Don't Miss!
- Sports
INDvsNZ : ఇంకొక్క ఛాన్స్ ఇవ్వండి.. దీపక్ హుడాకు దిగ్గజం మద్దతు!
- News
ఎవరేం చేస్తున్నారో.. అంతా తెలుసు..!: చంద్రబాబు
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Lifestyle
కూల్ డ్రింక్స్ తాగితే పురుషుల్లో జుట్టు రాలుతుందా?
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
దేవుడికి వెరైటీ విన్నపం.. న్యూ ఇయర్ పార్టీలో హిమజ, శివజ్యోతి రచ్చ
బిగ్ బాస్ షోలో ఏర్పడిన బంధాలు బయటకు వచ్చాక కూడా కొనసాగుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా మూడో సీజన్ కంటెస్టెంట్లు మాత్రం ఇంకా అంతే క్లోజ్‌గా కలిసి ఉన్నారు. కలిసి పార్టీలు చేసుకుంటున్నారు. మూడో సీజన్ కంటెస్టెంట్లు చేసినంత రచ్చగా మరెవ్వరూ చేయరు. మూడో సీజన్‌లోనూ కొంత మంది నిత్యం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉంటారు. గ్యాంగులుగా విడిపోయి మరీ రచ్చ చేస్తుంటారు.

కంటెస్టెంట్ల రచ్చ..
బిగ్ బాస్ మూడో సీజన్ కంటెస్టెంట్లలో రవికృష్ణ, శివజ్యోతి, రోహిణి, హిమజ, అషూలు ఒక జట్టుగా ఉంటారు. ఈ ఐదుగురు మాత్రం నిత్యం హల్చల్ చేస్తుంటారు. మూడో సీజన్ కంటెస్టెంట్లకు సంబంధించిన ఏ ఈవెంట్ జరిగినా ఈ ఐదుగురు మాత్రం జట్టుగానే ఉంటారు.

శివజ్యోతి ఇంట్లో..
శివజ్యోతి తన కొత్తింట్లోకి అడుగుపెట్టిన తరుణంలోనూ ఈ కంటెస్టెంట్లు రచ్చ రచ్చ చేశారు. గృహ ప్రవేశం సందర్భంగా రాహుల్, వరుణ్, వితిక, హిమజ, అషూ, శివకృష్ణ ఇలా అందరూ సందడి చేశారు. ప్రతీ పండుగకు కూడా కూడా హిమజ, శివజ్యోతి, రవికృష్ణ, రోహిణి మాత్రం కలుస్తుంటారు.

తాజాగా అలా..
న్యూ ఇయర్ వేడుకలను కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్లు బాగానే జరుపుకున్నారు. హిమజ, శివజ్యోతి, రవికృష్ణ, రోహిణి కలిసి జరుపుకున్నారు. వీటికి సంబంధించిన ఫోటోలను హిమజ షేర్ చేస్తూ దేవుడిని వింత కోరికలు కోరుకుంది. ప్రస్తుతం హిమజ విన్నపాలు మాత్రం ఫుల్ వైరల్ అవుతున్నాయి.

వెరైటీ విన్నపాలు..
దేవుడా ఈ 2021లో ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్లకి తగ్గిపోవాలి.. లోన్స్ ఉన్న వాళ్లకి అవి క్లియర్ అయిపోవాలి.. ఎగ్జామ్స్ ఉన్న వాళ్లు పాస్ అయిపోవాలి.. జాబ్స్ లేని వాళ్లకు జాబ్స్ రావాలి.. లావున్నామని అనుకున్న బరువు తగ్గాలి.. అన్నింటికన్న ముందు నువ్ నా పోస్ట్ చూడటానికి ఆన్ లైన్‌లోకి రావాలి.. ఇంతకీ ఏ హ్యాష్ ట్యాగ్ వాడాలి తండ్రీ అంటూ హిమజ వెరైటీ పోస్ట్ చేసింది.