బాత్‌రూమ్ వీడియో లీక్.. ఫస్ట్ టైం హద్దులు దాటేసిన తీన్మార్ జ్యోతక్క!
న్యూస్ రీడర్‌గా కెరీర్ ప్రారంభించిన శివజ్యోతి ఇప్పుడు తెలుగునాట సెలబ్రెటీ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్నారు. ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్‌లో ప్రసారమైన తీన్మార్ అనే కార్యక్రమానికి హోస్ట్ చేస్తూ పాపులర్ అయ్యారు. ఆ కార్యక్రమం ఆమె పేరు సావిత్రి.. దీంతో నాటి నుంచి తీన్మార్ సావిత్రిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రేజ్‌తో పలు ఛానెల్స్ ఆమెకు రెడ్ కార్పెట్ పరిచాయి. అనంతరం బిగ్‌బాస్ షో .. శివజ్యోతిని మరింత పాపులర్ చేసింది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..
బిత్తిరి సత్తితో కలిసి అల్లరి
తీన్మార్ కార్యక్రమంలో బిత్తిరి సత్తితో కలిసి శివజ్యోతి చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. ఈ కాన్సెప్ట్ జనాల్లోకి బాగా వెళ్లింది. పలు ఛానెల్స్ ఇదే తరహా కార్యక్రమాలు డిజైన్ చేసి టెలికాస్ట్ చేసినప్పటికీ, తీన్మార్ రేంజ్‌లో క్లిక్ కాలేదు. శివజ్యోతిని పలువురు అనుకరించాలని అనుకున్నప్పటికీ వాళ్లు సక్సెస్ కాలేదు. దీనిని బట్టి జ్యోతిక్క టాలెంట్‌ను అర్ధం చేసుకోవచ్చు. ఈ పాపులారిటీతో బిగ్‌బాస్ తెలుగు 3 సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఛాన్స్ అందుకున్నారు శివజ్యోతి. ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణతో నామినేషన్స్ సమయంలో బయటపడ్డ ఈ ముద్దుగుమ్మ.. చివరి వరకు నిలవలేకపోయింది.

సోషల్ మీడియాలో ఫాలోయింగ్
బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత శివజ్యోతి.. షార్ట్ ఫిలింస్, ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ బిజీ అయ్యింది. సోషల్ మీడియాలో ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య బాగా పెరిగింది. ఇక శివజ్యోతి.. గంగోలి అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి వివాహం గురించి గ్రామంలో తెలియడంతో వారు కట్టుబట్టలతో హైదరాబాద్ వచ్చేశారు. దీంతో మూడేళ్ల పాటు శివజ్యోతిని హాస్టల్‌లో ఉంచి చదివించాడు గంగోలి. ఈ విషయాన్ని బిగ్‌బాస్‌లో ఉన్నప్పుడు చెప్పి ఎమోషనలైంది శివజ్యోతి. వీరి పెళ్లి జరిగి పదేళ్లు పూర్తి కావడంతో ఇటీవల మరోసారి పెళ్లి చేసుకుంది ఈ జంట. పెద్దల సమక్షంలో గుడిలో శివజ్యోతి మెడలో తాళి కట్టి దండలు మార్చుకున్నారు వీరిద్దరూ. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అయ్యింది. పెళ్లయి దాదాపు పదేళ్లు కావొస్తున్నా పిల్లలు లేకపోవడంతో పలుమార్లు ఈ జంట ట్రోలింగ్‌కు గురైంది. దీనికి శివజ్యోతి తనదైన శైలిలో కౌంటరిచ్చింది.
శివజ్యోతి పేరుతో డబ్బుల వసూలు
మొన్నామధ్య శివజ్యోతి పేరుతో కొందరు టెలిగ్రామ్ లింకుల ద్వారా డబ్బులు వసూలు చేసిన వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. దీనిపై స్పందించిన జ్యోతక్క.. ఇలాంటి మోసాలకు ఎవరూ గురికావొద్దని, తనకు ఎలాంటి టెలిగ్రామ్ ఛానెల్ లేదని క్లారిటీ ఇచ్చింది. మరోసారి తన పేరు మీద ఎలాంటి లింక్స్ వచ్చినా వాటిని బ్లాక్ చేయాలని శివజ్యోతి సూచించింది. అలాగే బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలోనూ శివజ్యోతి పేరు వినిపించింది. అయితే వీటిని ఆమె ఖండించింది.
బాత్‌రూమ్ వీడియోతో షాకిచ్చిన శివజ్యోతి
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే శివజ్యోతి ఎప్పటికప్పుడు తన షోలు, ఈవెంట్స్, ఇతర వ్యక్తిగత వివరాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఆమె షేర్ చేసిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో దుమారం రేపుతోంది. ఎప్పుడూ చీరకట్టులో పద్ధతిగా కనిపించే జ్యోతక్క.. ఈసారి మాత్రం హద్దులు దాటేసింది. ఏకంగా బాత్‌రూమ్‌లో స్నానం చేసుకుంటున్న వీడియోను, బట్టలు మార్చుకుంటున్న వీడియోను షేర్ చేసి షాకిచ్చింది. దానికి భర్తను ఇంప్రెస్ చేయడం ఎలా అనే క్యాప్షన్ పెట్టింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు షాక్ అవుతున్నారు.


Click it and Unblock the Notifications











