగ్‌బాస్‌తో తెలుగునాట మరింత పాపులారిటీని సంపాదించిన షణ్ముఖ్ జస్వంత్‌కు దీప్తి సునైనా బ్రేకప్ చెప్పింది. వీరిద్దరి మధ్య బ్రేకప్‌కు దారితీసిన పరిస్ధితులు తెలియరాలేదు. నాటి నుంచి ఇద్దరి దారులు వేరయ్యాయి.

దీప్తి ఎప్పటిలాగే మ్యూజిక్ వీడియోలు, కొన్ని ప్రాజెక్ట్స్‌లలో నటిస్తుండగా.. షణ్ముఖ్ వెబ్‌సిరీస్‌లు చేస్తూ సినిమాలలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారు. దీప్తితో బ్రేకప్ తర్వాత కొన్నాళ్లకు వైష్ణవి చోటిశెట్టితో షణ్ముఖ్ ప్రేమలో పడ్డారు. ఇటీవలే వీరిద్దరికి ఘనంగా ఎంగేజ్‌మెంట్ జరిగింది. అయితే పెళ్లి ఎప్పుడనేది మాత్రం షణ్ముఖ్ చెప్పలేదు. కానీ కొన్నిరోజుల క్రితం షణ్ముఖ్- వైష్ణవిలు జంటగా గృహ ప్రవేశం చేయడంతో వీరిద్దరూ సీక్రెట్‌గా పెళ్లి చేసుకుని ఉండొచ్చని అభిమానులు సరిపెట్టుకున్నారు. తాజాగా షణ్ముఖ్ జస్వంత్ - వైష్ణవి చోడిశెట్టిల పెళ్లి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీరి పెళ్లి ఇవాళే జరిగిందా? లేక పాత ఫోటోలు వైరల్ అవుతున్నాయా అనేది మాత్రం తెలియరాలేదు. మొత్తానికి తన ప్రియురాలిని పెళ్లాడిన షణ్ముఖ్‌కి అభిమానులు, సినీ ప్రముఖులు, సన్నిహితులు సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలియజేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X